twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రవితేజ, నాని, రానా : వీళ్లు మనుషులకు కాకుండా....

    By Bojja Kumar
    |

    సినిమా కథ, సందర్భాన్ని బట్టి ప్రముఖ నటులు వాయిస్ ఓవర్ ఇవ్వడమో, అందులోని ప్రత్యేక పాత్రలకు డబ్బింగ్ చెప్పడం తరచూ చూస్తూనే ఉన్నాం. హీరో రవితేజ ఇప్పటికే మర్యాద రామన్న చిత్రంలో సైకిల్‌కు వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇలా మనుషులకు కాకుండా వస్తువులకు, జంతువులకు ప్రముఖ హీరోలు వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఇలాంటి సినిమాలు త్వరలో మూడు రాబోతున్నారు. రవితేజ, నాని, రానా ఇందులో వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారు.

    చేపకు వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్న నాని

    నాని నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘అ' సినిమాలో అతను ఓ చేపకు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ఈ సినిమాలో ‘చేప'లా కనిపించనున్నాడు. ఈ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ బజ్ ని క్రియేట్ చేస్తుంది. ఈ చిత్ర నిర్మాణంలో కూడా నాని భాగస్వామిగా ఉన్నారు.

     చెట్టుకు వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్న రవితేజ

    చెట్టుకు వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్న రవితేజ

    గతంలో ‘మర్యాద రామన్న' చిత్రంలో సైకిల్‌కు వాయిస్ ఓవర్ ఇచ్చిన రవితేజ... ఇపుడు ‘అ' సినిమాలో ఓ చెట్టుకు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నాడు.

     బస్సుకు వాయిస్ ఓవర్ ఇస్తున్న రానా

    బస్సుకు వాయిస్ ఓవర్ ఇస్తున్న రానా

    హీరో దగ్గుబాటి రానా ‘రాజరథం' అనే సినిమాలో బస్సుకు రానా వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణంలో కూడా రానా భాగస్వామిగా ఉన్నారు. ఈ చిత్రంలో తాను పాత్ర ఏమీ చేయడం లేదని, ఇది ఒక బస్సు చుట్టూ తిరిగే కథ, బస్సుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లు రానా తెలిపారు.

    తెలుగులో కొత్త కాన్సెప్టులు

    తెలుగు సినిమా పరిశ్రమ మూస సినిమాలు, రొటీన్ కమర్షియల్ సినిమాల నుండి క్రమక్రమంగా బయట పడుతోంది. కొత్త కాన్సెప్టులు, డిఫరెంట్ సినిమాలు ఈ మధ్య కాలంలో చాలా వచ్చాయి. ప్రేక్షకుల నుండి కూడా వాటికి మంచి ఆదరణ లభిస్తోంది. నాని, రానా లాంటి స్టార్లు ఇలాంటి సినిమాల్లో నిర్మాతలుగా పెట్టుబడులు కూడా పెట్టడం, టాలెంటెడ్ దర్శకులను ప్రోత్సహించడం ఒక మంచి పరిణమంగా భావించవచ్చు.

    English summary
    Actor Nani would be lending his voice as a narrator for his home production, Awe, we did not know that he would be lending his voice to a fish.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X