»   » నాని, దిల్ రాజు కాంబినేషన్ లో ఇంకో సినిమా, గమ్మత్తైన టైటిల్ ప్రకటన

నాని, దిల్ రాజు కాంబినేషన్ లో ఇంకో సినిమా, గమ్మత్తైన టైటిల్ ప్రకటన

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై నాని, కీర్తి సురేష్‌ జంటగా తెరకెక్కిన 'నేను లోకల్‌' పెద్ద హిట్టైన సంగతి తెలిసిందే. ఇప్పటికి చాలా ధియోటర్లలో హౌస్ ఫుల్స్ తో రన్ అవుతోంది. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన ఈ చిత్రంలో 'నెక్ట్స్‌ ఏంటి?' సాంగ్ పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు ఇదే టైటిల్ తో దిల్ రాజు ఈ చిత్రం సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడా అనే సందేహాలు ఇండస్ట్రీలో కలుగుతున్నాయి. అందుకు కారణం ...నాని పుట్టిన రోజు సందర్బంగా దిల్ రాజు రిలీజ్ చేసిన పోస్టర్.

అయితే విశేషం ఏమిటంటే..దిల్ రాజు క్యూరియాసిటీ కలగచేస్తూ..డైరక్టర్ ఎవరూ, లేక నేను లోకల్ డైరక్టర్ తో సీక్వెల్ చేసి కంటిన్యూ చేస్తారా వంటి విషయాలు తేల్చలేదు. త్వరలో షూటింగ్ స్టార్ట్ అవుతుందనే క్లూ ఇవ్వటంతో ఖచ్చితంగా ఈ పాటికి కథ, మిగతా విషయాలు ఫైనలైజ్ చేసే ఈ పోస్టర్ వదిలి ఉంటారని అంతా భావిస్తున్నారు.

నాని విషయానికి వస్తే.. గ్యాప్ లేకుండా సినిమాలను లైన్లో పెడుతున్నాడు. 'నేను లోకల్' చిత్రంతో ఆకట్టుకున్న నాని ప్రస్తుతం నూతన దర్శకుడు శివ నిర్వానంద్ తో చేస్తున్న నూతన చిత్రం 'నిన్ను కోరి'తాలూకు షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్, టైటిల్ ఇప్పటికే రిలీజ్ చేసారు.

ఇది కాకుండా నాని ఇంకో ప్రాజెక్టుకి రెడీ అవుతున్నాడు. తనకు 'కృష్ణగాడి వీర ప్రేమ గాథ' లాంటి ఫీల్ గుడ్ సక్సెస్ ను అందించిన దర్శకుడు హను రాఘవపూడితో ఈ సినిమా ఉండనుంది. శ్రీనివాస్ ప్రసాద్, సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించనుండగా, 'కృష్ణగాడి వీర ప్రేమ గాథ'కు పనిచేసిన యువరాజ్ సినిమాటోగ్రఫీ చేయనున్నారు.

English summary
Wishing Nani a very happy birthday, Dil Raju released this poster with the title - MCA. The poster declares shoot starts soon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu