»   » బాలయ్య మాస్ లుక్: 102వ చిత్రం ప్రారంభం (ఫోటోస్)

బాలయ్య మాస్ లుక్: 102వ చిత్రం ప్రారంభం (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

నంద‌మూరి బాల‌కృష్ణ 102వ చిత్రం గురువారం ఉద‌యం హైద‌రాబాద్ రామోజీఫిలిం సిటీలో ప్రారంభ‌మైంది. సి.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప్రై.లి బ్యాన‌ర్‌పై కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ముహుర్త‌పు స‌న్నివేశానికి బోయ‌పాటి శ్రీను క్లాప్ కొట్ట‌గా, బి.గోపాల్ కెమెరా స్విచ్చాన్ చేశారు. తొలి స‌న్నివేశానికి క్రిష్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. పూరితో చేస్తున్న 101వ మూవీ 'పైసా వసూల్' చిత్రంలో స్టైలిష్ లుక్ కనిపించిన బాలయ్య.... ఈ 102వ సినిమాలో బాలయ్య మాస్ లుక్‌ అభిమానులను అలరించబోతున్నారు.

హిట్ గ్యారంటీ అంటున్న దర్శకడు

హిట్ గ్యారంటీ అంటున్న దర్శకడు

ద‌ర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వికుమార్ మాట్లాడుతూ... 18 సంవ‌త్స‌రాలు త‌ర్వాత తెలుగులో నేను డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది. అది కూడా బాల‌కృష్ణ‌గారితో సినిమా చేయ‌డం ఆనందంగా ఉంది. బాల‌య్య‌గారితో తొలిసారి చేస్తున్న సినిమా. గ‌తంలో రెండు, మూడు సార్లు ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ ఇప్ప‌టికి సినిమా చేసే అవ‌కాశం క‌లిగింది. సినిమా ప్రారంభం కంటే ముందుగానే సినిమా బిగ్ హిట్ అని భావిస్తున్నాను. నాతో ఉన్న టీమ్ బాగా కుద‌ర‌డంతో పాజిటివ్‌గా క‌న‌ప‌డుతుంది అన్నారు.

అప్పుడే చేయాల్సింది, కానీ కుదర్లేదు

అప్పుడే చేయాల్సింది, కానీ కుదర్లేదు

సి.క‌ల్యాణ్ మాట్లాడుతూ.... వాస్తవానికి బాల‌కృష్ణ‌గారి 101వ సినిమా ఇదే కావాల్సింది. కానీ ర‌వికుమార్‌గారు బిజీగా ఉండ‌టం, బాల‌కృష్ణ‌గారు కూడా పూరితో 101వ సినిమా మొదలు పెట్టడంతో కాస్త ఆలస్యం అయింది. పూరి మేకింగ్ బావుంటుంది. బాల‌కృష్ణ‌గారి 101వ సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

Balakrishna to romance with Charmi Kaur - Filmibeat Telugu
95 శాతం సక్సెస్ ఉన్న డైరెక్టర్

95 శాతం సక్సెస్ ఉన్న డైరెక్టర్

కె.ఎస్‌.ర‌వికుమార్‌గారికి 95 శాతం స‌క్సెస్ ఉంది. ఆయ‌న‌కు సినిమా త‌ప్ప వేరే ఆలోచ‌న ఉండ‌దు. ముందు ఏవో క‌థ‌లు అనుకున్నా, చివ‌ర‌కు గుర్తుండే పోయే సినిమా కావాలనిపించింది. అప్పుడు ర‌త్నం 15 నిమిషాల్లో చెప్పిన క‌థ బాగా న‌చ్చ‌డంతో ఆ క‌థ‌తో సినిమా చేద్దామ‌ని నిర్ణ‌యించుకున్నామని నిర్మాత చిల్లర కళ్యాణ్ తెలిపారు.

మాస్, గుండెలు పిండేసే సెంటిమెంట్

మాస్, గుండెలు పిండేసే సెంటిమెంట్

బాల‌కృష్ణ‌గారి సినిమా అంటే మాస్‌తో పాటు గుండెను పిండేసే ప్రేమాభిమానాలు, సెంటిమెంట్ ఉండాలి. అలాంటి కోవ‌కు చెందిన క‌థ‌తో ముందుకెళ్తున్నాం. చిరంత‌న్ భ‌ట్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. అల్రెడి రెండు హిట్ చిత్రాల‌కు సంగీతం అందించిన చిరంత‌న్ భ‌ట్ ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొడ‌తాడు అనే నమ్మకం ఉంది. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రపీ సినిమాకు ప్లస్సవుతుందని సి. కళ్యాణ్ తెలిపారు.

షూటింగ్ డీటేల్స్

షూటింగ్ డీటేల్స్

ఈ నెలాఖ‌రు వ‌ర‌కు రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జ‌రుగుతుంది. వ‌చ్చే నెల 6 నుండి కుంభ‌కోణంలో షూటింగ్ ఉంటుంది. కుంభ‌కోణం నుండి వ‌చ్చిన త‌ర్వాత వైజాగ్‌, హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుగుతుంది. త‌ర్వాత పాటల చిత్రీక‌ర‌ణ‌తో షూటింగ్ పూర్తి చేస్తాం. సంక్రాంతికి బాల‌కృష్ణ‌గారు ఎలాగైతే సంద‌డి చేస్తారో, అలాగే 2018 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఎక్క‌డా గ్యాప్‌లు లేకుండా షూటింగ్ ప్లాన్ చేశామని సి కళ్యాణ్ తెలిపారు.

నయనతార హీరోయిన్

నయనతార హీరోయిన్

న‌య‌న‌తార‌గారు హీరోయిన్‌గా చేస్తున్నారు. అల్రెడి బాల‌కృష్ణ‌, న‌య‌న‌తార హిట్ కాంబినేష‌న్‌లో రెండు సినిమాలు హిట్ అయ్యాయి. ఇప్పుడు ఇద్ద‌రూ హ్యాట్రిక్ హిట్ కొడ‌తారు. క‌థ విన్న న‌య‌న‌తార‌గారు న‌టించ‌డానికి ఓకే చెప్పారు. ఆమెతో పాటు ఇంకా ఇద్ద‌రు హీరోయిన్స్ కూడా ఉన్నారు. వారెవ‌రనేది త్వ‌ర‌లోనే తెలియజేస్తామని కళ్యాణ్ తెలిపారు.

ఇతర ముఖ్య పాత్రల్లో

ఇతర ముఖ్య పాత్రల్లో

ఈ చిత్రంలో ప్ర‌కాష్ రాజ్‌గారు చాలా గొప్ప క్యారెక్ట‌ర్ చేస్తున్నారు. ఇంకా అశుతోష్ రాణా, అథ‌ర్ చీమా ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్ చేస్తున్నారు. అలాగే బ్ర‌హ్మానందం ఎంట‌ర్‌టైనింగ్ రోల్ చేస్తున్నారని నిర్మాత తెలిపారు.

తెర వెనక

తెర వెనక

ఈ చిత్రానికి ఆర్ట్ః పి.నారాయ‌ణ‌రెడ్డి, ఎడిట‌ర్ః ప్ర‌వీణ్ అంథోని, యాక్ష‌న్ః అన్బ‌రివు, క‌థ‌, మాట‌లుః ఎం.ర‌త్నం, సినిమాటోగ్ర‌ఫీః సి.రాంప్ర‌సాద్‌, మ్యూజిక్ః చిరంత‌న్‌భ‌ట్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః సి.వ‌రుణ్‌, సి.తేజ‌, కో ప్రొడ్యూస‌ర్ః సి.వి.రావు, నిర్మాతః సి.క‌ల్యాణ్‌, ద‌ర్శ‌క‌త్వంః కె.ఎస్‌.ర‌వికుమార్‌.

English summary
Nandamuri Balakrishna’s yet untitled Telugu film, to be directed by KS Ravi Kumar, started rolling here from Thursday. This will be Balakrishna’s 102nd film. According to a producer, the principal shooting began at Ramoji Film City in Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu