»   »  ఇంట్రస్టింగ్‌: ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ' స్టోరీ లైన్

ఇంట్రస్టింగ్‌: ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ' స్టోరీ లైన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: నాని హీరోగా రూపొందుతున్న చిత్రం ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ' . ఈ సినిమాలో నాని ఓ డిఫరెంట్ క్యారక్టర్ వేస్తున్నాడు. అందుతున్న సమచారం ప్రకారం అనంతపురం బ్యాక్ డ్రాప్ లోజరిగే ఈ కథలో నాని ఓ భయస్దుడుగా కనిపిస్తాడు. అతను దమ్ము, దన్ను ఉన్న కుటుంబంలో అమ్మాయిని ప్రేమస్తాడు. ఆ అమ్మాయిని గెలవటానికి ముగ్గురు పిల్లలతో అతను జర్ని చేయాల్సి వస్తుంది. ఆ ఎపిసోడ్స్ ఫన్నీగా ఉంటాయని సమాచారం.

రిలీజ్ విషయానికి వస్తే... ఈ సినిమాను ఫిబ్రవరి 5న విడుదల చేయ్యాలని అనుకున్నారు, కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఫిబ్రవరి 12న విడుదల చేయ్యాలని ప్లాన్ చేస్తున్నారు దర్శక,నిర్మాతలు.


‘భలే భలే మగాడివోయ్' సినిమా హిట్ తో మంచి జోరుమీదున్నాడు హీరో నాని. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న నాని లేటెస్టుగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తికావచ్చింది. ‘అందాల రాక్షసి' ఫేమ్ హనూ రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతోంది.


Nani's Krishna Gaadi Veera Prema Gaadha story line

ఈ చిత్రంలో నాని నందమూరి బాలకృష్ణ అభిమానిగా కనిపిస్తాడట. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా కు ప్రకటించిన టైటిల్ తోనే క్రేజ్ వచ్చేస్తోంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 14 రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట,మరియు అనిల్ సుంకరలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


నాని, మెహరీన్, సంపత్, మురళీశర్మ, బ్రహ్మాజీ, పృథ్వీ, శత్రు, హరీష్ ఉత్తమన్, బేబి నయన, మాస్టర్ ప్రతాప్, బేబి మోక్ష తదితరులు తారాగణంగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: యువరాజ్, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, ఫైట్స్: విజయ్, డ్యాన్స్: రాజు సుందరం, ఎడిటర్: వర్మ, ఆర్ట్: అవినాష్ కొల్ల, లైన్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా, లిరిక్స్: కె.కె.(కృష్ణకాంత్), కో డెరక్టర్: సాయి దాసం, డైలాగ్స్: హను రాఘవపూడి, జయకృష్ణ, నిర్మాతలు: రామ్ అచంట, గోపీచంద్ అచంట, అనిల్ సుంకర, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: హను రాఘవపూడి.

English summary
Nani starrer Krishna Gaadi Veera Prema Gaadha story is told in very entertaining manner by director Hanu Raghavapudi who shot to fame with his debut Andala Rakshasi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu