ఎంత బావుందో చెప్పలేకపోతున్న నాని!
మహానటి చిత్రంపై వరుసగా ప్రముఖుల ప్రశంసలు కొనసాగుతున్నాయి. మహానటి చిత్రం మే 9 న విడుదలై ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. లెజెండ్రీ నటి సావిత్రి చరిత్రని నాగ అశ్విన్ తెరకెక్కించిన విధానం, మహానటి పాత్ర కీర్తి సురేష్ నటన ప్రేక్షకులని కట్టిపడేస్తున్న అంశాలు. తెలుగువారంతా సావిత్రి గారికి అభిమానులే కావడంతో ఈ చిత్రం అందరికి బాగా కనెక్ట్ అయిపోతోంది.
దుల్కర్ సల్మాన్ జెమిని గణేశన్ పాత్రలో నటించగా, సమంత, విజయ్ దేవర కొండ కీలక పాత్రలో నటించారు. నాగ చైతన్య ఏఎన్నార్ గా, మోహన్ బాబు ఎస్వీ రంగారావుగా కామియో రోల్స్ పోషించిన సంగతి తెలిసిందే.

న్యాచురల్ స్టార్ నాని మహానటి చిత్రంపై స్పందించాడు. ఈ చిత్రం ఎంత బావుందో తాను చెప్పలేకపోతునాన్ని ట్వీట్ చేశాడు. కీర్తి సురేష్ పోషించిన పాత్రని ఆమెకన్నా బాగా కేవలం ఒకే ఒకరు చేయగలరని, అది మహానటి సావిత్రి గారే అంటూ చమత్కరించడం విశేషం. మహానటి విజయం సాధించిన సందర్భంగా దర్శకుడు నాగ అశ్విన్, చిత్ర యూనిట్ కి నాని శుభాకాంక్షలు తెలియజేశాడు. రాజమౌళి, రాఘవేంద్ర రావు, సుకుమార్, నాగార్జున వంటి ప్రముఖులంతా మహానటి చిత్రం అద్భుతంగా ఉందంటూ ప్రశంసించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











