»   » రామ్ చరణ్ ఎన్టీఆర్ ని కాపీ చేసాడు అంటూ పోస్ట్ లు... సోషల్ మీడియాలో ధృవ ని ఆడుకుంటున్నారు

రామ్ చరణ్ ఎన్టీఆర్ ని కాపీ చేసాడు అంటూ పోస్ట్ లు... సోషల్ మీడియాలో ధృవ ని ఆడుకుంటున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ లో అటు నందమూరీ, ఇటు మెగా ఫ్యామిలీ ఈ రెణ్దిటి మధ్యా విపరీతమైన పోటీ ఉంటుంది, ఇక వీరి ఫ్యాన్స్ లో అయితే కొన్ని సార్లు శతృవులుగా మారిన వాళ్ళు కూడా ఉన్నారు. కొద్ది రోజుల క్రితమే పవన్, జూనియర్ అభిమానుల మధ్య గొడవ హత్య వరకూ వెళ్ళిన సంగతి తెలిసిందే. ఒక హీరో ఫ్యాన్స్ కాస్తా మరో హీరోకి యాంటీ ఫ్యాన్స్ గా మారిపోతూ ఉంటారు. ఇదిలా ఉంటే దాదాపుగా గత ముప్పై ఏళ్లుగా నందమూరి వర్సస్ మెగా అంటూ బాక్స్ ఆఫీస్ వద్ద ఫైట్ నడుస్తున్న విషయం తెలిసిందే....అయితే ఆది కాస్త ఇప్పుడు ముదిరి పాకాన పడినట్లుంది....ఆన్‌లైన్ లో రాబోయే రామ్ చరన్ కొత్త సినిమా స్టిల్స్ ఎన్టీఆర్ ని కాపీ కొట్టినవే అంటూ గోల గోల చేస్తున్నారు ఆ ఇరు హీరోల అభిమానులు...

కండలు తిరిగిన శరీరంతో చరణ్ ఒక బీచ్ పక్కన జీన్ ప్యాంట్ వేసుకుని నడుస్తున్న స్టిల్ చూస్తూ ఉంటె 'టెంపర్' సినిమాలో ఇటువంటి సిక్స్ ప్యాక్ తో షర్టు లేకుండా జూనియర్ కూడ జీన్ ప్యాంట్ తో బీచ్ పక్కన నడుస్తూ వెళ్ళిన సీన్ గుర్తుకు వస్తోంది అంటూ 'టెంపర్' సినిమాలోని ఆ సీన్ ను అంత ఘోరంగా చరణ్ కాపీ కొడితే ఎలా అంటూ జూనియర్ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. అంతేకాదు చరణ్ జూనియర్లు ఎంత స్నేహితులైనా అంత ఘోరంగా చరణ్ జూనియర్ ను అనుసరిస్తాడా ? అంటూ సెటైర్లు వేస్తున్నారు జూనియర్ ఫ్యాన్స్.

Nandamuri Fans spreads Negative comments on Ram Charan Fans

ఇది ఇలా ఉండగా లేటెస్ట్ గా విడుదల చేసిన 'ధృవ' టైటిల్ సాంగ్ మేకింగ్ వీడియోలో పవన్ కళ్యాణ్ 'తమ్ముడు' సినిమాలోని చివరి పాట 'ఐ యాం జస్ట్ ట్రావెలర్ లైక్ సోల్జియర్..' అంటూ అప్పట్లో రమణ గోగుల పాడిన పాట గుర్తుకు వస్తోంది అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే చరణ్ అభిమానులు మాత్రం 'ధృవ' టైటిల్ సాంగ్ మేకింగ్ వీడియోలో చరణ్ పడ్డ కష్టం అంతా కనిపించింది అంటూ ఆ స్థాయిలో బాడీ బిల్డ్ చేయడం ఒక చరణ్ కే సాధ్యం అంటూ చరణ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు మెగా అభిమానులు. మొత్తానికి మెగా-నందమూరి ఫ్యాన్స్ తో ఆన్‌లైన్ వార్ మళ్లీ మొదలైనట్లే!!!

Read more about: ram charan teja, ntr
English summary
NTR Fans spreads Negative comments on Ram Charan Fans, sombody posted camparing pics of NTR's Tempur Movie and latest stils from Ram Charan"s Dhruva in face book groups
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu