For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఏపీ సీఎం జగన్‌తో చిరంజీవి బృందం భేటీ.. బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

  By Manoj
  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల్లో నటసింహా నందమూరి బాలకృష్ణ ఒకరు. ఎన్టీఆర్ వారసుడిగా సినిమాల్లోకి ప్రవేశించిన ఆయన... తక్కువ వ్యవధిలోనే స్టార్ హీరో అయిపోవడంతో పాటు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. సినిమాల పరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ మంచి పేరు తెచ్చుకున్నాడీ నందమూరి హీరో. అందుకే ఇండస్ట్రీలో చాలా మంది ఆయనతో స్నేహంగా ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో లాక్‌డౌన్ సమయంలో జరుగుతున్న పరిణామాలతో బాలయ్య సీరియస్‌గా ఉన్నారు. అలాగే, రెండు రోజుల్లో చిరంజీవి బృందం.. ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డితో భేటీ కానుంది. దీనిని ఉద్దేశిస్తూ ఆయన సినీ పెద్దలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు మీకోసం.!

  ఏకంగా మూడు ఫ్లాప్‌లు.. బాలయ్య ప్లాన్ ఇదే

  ఏకంగా మూడు ఫ్లాప్‌లు.. బాలయ్య ప్లాన్ ఇదే

  గత ఏడాది నందమూరి బాలకృష్ణ మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూడు బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టాయి. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారాయన. ఇందులో భాగంగానే తనకు గతంలో ‘సింహా', ‘లెజెండ్' వంటి భారీ విజయాలను అందించిన బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్నాడీ నందమూరి హీరో.

  ఆ దర్శకులతో సినిమాలపై బాలయ్య క్లారిటీ

  ఆ దర్శకులతో సినిమాలపై బాలయ్య క్లారిటీ

  ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించి కేవలం ఐదు రోజుల షూటింగ్ మాత్రమే పూర్తయింది. ఇందులో బాలయ్య అఘోరా పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఇక, దీని తర్వాత బాలయ్య.. బీ గోపాల్ సహా కొందరు దర్శకులతో సినిమా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, తాజా ఇంటర్వ్యూలో వీటన్నింటినీ ఖండించారాయన.

  సినీ పెద్దల మీటింగులపై బాలయ్య ఆగ్రహం

  సినీ పెద్దల మీటింగులపై బాలయ్య ఆగ్రహం

  లాక్‌డౌన్ కారణంగా సినిమా షూటింగ్‌లకు బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో షూటింగ్‌లు పున: ప్రారంభించడంతో పాటు ఇన్ని రోజులు ఉపాది కోల్పోయిన సినీ కార్మికులను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో చిరంజీవి నేతృత్వంలోని కొందరు ప్రముఖులు తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. దీనికి తనను పిలవకపోవడంపై బాలయ్య ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేశారు.

  బాలయ్య కామెంట్స్.. నాగబాబు రియాక్షన్

  బాలయ్య కామెంట్స్.. నాగబాబు రియాక్షన్

  ‘ఆ మీటింగులకు నన్ను పిలవలేదు. వీళ్లేమైనా మంత్రితో కలిసి భూములు పంచుకుంటున్నారా' అంటూ బాలయ్య చేసిన కామెంట్స్ సంచలనం అయ్యాయి. వీటికి మెగా బ్రదర్ నాగబాబు స్పందించిన విషయం తెలిసిందే. నటసింహా చేసిన కామెంట్లను వెనక్కి తీసుకోవడంతో పాటు చిరంజీవి, మంత్రి తలసానితో పాటు తెలంగాణ ప్రభుత్వానికి సారీ చెప్పాలని డిమాండ్ చేశారు.

  ఎవడైనా బాలయ్యకు మర్యాద ఇవ్వాల్సిందే

  ఎవడైనా బాలయ్యకు మర్యాద ఇవ్వాల్సిందే

  ఇండస్ట్రీలో కోల్డ్ వార్ జరుగుతోందన్న కామెంట్లు వినిపిస్తున్న సమయంలో నందమూరి బాలకృష్ణ ఓ యూట్యూబ్ చానెల్‌తో జరిగిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘నేను కామెంట్స్ చేశాను. దానికి చాలా మంది రియాక్ట్ అవుతున్నారు. కానీ, నేనేమీ మాట్లాడను. ఎవడైనా నాకు మర్యాద ఇవ్వాల్సిందే. అలాంటి వాళ్లనే గౌరవిస్తా' అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

  మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య

  మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య

  జూన్ 10న తన 60వ పుట్టినరోజును జరుపుకోనున్నారు నందమూరి బాలకృష్ణ. దీనిని పురస్కరించుకుని ఆయనను ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా నందమూరి హీరో సినిమాలు, రాజకీయాలతో పాటు తన ఆస్పత్రికి సంబంధించిన ఎన్నో విషయాలు మాట్లాడారు. అదే సమయంలో సినీ పెద్దలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

  Sri Reddy On Balakrishna-Nagababu Issue || ఆయన కింగే మీరే బొంగు... నగ్న సత్యం చెప్పిన శ్రీ రెడ్డి
  ఆయనను కలవడం అవసరమా: బాలకృష్ణ

  ఆయనను కలవడం అవసరమా: బాలకృష్ణ

  ఏపీ సీఎం జగన్‌తో చిరంజీవి బృందం ఈ నెల 9న భేటీ కానుంది. దీనిని ఉద్దేశిస్తూ... ‘నన్ను ఆ మీటింగ్‌కు రమ్మని పెద్దలెవరూ పిలవలేదు. ఎవరో చెబితే తెలిసింది. అయినా.. కరోనా సమయంలో షూటింగ్‌లు, థియేటర్లు ఓపెనింగ్స్ గురించి మాట్లాడాలి కానీ, ఏపీలో సినీ అభివృద్ధి గురించి చర్చించడం ఏంటి.? ఆ మీటింగ్ వల్ల ఏమాత్రం ప్రయోజనం లేదు' అంటూ ఫైర్ అయ్యారాయన.

  English summary
  Nandamuri Balakrishna is an Indian politician and film actor known for his works in Telugu cinema. He is the sixth son of Telugu film actor and former Chief Minister of Andhra Pradesh N. T. Rama Rao.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X