»   »  'భలే భలే మగాడివోయ్‌' తొలి రోజు కలెక్షన్స్ (ఏరియావైజ్)

'భలే భలే మగాడివోయ్‌' తొలి రోజు కలెక్షన్స్ (ఏరియావైజ్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: నాని, లావణ్య త్రిపాఠిలు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'భలే భలే మగాడివోయ్‌'.మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లుఅరవింద్‌ సమర్పించారు. ఈ చిత్రం మొన్న శుక్రవారం విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. గీతా ఆర్ట్స్‌ పతాకంపై బన్నివాస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తొలి రోజు కలెక్షన్స్ ఎలా వచ్చాయో ఓ సారి ఇక్కడ చూద్దాం...

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ట్రేడ్ వర్గాల్లో అందుతున్న సమచారం ప్రకారం ఈ చిత్రం తొలి రోజు 3.15 కోట్లు షేర్ సంపాదించింది. రెండో రోజు సైతం ఎ,బి,సి సెంటర్లు తేడాలేకుండా అన్ని చోట్లా సాలిడ్ కలెక్షన్స్ రాబట్టింది. నాని కెరీర్ లో ఈగ తర్వాత ఎక్కువ కలెక్షన్స్ వైజ్ కలెక్టు చేస్తున్న చిత్రం ఇదే.


Nani's Bhale Bhale Magadivoi First Day Collections

'భలే భలే మగాడివోయ్‌' తొలి రోజు కలెక్షన్స్ (ఏరియావైజ్) :


నైజాం: రూ. 74 లక్షలు


సీడెడ్: రూ. 19 లక్షలు


ఉత్తరాంధ్ర: రూ. 18.5 లక్షలు


గుంటూరు: రూ. 18 లక్షలు


కృష్ణా : రూ. 11 లక్షలు


తూర్పు గోదావరి: రూ. 17 లక్షలు


పశ్చిమ గోదావరి: రూ. 12.5 లక్షలు


నెల్లూరు: రూ. 5 లక్షలు


'భలే భలే మగాడివోయ్‌' ఎపి &నైజాంతొలి రోజు కలెక్షన్స్ : రూ. 1.75 కోట్లు


'భలే భలే మగాడివోయ్‌' తొలిరోజు ప్రపంచవ్యాప్త కలెక్షన్స్ : రూ. 3.15 కోట్లు (కర్ణాటక: రూ. 29 లక్షలు; USA: రూ. 1.01 కోట్లు; దేశంలో మిగిలిన ప్రాంతాలు: రూ. 10 లక్షలు).


ఈ సందర్భంగా నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ ఇటీవల విడుదల చేసిన సినిమాకు మంచి ఆదరణ లభిస్తోందని, క్వాలిటీ విషయంలో పెద్ద చిత్రాలకు తీసిపోకుండా అన్ని కార్యక్రమాలు పూర్తిచేశామని, డాల్బీ అట్మాస్ సిస్టమ్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేసామని తెలిపారు.


నటించడానికి వీలున్న ఓ మంచి పాత్ర ఈ సినిమాలో దొరికిందని, నిర్మాత సినిమాను క్వాలిటీగా రూపొందించారని, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ థియేటర్‌కు వెళ్లి, చూసి నవ్వినవ్వి రావచ్చనినాని తెలిపారు.


కెమెరా పనితనం సరికొత్తగా వుందని, ఈ చిత్రంలో ప్రతి పాత్ర నవ్విస్తూనే వుందని, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతోందని దర్శకుడు మారుతి తెలిపారు. మతిమరుపు కుర్రాడిగా నాని నటించిన పాత్ర సరికొత్తగా ఉంటుందని, పూర్తి కమర్షియల్ విలువలతో ఎంటర్‌టైనర్‌గా రూపొందిందీ చిత్రం.


మురళిశర్మ, సితార, నరేష్, స్వప్నమాధురి, శ్రీనివాసరెడ్డి, వెన్నెలకిశోర్, ప్రవీణ్, షకలక శంకర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్: ఉద్ధవ్, కెమెరా: నిజార్ షఫీ, సంగీతం: గోపీ సుందర్, నిర్మాత: బన్నీవాసు, రచన, దర్శకత్వం: మారుతి.

English summary
'Bhale Bhale Magadivoi' raked in a share of Rs 3.15 crore on Day 1. Collections were rock solid on Day 2 in all the territories irrespective A, B & C Centres.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu