For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అభిమానులని నమ్ముకొని సినిమాలు తీయను... నాని ఇంత మాటనేసాడేమిటీ.!?

  |

  సాధారణం గానే హీరో అంటే అభిమానులకీ అభిమ్నానులంటే హీరోలకీ ఒక బాండ్ ఉంటుంది. అభిమాన హీరో సినిమా అనగానే అదొక పండగల ఫీలయ్యే అభిమానులుంటారు. తమ హీరొ సినిమా హీత్ కావాలనే కోరుకుంటారు. కొన్ని సార్లు ఫ్లాప్ అవ్వాల్సిన సినిమాని కూడా హిట్ ఖార్తాలో వేయటానికి అభిమానులు పడే తపన అంతా ఇంతాకాదు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి దగ్గరినుంచీ నిన్న మొన్నటి రామ్ వరకూ అందరూ అభిమానుల వల్లే తామే స్థాయిలో ఉన్నామని నమ్ముతున్నారు.

  కానీ హీరో నాని విషయం లో మాత్రం అభిమానుల విషయం లైట్ తీసుకునే విషయమేనట . అభిమానులను నమ్ముకొని సినిమా చేటం కరెక్త్ కాదనీ. సినిమా జయాపజయాలు అభిమానుల మీద ఆధారపడి ఉండవనీ చెప్పాడు. అంతే కాదు అభిమానుల మాటలని నమ్మలేం అనికూదా చెప్తూ... తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పటి అనుభవాన్ని చెప్పుకొచ్చాడు.

  Nani coments on cinima fans

  " నాని మాటల్లోనే చూస్తే.. "నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న రోజుల్లో ఒక హీరో కోసమని కొందరు అభిమానులు వచ్చారు. వాళ్లు వచ్చి కొన్ని నిమిషాలే అయింది. కానీ ఆ హీరో వాళ్లను కలవడానికి రాగానే తాము మూడు రోజుల నుంచి ఎదురు చూస్తున్నట్లుగా చెప్పారు. అప్పట్నుంచి నేను అభిమానుల పొగడ్తల్ని నమ్మడం మానేశా. నేను నా కెరీర్లో అత్యధికంగా 'జెండా పై కపిరాజు' సినిమాకు రెండేళ్లు కష్టపడ్డాను. అయినా అది బాగా ఆడలేదు. కానీ ఆరు నెలల్లో పూర్తి చేసిన 'భలే భలే మగాడివోయ్' చాలా పెద్ద హిట్టయింది. మనమేదో కష్టపడిపోయాం అని అభిమానులు ఎవరూ సినిమాలు చూడరు అనడానికి ఇదే నిదర్శనం'' అని నాని చెప్పాడు.

  అభిమానులను నమ్ముకొని ఏ సినిమా పడితే ఆ సినిమా చేస్తే మునిగిపోవడం ఖాయమని , ఎంత కష్టపడినా సినిమా బాగుంటేనే వాళ్ళు చూస్తారని లేకపోతే సినిమా చూడరని కామెంట్ చేస్తున్నాడు హీరో నాని . మొదట నా చూపు మంచి స్క్రిప్ట్ కే అని ఆ తర్వాతే కాంబినేషన్ అయినా మరొకటైనా అంతేకాని పనిగట్టుకొని మరీ ఫ్యాన్స్ కోసం అని సినిమా చేస్తే మునిగిపోవడం ఖాయమని అంటున్నాడు .

  అంతేకాదు కొన్ని ఉదాహరణలు కూడా చెబుతున్నాడు . రెండేళ్ళు కస్టపడి చేసిన జెండా పై కపిరాజు చిత్రం ఫ్లాప్ అయ్యింది ఆరు నెలలు కష్టపడిన భలే భలే మగాడివోయ్ చిత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది అంటూ చెబుతున్నాడు . ఫ్లాప్ అయిన సినిమాకు హిట్ అయిన సినిమాకు ఒకేలాగా కష్టపడతాం కానీ రిజల్ట్ కొన్ని సినిమాలకే వస్తుంది అంటే స్క్రిప్టే కారణం అని విడమరిచి చెబుతున్నాడు నాని .

  'ఎవడే సుబ్రమణ్యం'తో మొదలుపెట్టి.. తాజాగా 'మజ్ను' వరకు వరుసగా ఐదు హిట్లు కొట్టిన నాని.. ప్రస్తుతం 'సినిమా చూపిస్త మావ' ఫేమ్ త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో 'నేను లోకల్' సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాని సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. ఈ ఏడాది ఆఖర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది.

  English summary
  Hero Nani commented on his fans that he is not believe fans
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X