twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దటీజ్ బాలకృష్ణ.. సింగిల్ టేక్‌లో దానవీరశూరకర్ణ డైలాగ్.. ఎన్టీఆర్‌ను మరిపించేలా..

    By Rajababu
    |

    విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవితకథ ఆధారంగా తెరకెక్కనున్న 'ఎన్టీఆర్' చిత్రం షూటింగ్ గురువారం ఉదయం అట్టహాసంగా మొదలైంది. హైదరాబాద్‌ నాచారంలోని రామకృష్ణా హార్టీకల్చరల్‌ సినీ స్టూడియోస్‌లో యన్‌టిఆర్‌ బయోపిక్‌‌ ప్రారంభోత్సవ వేడుకకు భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

    Recommended Video

    ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభోత్సవంలో బాలయ్య పవర్‌ఫుల్ స్పీచ్

    ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, రాఘవేంద్రరావు, పూరీ జగన్నాథ్, బోయపాటి శ్రీను, ఎస్వీ కృష్ణారెడ్డి, ఎస్ గోపాల్, జీవితా రాజశేఖర్, జమున తదితరులు హాజరయ్యారు. ముహుర్తం షాట్ సందర్భంగా బాలయ్య చెప్పిన డైలాగ్స్ సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

     దానవీరశూర కర్ణ చిత్రంలోని

    దానవీరశూర కర్ణ చిత్రంలోని

    నందమూరి నటసింహం బాలకృష్ణ ధరించిన ధుర్కోధనుడి పాత్రపై తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ క్లాప్ కొట్టిన సీన్‌ను తొలి సన్నివేశంగా చిత్రీకరించారు. గతంలో దానవీరశూర కర్ణ చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవంలో జరిగిన సన్నివేశాన్ని ఎన్టీఆర్ బయోపిక్‌కు ఉపయోగించుకోవడం గమనార్హం.

    ఎంజీఆర్ ప్రత్యేక అతిథిగా

    ఎంజీఆర్ ప్రత్యేక అతిథిగా

    స్వర్గీయ ఎన్టీఆర్ తన దానవీర శూర కర్ణ చిత్రాన్ని నాచారంలోని రామకృష్ణా హార్టీ కల్చరల్ సినీ స్టూడియోస్‌లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఎంజీఆర్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఎన్టీఆర్ బయోపిక్‌లోని అదే సీన్‌పై ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు క్లాప్ కొట్టగా ఈ చిత్రం ప్రారంభమైంది.

    బాలకృష్ణ సింగిల్ టేక్‌లో

    బాలకృష్ణ సింగిల్ టేక్‌లో

    దాన వీర శూర కర్ణ చిత్రంలోని ఎన్టీఆర్ చెప్పిన ఏమంటి వేమంటివి అనే డైలాగ్‌ను బాలకృష్ణ సింగిల్ టేక్‌లో ఓకే చేయడం విశేషం. బాలకృష్ణ ఏకధాటిగా ఎలాంటి తటపటాయింపు లేకుండా డైలాగ్ పూర్తి చేయడంతో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, దర్శకులు రాఘవేంద్రరావు, ఇతర సినీ, రాజకీయ ప్రముఖులు అభినందించారు.

    ధుర్యోధనుడి వేషధారణలో

    ధుర్యోధనుడి వేషధారణలో

    ఎన్టీఆర్ మాదిరిగానే బాలకృష్ణ డైలాగ్స్ చెప్పడంతో సినీ ప్రముఖులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. ధుర్యోధనుడి వేషధారణలో ఎన్టీఆర్‌ను గుర్తు తెచ్చారని పలువురు పేర్కొనడం విశేషం. అలాగే దానవీరశూరకర్ణ చిత్రంలో ఎన్టీఆర్ చెప్పిన మాదిరిగానే, అవే హావభావాలతో, ఒకే టైమింగ్‌తో బాలకృష్ణ డైలాగ్ చెప్పడం అభిమానులను ఆనందపరిచింది.

    ఎంజీఆర్ పాత్ర ధరించిన వ్యక్తి

    ఎంజీఆర్ పాత్ర ధరించిన వ్యక్తి

    ఇదిలా ఉండగా, ముహుర్తం షాట్‌లో ఎంజీఆర్ పాత్ర ధరించిన వ్యక్తి ఎవరనే చర్చ మొదలైంది. అయితే అతడు తమిళనాడులో అన్నాడిఎంకే పార్టీ తరఫున ఎంజీఆర్ గెటప్‌లో ప్రచారం చేసే వ్యక్తి అని తెలిసింది. అచ్చం ఎంజీఆర్ మాదిరిగా ఉండే వ్యక్తిని ప్రత్యేకంగా తొలిషాట్‌ కోసం చిత్ర యూనిట్ హైదరాబాద్‌కు రప్పించింది.

    English summary
    Nandamuri Balakrishna Powerful Speech at NTR Biopic Movie Launch Event. #NTRBiopic, is launching on 29 March 2018, at Ramakrishna Studios, Hyderabad, by the Honorable Vice President of India, Sri M. Venkaiah Naidu garu, as the Chief Guest. The legendary life of Nandamuri Taraka Rama Rao, famously known as NTR, is now being made into a bio-pic, by Director Teja on the Banner of Vaaraahi Chalana Chitram. Nandamuri Balakrishna, the son of the famous actor, NTR, is not only acting in the lead role, but also producing it with Sai Korrapaati and Induri Vishnuvardhan. This movie is set to be made in Telugu and Hindi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X