Just In
- 11 min ago
‘క్రాక్’ తర్వాత నందమూరి బాలకృష్ణతో సినిమా: క్లారిటీ ఇచ్చిన గోపీచంద్ మలినేని
- 56 min ago
నాని హీరోయిన్.. మొత్తానికి పెద్ద హీరోనే పట్టేసింది
- 1 hr ago
రాగిణి ద్వివేదికి మోక్షం.. ఎట్టకేలకు బెయిల్ మంజూరు
- 1 hr ago
ప్రభాస్ సినిమా సీక్రెట్స్ లీక్ చేసిన కృష్ణం రాజు: రిలీజ్ డేట్.. క్యారెక్టర్స్ ఇలా అన్నీ బయట పెట్టారు!
Don't Miss!
- News
Capital Gains Tax అంటే ఏంటి..? బడ్జెట్ వేళ పూర్తి వివరాలు మీకోసం..!
- Lifestyle
డయాబెటిస్ ఉన్నప్పటికీ సుదీర్ఘకాలం మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి ఇక్కడ కొన్ని ముఖ్యమైన చిట్కాలు ఉన్నాయ
- Finance
ఫ్యూచర్ గ్రూప్ డీల్, అమెజాన్‌కు షాక్: రిలయన్స్‌కు గుడ్‌న్యూస్, షేర్ జంప్
- Sports
IPL 2021లో అత్యధిక ధర అతనికే.. ఎవరూ ఊహించరు కూడా!!
- Automobiles
భారత్‌లో అడుగుపెట్టిన కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్; ధర & వివరాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నేడు ఎన్టీఆర్, రేపు బాలయ్య: నందమూరి నామ సంవత్సరమే!
హైదరాబాద్: 2015 సంవత్సరం....నందమూరి నామ సంవత్సరంగా మిగిలి పోతుందని పటాస్, టెంపర్ ఆడియో వేడుకల్లో జూ ఎన్టీఆర్ నొక్కి చెప్పిన సంగతి తెలిసిందే. ఆ మధ్య ‘పటాస్' సక్సెస్ మీట్ లో జూ ఎన్టీఆర్ మాట్లాడుతూ.....అన్నయ్య ‘పటాస్' తో మొదలు పెట్టాడు....‘టెంపర్'తో అది కంటిన్యూ అవుతూ.... బాబాయ్ ‘లయన్' హిట్టయ్యే వరకు కొనసాగుతుంది అన్నారు. అపుడు ఎన్టీఆర్ చెప్పినట్లుగా ‘టెంపర్' మూవీ ఈరోజు విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
చాలా కాలం తర్వాత యంగ్ ‘టైగర్' జూ ఎన్టీఆర్ నుండి భారీ హిట్ వచ్చినందుకు నందమూరి అభిమానులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. పటాస్ హిట్ కావడం, ఈ రోజు విడుదలైన టెంపర్ మూవీ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉండటంతో సంబరాలు చేసుకుంటున్నారు.

జూ ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టెంపర్' చిత్రంపై విడుదలకు ముందు నుండే అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమా ఉండటంతో తొలి రోజు సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. పైగా సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ రావడం కూడా కలిసొస్తుందని భావిస్తున్నారు.
ఎన్టీఆర్, కాజల్, ప్రకాష్‌రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జి, వెన్నెల కిషోర్, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కథ: వక్కంతం వంశీ, కెమెరా: శ్యామ్ కె నాయుడు, సంగీతం: అనూప్ రూబెన్స్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, ఫైట్స్: విజయ్, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేశ్, స్ర్కీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.