»   » అది నాన్నగారి భిక్షే: ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభోత్సవంలో బాలయ్య పవర్‌ఫుల్ స్పీచ్

అది నాన్నగారి భిక్షే: ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభోత్సవంలో బాలయ్య పవర్‌ఫుల్ స్పీచ్

Posted By:
Subscribe to Filmibeat Telugu
ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభోత్సవంలో బాలయ్య పవర్‌ఫుల్ స్పీచ్

మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తేజ దర్శకత్వంలో తెరకెక్కనున్న బయోపిక్ 'ఎన్టీఆర్' చిత్ర ప్రారంభోత్సవం గురువారం ఉదయం నాచారంలోని రామకృష్ణ స్టూడియోస్‌లో జరిగింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణ పోషిస్తున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎన్టీఆర్ పోషించిన పాపులర్ పాత్రల్లో ఒకటైన దుర్యోధనుడి గెటప్‌లో బాలయ్య హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన పవర్‌ఫుల్ స్పీచ్ అభిమానులను ఆకట్టుకుంది.

మహానుభావుడు అనే మాటకు నిలువెత్తు నిదర్శనం

మహానుభావుడు అనే మాటకు నిలువెత్తు నిదర్శనం

ఎన్టీఆర్ గారు నాకు కేవలం తండ్రిగానే కాకుండా గురువు, దైవం అంతా ఆయనే. ఎన్టీఆర్ అనే మాట ఒక హృదయ స్పందన. తెలుగువారి గుండె చప్పుడు. ఈ భూమ్మీద ఎందరో పుడతారు... కానీ అందరూ మహానుభావులు కాలేరు. మహానుభావులు అంటే నా లెక్కలో ఒక శంకరాచార్యులవారు, రామానుజార్యులవారు, ఒక అంబేద్కర్ గారు, ఒక గౌతమీ పుత్ర శాతకర్ణి, ఒక మహాత్మా గాంధీ... ఇపుడు మనకు ఎన్టీఆర్ గారు ఒక నిలువెత్తు నిదర్శనం... అని బాలయ్య తెలిపారు.

ఎన్టీఆర్ అంటే....

ఎన్టీఆర్ అంటే....

'ఎన్' అంటే నటనాలయం. ఆయన ఇల్లే నటనాలయం. ఆయన నటరాజు నటసింహుడు. 'టీ' అంటే తారా మండలంలోని ధ్రువతారకుడు. 'ఆర్' అంటే రాజర్షి, రారాజు, రాజకీయ దురంధరుడు... అని బాలయ్య చెప్పుకొచ్చారు.

నా అదృష్టం అని చెప్పిన బాలయ్య

నా అదృష్టం అని చెప్పిన బాలయ్య

ఎన్టీఆర్ కేవలం కళ కోసమే కాదు, సమాజం కోసం పని చేశారు. ఆయన చరిత్ర శాశ్వతంగా నిలిచిపోవాలి, భావితరాలకు తెలియాలి అనే ఒక తలంపుతో ఈ సినిమా మొదలు పెట్టాం. అదే విధంగా రామరావుగారి పాత్ర వేరే ఎవ్వరూ చేయలేరు, ఆ అదృష్టం నాకు కలిగినందుకు సంతోషంగా ఉంది.... అని బాలయ్య తెలిపారు.

రామారావుగారికి ఎవరూ పోటీ లేరు, అదంతా ఆయన పెట్టిన భిక్ష

రామారావుగారికి ఎవరూ పోటీ లేరు, అదంతా ఆయన పెట్టిన భిక్ష

రామారావుగారికి ఎవరూ పోటీ లేరు. ఆయనతో పోటీ పడాలంటే కొండతో పొట్టేలు ఢీ కొట్టినట్లు, సింహ రాజును కుందేలు ఎదురించినట్లు ఉంటుంది. ఆయన జాతీయ స్థాయిలో కూడా రాజకీయల్లో ఎన్నో మార్పులకు కారణం అయ్యారు. ఆయన ఆదర్శంతో ఎన్నో పార్టీలు జాతీయ స్థాయిలో ఉన్నాయి. అదంతా రామారావుగారు పెట్టిన బిక్ష. ఎన్నో రాష్ట్రాల్లో ఆయన ఆలోచన చేసిన పథకాలు అమలు అవుతున్నాయి. యావత్ భారత దేశం గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి నందమూరి తారక రామారావుగారు.... అని బాలయ్య తెలిపారు.

బాలయ్య స్పీచ్ వీడియో

బాలయ్య పూర్తి ప్రసంగానికి సంబంధించిన వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

English summary
Nandamuri Balakrishna Powerful Speech at NTR Biopic Movie Launch Event. #NTRBiopic, is launching on 29 March 2018, at Ramakrishna Studios, Hyderabad, by the Honorable Vice President of India, Sri M. Venkaiah Naidu garu, as the Chief Guest. The legendary life of Nandamuri Taraka Rama Rao, famously known as NTR, is now being made into a bio-pic, by Director Teja on the Banner of Vaaraahi Chalana Chitram. Nandamuri Balakrishna, the son of the famous actor, NTR, is not only acting in the lead role, but also producing it with Sai Korrapaati and Induri Vishnuvardhan. This movie is set to be made in Telugu and Hindi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X