»   » మిలియనీర్ల జాబితాలో తెలుగు హీరో నాని!

మిలియనీర్ల జాబితాలో తెలుగు హీరో నాని!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు హీరో నాని మిలియనీర్ల జాబితాలో చేరి పోయాడు. మిలియనీర్ అంటే ఇదేదో డబ్బు విషయం అనుకోవద్దు. అంతకంటే విలువైనది. మిలియన్ డాలర్ల కంటే విలువైన అభిమానం సంపాదించుకోవడం.

ఈ మధ్య ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో మిలియన్ మార్క్ ఫాలోవర్స్‌ను సంపాదించుకోవడం ట్రెండ్‌గా మారింది. తాజాగా నాని ట్విట్టర్ పేజీని ఫాలో అవుతున్న అభిమానుల సంఖ్య 1 మిలియన్( 10 లక్షలు) మార్కను దాటింది. ఈ సందర్భంగా ఆయన సోషల్‌మీడియా ద్వారా ఆనందం వ్యక్తం చేశారు. 'ప్రస్తుతం నేను మిలియనీర్‌ను. ట్విట్టర్‌ ఫ్యామిలీకి ధన్యవాదాలు, లవ్‌.. నాని' అని నాని ట్వీట్‌ చేశారు.

nani

మజ్ను

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా విరించి వర్మ దర్శకత్వంలో ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌, కేవా మూవీస్‌ పతాకాలపై పి.కిరణ్‌, గోళ్ళ గీత అందిస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ 'మజ్ను'. ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని యు ఎ సర్టిఫికెట్‌ పొందింది. సెప్టెంబర్‌ 23న వరల్డ్‌వైడ్‌గా చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో నాని సినిమా ప్రమోషన్లలో బిజీ అయిపోయారు.

సోమవారం విలేకరులతో సినిమా గురించి విషయాలతో పాటు ఇతర వివరాలు ముచ్చటించారు. ''అందరూ అనుకుంటున్నట్లు బాధలో ఉండే మజ్ను కథ ఈ సినిమా కాదు. ప్రేమలో పడి సమస్యల్లో ఉన్నట్లు కనపడే ఎవరినైనా మజ్ను అనే అంటాం. ఇక మా మజ్ను సినిమా విషయానికి వస్తే బోర్‌ కొట్టదు. అందరినీ ఎంటర్‌టైన్‌ చేస్తూ ఇంటికి వెళ్ళినా గుర్తుకు వస్తుంటాడు అన్నారు.

''ప్రేమలో విఫలమయ్యానని బాధపడకుండా, ఆ ప్రేమని ఎలా సాధించుకొన్నాడనే కథతో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా చూసినప్పట్నుంచి 'మజ్ను' అనే మాటని మరో కోణంలో వాడతారు ప్రేక్షకులు. నిజమైన ప్రేమే కరవైన ఈ రోజుల్లో మళ్లీ ఓ స్వచ్ఛమైన, నిజాయతీతో కూడిన ఓ ప్రేమకథని తెరపై చూపిస్తున్నాం. ఇందులోని ప్రతీ సన్నివేశం ప్రతి ఒక్కరి గతాన్ని గుర్తు చేస్తుంది. ప్రేమలేఖల కాలానికి తీసుకెళుతుంది'' అని నాని చెప్పుకొచ్చారు.

English summary
Actor Nani has touched the magical 1 million followers mark on Twitter. Expressing his happiness on his memorable feat, Rana tweeted, "I am a MILLIONAIRE now :) Thank you my Twitter family ".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu