»   » బాలయ్య నిర్మాతతో నాని, మే లో రిలీజ్

బాలయ్య నిర్మాతతో నాని, మే లో రిలీజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మొన్న కృష్ణగాడి వీర ప్రేమ గాధ చిత్రంలో బాలయ్యకు వీరాభిమాని గా కనిపించిన నాని ఇప్పుడు బాలకృష్ణతో హిట్స్ తీసిన నిర్మాతతో చిత్రం చేస్తున్నారు. ఆ నిర్మాత మరెవరో కాదు శివలెంక కృష్ణ ప్రసాద్.

రాజేంద్రప్రసాద్, చంద్రమోహన్ కాంబినేషన్ లో వచ్చిన 'చిన్నోడు పెద్దోడు'తో నిర్మాతగా కెరీర్ మొదలుపెట్టి, 'ఆదిత్య 369', 'వంశానికొక్కడు', 'మిత్రుడు' వంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ కొంత విరామం తర్వాత ఓ చిత్రం నిర్మిస్తున్నారు.

వరుస విజయాలతో దూసుకెళుతున్న నాని హీరోగా విలక్షణ దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఆయన ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఇందులో సురభి, నివేదా థామస్ హీరోయిన్స్. ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజు ని పురస్కరించుకుని ఈ చిత్రం విశేషాలుకు మీడియాకు తెలియచేసారు.

నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ తెలియజేస్తూ - ''ఇదొక అందమైన రొమాంటిక్ థ్రిల్లర్. థ్రిల్ కు గురి చేసే ఎలిమెంట్స్, మంచి రొమాన్స్, సెంటిమెంట్, వినోదం.. ఇలా అన్ని అంశాలు కుదిరిన కథ. డిసెంబర్ 2న ప్రారంభమైన ఈ చిత్రం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిపిన షెడ్యూల్ తో 40 శాతం పూర్తయ్యింది.

Nani - Indraganti's romantic thriller in May last week

ఈ నెల 22 నుంచి మార్చి 6 వరకూ కొడైకెనాల్ లో జరిపే షెడ్యూల్ లో కొంత టాకీ, పాట చిత్రీకరిస్తాం. మార్చి 14 నుంచి ఏప్రిల్ 6 వరకూ జరిపే షెడ్యూల్ తో సినిమా దాదాపు పూర్తవుతుంది. టైటిల్ ను త్వరలో ప్రకటిస్తాం. మే చివరి వారంలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం'' అని చెప్పారు.

అవసరాల శ్రీనివాస్, తనికెళ్ల భరణి, వెన్నెల కిశోర్, ఆనంద్, రోహిణి, 'సత్యం' రాజేశ్, రమాప్రభ, ప్రగతి, రాజశ్రీ నాయర్, శ్రీముఖి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: డేవిడ్ నాథన్, సంగీతం: మణిశర్మ, పాటలు: 'సిరివెన్నెల' సీతారామ శాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, కృష్ణకాంత్,

కెమేరా: పి.జి. విందా, ఆర్ట్: ఎస్. రవీందర్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేశ్, కో-డైరెక్టర్: కోట సురేశ్ కుమార్, నిర్మాణ పర్యవేక్షణ: యోగానంద్, నిర్మాణ నిర్వహణ: పరుచూరి మోహన్, రషీద్ అహ్మద్, స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.

English summary
Fresh from the success of ‘Krishna Gaadi veera Prema gaadha’, actor Nani will be joining forces with mentor Indraganti Mohana Krishna for a new project, the filming of which kick-starts in early December.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu