twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాని కొత్త చిత్రం'సెగ'కధ ఇదే

    By Srikanya
    |

    బాలాజీ, కార్తీక్(నాని) చిన్నప్పుడే తన తల్లిని పోగొట్టుకుని,స్వార్దపరుడైన తండ్రి పట్టించుకోకపోవటంతో రోడ్డున పడతారు. వాళ్ళద్దరినీ శేఖర్(పశుపతి)అనే పెయింటర్ సాకి పెద్ద వాళ్లని చేస్తాడు. బాలాజి అతని వద్దే అప్రంటీస్ గా పనిచేస్తూ తన సోదరుడు కార్తీక్ చదువుకు సహకరిస్తూంటాడు. మరో ప్రక్క శేఖర్ కూతురు రేవతి(నిత్యా మీనన్), కార్తీక్ చాలా స్నేహితులగా పెరుగుతూ, ప్రేమలో పడతారు. మరో ప్రక్క కార్తిక్ మరో బాల్య స్నేహితుడు, క్లోజ్ ప్రెండ్ మెకానిక్ షాప్ ఓనర్ కొడుకు అయిన విష్ణు (కార్తీక్ కుమార్)ఎప్పుడూ అతి కోరికలతో కష్టాల్లో పడుతూంటాడు.

    అలాంటి విష్ణు క్విక్ మనీ సంపాదించటానికి, తను ప్రేమించే అమ్మాయి చేయపట్టుకోవటం కోసం ఓ డీల్ తెస్తాడు.చాలా నిర్దాక్ష్యణంగా ఉండే అమ్మాజి ద్వారా అతను ఆ డీల్ తెచ్చుకుంటాడు.అయితే అది ప్రాణాల మీదకు వస్తుంది. అప్పుడు కార్తీక్ ఎంటరై ఏం చేసాడన్నది మిగతా కథ. ఇక ఈ చిత్రం గురించి నాని మాట్లాడుతూ..స్లమ్‌ ఏరియాలో ఉండే మేం అనకోకుండా తీసుకున్న నిర్ణయాలు మా జీవితాల్ని ఎలా మార్చాయన్నది సబ్జెక్ట్‌. దీన్ని దర్శకురాలు అంజన అద్భుతంగా తెరకెక్కించారు. ప్రధానంగా స్క్రీన్‌ప్లే బేస్డ్‌గా నడస్తుంది అన్నారు.

    English summary
    Balaji and Karthik fend for themselves after they lose their mother and are abandoned by their selfish father. The brothers are brought up by Sekhar, a painter. Balaji turns apprentice to Sekhar and puts his younger brother Karthik through school and college. Sekhar's daughter Revathi and Karthik share a close friendship that blossoms into romance as the years go by.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X