»   » హ్యాపీ న్యూ ఇయర్లో....హీరోయిన్ స్యాడ్ నిర్ణయం, ఇక విడాకులే!

హ్యాపీ న్యూ ఇయర్లో....హీరోయిన్ స్యాడ్ నిర్ణయం, ఇక విడాకులే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

న్యూఢిల్లీ: ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్, ప్రముఖ నటి, దర్శకురాలు నందితా దాస్ హ్యాపీ న్యూఇయర్ సంబరాలు ఇంకా ముగియక ముందే స్యాడ్ న్యూస్ చెప్పి అభిమానులకు షాకిచ్చింది. త్వరలో తన భర్త శుభోద్ మస్కారాతో విడిపోనున్నట్లు ప్రకటించింది.

నందితా దాస్-శుభోద్ మస్కారా ఏడేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి విహాన్ అనే ఆరేళ్ల కుమారుడు కూడా ఉన్నారు. వీరి మధ్య రిలేషన్ కొంత కాలంగా సరిగా ఉండటం లేదని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీనిపై ఆమె స్పందిస్తూ...'అవును నిజమే, త్వరలో విడిపోవాలని నిర్ణయించుకున్నాం, ఈ విషయంలో మీడియా వారు మా ప్రైవసీకి భంగం కలిగించ వద్దని ఆమె తెలిపారు.

Nandita Das and husband Subodh Maskara end seven-year-old marriage!

'విడిపోవడం అంటే అంత ఈజీ కాదు, ముఖ్యంగా పిల్లలు ఉన్నపుడు మరింత క్లిష్టంగా ఉంటుంది. మాకు మా కుమారుడిని భవిష్యత్తు ముఖ్యం. విడిపోయినా కుమారుడి భవిష్యత్తుకు ఎలాంటి లోటూ లేకుండా చూడాలని నిర్ణయించుకున్నాం' అని తెలిపారు.

Highest Paid Actors In The World

నందితా దాస్ వయసు 47 సంవత్సరాలు. 2002లో సౌమ్య సేన్ అనే వ్యక్తిని పెళ్లాడిన నందితా దాస్ 2007లో విడాకులు తీసుకున్నారు. 2010లో శుభోద్ మస్కారాను వివాహం చేసుకున్నారు. లీవుడ్లో ఫైర్, ఎర్త్, బవందర్ లాంటి మీనింగ్ ఫుల్ సినిమాల్లో నటించిన ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె దర్శకత్వంలో వచ్చిన 'ఫిరాఖ్' మూవీ అంతర్జాతీయ స్థాయిలో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

English summary
New Delhi: Bollywood was hit by several break-ups news in 2016 and with just a day into New Year, here comes yet another shocking tale of separation. Talented actress-cum-director Nandita Das and husband Subodh Maskara have decided to split.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu