twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేను క్షేమంగా ఉన్నా.. ఆందోళన వద్దు.. తృటిలో ప్రాణాలతో బయటపడ్డ నాని..

    సినీ హీరో నాని తృటిలో ఘోర రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డారు. జూబ్లిహిల్స్ రోడ్ నంబర్ 45లో ప్రయాణిస్తున్నా నాని వాహనం అదుపుతప్పి డివైడర్‌ మధ్య ఉన్న విద్యుత్ స్తంభాన్ని వేగంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన

    By Rajababu
    |

    సినీ హీరో నాని తృటిలో ఘోర రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డారు. జూబ్లిహిల్స్ రోడ్ నంబర్ 45లో ప్రయాణిస్తున్నా నాని వాహనం అదుపుతప్పి డివైడర్‌ మధ్య ఉన్న విద్యుత్ స్తంభాన్ని వేగంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే వాహనంలోని బెలూన్లు తెరుచుకోవడంతో ప్రాణముప్పు తప్పింది. ఈ ఘటనలో డ్రైవర్, ఆయన స్వల్పగాయాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకొన్నారు.

    షూటింగ్ నుంచి

    షూటింగ్ నుంచి

    వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాని తాజాగా కృష్ణార్జున యుద్ధం చిత్రంలో నటిస్తున్నారు. శుక్రవారం తెల్లవారు జామున షూటింగ్ ముగించుకొని జూబ్లీహిల్స్ నుంచి గచ్చిబౌలి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకొన్నది.

    నానికి స్వల్ప గాయాలు

    నానికి స్వల్ప గాయాలు

    ఈ ప్రమాదంలో నానికి స్వల్ప గాయాలైనట్టు సమాచారం. ఘటన అనంతరం కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల పంపిన మరో కారులో హాస్పిటల్‌లో ప్రాథమిక చికిత్స పొందారు. అనంతరం ఆయన తన నివాసానికి వెళ్లిపోయారు.

    బ్రీత్ ఎనలైజర్ పరీక్ష

    బ్రీత్ ఎనలైజర్ పరీక్ష

    ప్రమాద ఘటన సమాచారం అందుకొన్న బంజారాహిల్స్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకొన్నారు. మద్యం సేవించి వాహనాన్ని నడిపి ఉంటారా అనే ఉద్దేశంతో కారు డ్రైవర్‌ శ్రీనివాస్‌కు బ్రీత్ ఎనలైజర్ టెస్టులు నిర్వాహించారు.

    నాని డ్రైవర్‌ శ్రీనివాస్‌పై కేసు

    నాని డ్రైవర్‌ శ్రీనివాస్‌పై కేసు

    ట్రాఫిక్ పోలీసుల నిర్వహించిన పరీక్షల్లో డ్రైవర్ మద్యం సేవించి లేడని తేలింది. నిద్రమత్తే ప్రమాదానికి కారణమని కారు డ్రైవర్ శ్రీనివాస్ పోలీసులకు చెప్పాడు. అనంతరం డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.

    ట్విట్టర్‌లో నాని స్పందన

    కారు ప్రమాద ఘటనపై హీరో నాని ట్విట్టర్‌లో స్పందించారు. రోడ్డు ప్రమాదంలో నాకు ఏమీ కాలేదు. అక్కడక్కడ చిన్న గాయాలయ్యాయి. యుద్ధం షూటింగ్‌కు కొద్దిరోజులు హాజరుకాలేను. వారంలోగా మళ్లీ షూటింగ్‌కు హాజరవుతాను అని నాని ట్వీట్ చేశారు.

    English summary
    Nani’s driver lost control of the car and hits an electric pole near Jubilee Hills Road Number 45. Nani’s driver was driving the car, and they both suffered minor injuries. The duo was immediately shifted to nearby private hospital and undergoing treatment.Now they are fine.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X