twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫైవ్ స్టార్ రేపర్లో నవ్వుల పిప్పరమెంట్ : నందిని నర్సింగ్ హోం (రివ్యూ రేటింగ్ )

    |

    Rating:
    2.5/5

    ఒకప్పుడు కామెడీ సినిమాల హీరోగా రాజేంద్ర ప్రసాద్ ఒక వెలుగు వెలిగిన కాలం లో సీనియర్ నరేష్ కూడా కామెడీ హీరోగా చిన్న నిర్మాతల పాలిటి స్టార్ హీరోగా ఉండేవాడు. తనకంటూ ఒక మార్క్ వేసుకున్న నరేష్ వయసు మీద పడటం తో హీరోనుంచి క్యారెక్తర్ ఆర్టిస్ట్ గా మారినా తనదైన శైలి కామెడీతో ఇంకా నటిస్తూనే ఉన్నాడు. ఒకప్పటి స్టార్ హీరోయిన్, దర్శకురాలు విజయనిర్మల వారసత్వాన్ని కొనసాగిస్తూ తెరమీదికి వచ్చిన న‌వీన్ విజ‌య్ కృష్ణ‌. మంచి ఎడిట‌ర్‌గా ఇప్ప‌టికే పేరు తెచ్చుకున్నాడు. సినిమా ట్రైల‌ర్ల‌ను, టీజ‌ర్ల‌ను న‌వీన్ ఎడిటింగ్ చేస్తే సినిమాల్లో పాజిటివ్ బ‌జ్ త‌ప్ప‌నిస‌రిగా ఉంటుంద‌నేది హీరో మ‌హేశ్‌బాబు న‌మ్మ‌కం కూడా. ఈ విశయం మహేష్ స్వయంగా చెప్పాడు కూడా..

    ఎడిట‌ర్‌గా మంచి ఊపు మీదున్న నవీన్‌కి హీరో కావాల‌నే కోరిక పుట్టింద‌ట‌. దాంతో 130 కిలోలున్న ఆయ‌న స‌గానికి త‌గ్గారు. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా న‌వీన్ చేసిన తొలి చిత్రం కొన్ని కారణాల వల్ల ఇంకా విడుద‌ల కాలేదు. అంత‌లో ఆయ‌న న‌టించిన రెండో చిత్రం నందిని న‌ర్సింగ్ హోమ్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. న‌వీన్ విజ‌య‌కృష్ణ ఈ చిత్రంలో ఎలా చేశాడు? నాన‌మ్మ‌, తండ్రి బాట‌లో న‌ట‌న‌కు న్యాయం చేయగలిగాడా? ఒక లుక్వేద్దాం...

    Nandini Nursing Home Movie Review and Rating

    వైజాగ్‌లో బ్యాంకులో రిక‌వ‌రీమెన్‌గా సేల్స్ విభాగంలో ప‌నిచేసే చందూ అనిపిలవబడే చంద్ర‌శేఖ‌ర్ (న‌వీన్ విజ‌య‌కృష్ణ‌) ఓ మ‌ధ్య త‌ర‌గ‌తి కుర్రాడు. ప‌క్క‌నే ఉన్న గ‌ర్ల్స్ హాస్ట‌ల్ నుంచి వ‌స్తున్న ఓ అమ్మాయి స్వీట్ వాయిస్ విని చూడకుందానే ఆ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె అమూల్య (శ్రావ్య‌) అని తెలుసుకుంటాడు.అయితే ఆ అమ్మాయి స్వభావం చందూకి పూర్తి వ్యతిరేకం బంధాలు అన్నిటిక‌న్నా గొప్ప‌వ‌న్న‌ది చందు న‌మ్మ‌కం. కానీ అమూల్య మాత్రం ప్రపంచం లో డబ్బుకన్నా ముఖ్యమైంది ఇంకేదీ లేన్న నమ్మకం లో ఉంటుంది. ఇలా ఈ రెండు నెగెటివ్ పోల్స్ ఆకర్శించబడి ఇద్ద‌రూ ఒక‌రినొక‌రు ప్రేమించ‌కుంటారు. కానీ ఓ రోజు అమూల్య తండ్రి ఫోన్ చేసి ఏడాదికి రూ.18ల‌క్ష‌లు సంపాదించే కుర్రాడి సంబంధం వ‌చ్చింద‌ని చెబుతాడు. మరి డబ్బే సర్వస్వం అని నమ్మిన అమూల్య అప్పుడేం చేస్తుంది??? ప్రేమించిన వాడిని కావాల‌నుకుందా? లేక తండ్రి మాట విని వెళ్లిందా? అనేది సినిమాకి కీలక మలుపు.

    అయితే కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల మ‌రోవైపు నందిని న‌ర్సింగ్ హోమ్‌లో డాక్ట‌ర్‌గా మారతాడు. అక్క‌డ కొన్ని సంఘటనలు జరుగుతూంతాయి. ఆ విశయాల్లో ఇరుక్కున్న చందూకి నందిని ఎదురవుతుంది. ఈ అమ్మాయి ఎవరో కాదు నందిని న‌ర్సింగ్ హోమ్ అధినేత డాక్ట‌ర్ వెంక‌టేశ్వ‌ర్లు (జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి) కుమార్తె ఎదురవటం తో ఆగకుండా చందూ -ప్రేమలో పడిపోతుంది. ఇక ఆ త‌ర్వాత ఏమైంది అనేది ఆస‌క్తిక‌రం. చందు డాక్ట‌ర్ ఎలా అయ్యాడు? న‌ందిని న‌ర్సింగ్ హోమ్‌లో జ‌రిగిన మిస్ట‌రీలు ఏంటి? డాక్ట‌ర్ వెంక‌టేశ్వ‌ర్లు జాత‌కాల పిచ్చి ఎలాంటిది? చ‌ందు అమూల్య‌ను చేసుకున్నాడా? నందిని ప్రేమ ఏమైంది? ఆసుప‌త్రిలో నెల‌కు రూ.ల‌క్ష‌ను చెల్లించి రూమ్‌ను అద్దెకు తీసుకుని స‌ప్త‌గిరి పెట్టిన బిజినెస్ ఏంటి? ఇలా అన్ని ప్రశ్నలకూ సమాధానాలు నవ్వుల రూపం లోనే కనిపిస్తాయి...

    . పి.వి.గిరి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం పూర్తి రొమాంటిక్ కామెడీగా సాగింది. అక్కడక్కడ దెయ్యం మార్కు సీన్స్ కూడా ఉన్నా నవీన్ విజయ కృష్ణ నటనతో అవి తమాషాగా సాగాయి. జాతకాల పిచ్చోడిగా జయప్రకాష్ రెడ్డి నవ్విస్తే. షకలక శంకర్, వెన్నెల కిషోర్ మరింత కడుపుబ్బా నవ్విస్తారు.. నవీన్ విజయ క్రిష్ణకిది ప్రాక్టికల్ గా రెండో చిత్రమే అయినా రిలీజైన మొదటి సినిమా. హీరోయిన్లు త‌మ పాత్ర‌ల్లో బాగానే చేశారు.కానీ ఇంకాస్త శ్రద్దగా చేసుండాల్సింది. నవీన్ కృష్న తో పోలిస్తే ఈ ఇద్దరు హీరోయిన్లూ తేలిపోతారు.

    త‌మిళ న‌టుడు జె.పి, స్నేహితుడుగా సంజయ్ త‌మ పాత్ర‌లతో మెప్పించారు.. ష‌క‌ల‌క శంక‌ర్‌కి మాత్రం ఈ సినిమా ఒక ట‌ర్నింగ్ పాయింట్ అవుతుంది. ఆద్యంతం త‌న‌దైన శైలిలో డైలాగులు చెబుతూ న‌వ్విస్తూనే ఉన్నాడు. స‌ప్త‌గిరి క్యార‌క్ట‌ర్‌ను ఎవ‌రూ ఊహించ‌రు. వెన్నెల‌ కిశోర్ పాత్ర కూడా న‌వ్వులు కురిపిస్తుంది. స్క్రీన్‌ప్లే రాసుకున్న విధానం బావుంది. రెగ్యుల‌ర్ హార‌ర్ చిత్రాల‌కు భిన్నంగా ఉంది. అయితే కామెడీ చిత్రాల లోకూడా ఉందాల్సిన కొన్ని నిర్మాణ విలువల్లో మాత్రం తగ్గిపోయి మరీ లోబడ్జెట్ సినిమాలా కనిపిస్తుంది.

    దర్శకుడు గిరి పాత కథనే కొత్తగా తెరకెక్కించే ప్రయత్నం చేసి సక్సెస్‌ సాధించాడు. సినిమా అంతా కూడా కామెడీతో ముంచేశాడు. సెకండాఫ్ లో కొంత ఎడిటింగ్ అవసరం అనిపిస్తుంది కొన్ని సీన్లు మరీ సాగదీసినట్టూ..., పరమ రొటీన్ గానూ అనిపిస్తాయి. అయితే కామెడీతో వాటిని కవర్ చేసేసారనే చెప్పుకోవచ్చు.
    మొత్తంగా చూస్తే ప్రమ రొటీన్ కథని వెనకా ముందూ చేసీ కామెడీ గుఒప్పించినట్టనిఒపించినా రెండుగంటలు హాయిగా నవ్వుకొని రావొచ్చు.. అంతకన్నా ఎక్కువ ఆశించతం మాత్రం అత్యాశే..

    ఒక్క మాటలో చెప్పాలంటే.... ఫైవ్ స్టార్ రేపర్లో పిప్పరమెంట్ నందినీ నర్సింగ్ హోం

    English summary
    Naveen Vijay Krishna S/O Senior Naresh is known to the Industry folks as a promising Editor. The Acting bug bit him finally and he made his debut as Hero with 'Nandini Nursing Home'. Even the Director and Producer of the movie are debutantes. Let's see whether these first-timers have left a mark of their own or not...
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X