»   » "ప్రేమ రసం కాదు భయ్యా....! చట్నీ...!!" చాలూ.. నాని ఇంకో హిట్ కొట్టేసినట్టే. (ట్రైలర్)

"ప్రేమ రసం కాదు భయ్యా....! చట్నీ...!!" చాలూ.. నాని ఇంకో హిట్ కొట్టేసినట్టే. (ట్రైలర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

కాని ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం, జెండా పై క‌పిరాజు, సినిమాలు రావటానికి ముందు వరకూ నాని కెరీర్ బాగా స్లో అయ్యింది. దాదాపు ఇక నానీ ఖేల్ ఖతం అని కొందరు నవ్వుకునే దాక వచ్చింది. కానీ భ‌లే భ‌లే మ‌గాడివోయ్ సినిమా త‌ర్వాత ఒక్కసారి అవాక్కయ్యారా? అన్న రేంజ్ లో అసలు ఫ్లాప్ అంటేనే తెలియని హీరొ లా నాని కేరీర్ బాగా ట‌ర్న్ అయిపోయింది. భ‌లే భ‌లే మ‌గాడివోయ్ త‌ర్వాత నాని రేంజే చేంజ్ అయిపోయింది .

ఇక ఈ సంవత్సరం కూడా ఇప్ప‌టికే కృష్ణ‌గాడి వీర‌ప్రేమ‌గాథ‌, జెంటిల్‌మ‌న్ సినిమాలతో వరుస హిట్ లు కొట్టేశాడు. మ‌రో పదిహేను రోజుల్లో మ‌రోసారి "మ‌జ్ను" సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయిపోయాడు. ఆడియో రిలీజ్ ముందే నిన్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు.... ఈ సినిమా సెప్టెంబర్ 16న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది..

"ప్రేమ రసం కాదు భయ్యా....! చట్నీ...!!" చాలూ.. నాని ఇంకో హిట్ కొట్టేసినట్టే. (ట్రైలర్)

‘ఎవ‌డే సుబ్ర‌మణ్యం'తో మొద‌లుపెట్టి ‘జెంటిల్‌మ‌న్' వ‌ర‌కు ఏడాదిన్న‌ర లోపే నాలుగు హిట్లు కొట్టేశాడు నేచుర‌ల్ స్టార్ నాని. ఇప్పుడు నాని కొత్త సినిమా ‘మ‌జ్ను' ట్రైల‌ర్ చూస్తుంటే అత‌ను వ‌రుస‌గా ఐదో హిట్టు కొట్టేస్తాడేమో అనిపిస్తోంది.

"ప్రేమ రసం కాదు భయ్యా....! చట్నీ...!!" చాలూ.. నాని ఇంకో హిట్ కొట్టేసినట్టే. (ట్రైలర్)

ట్రైల‌ర్ అంత ప్లెజెంట్‌గా.. ప్రామిసింగ్‌గా అనిపిస్తోంది మ‌రి. య‌ధావిధిగా నాని పెర్ఫామెన్సే సినిమాకు హైలైట్ అయ్యేలా క‌నిపిస్తోంది. న‌ట‌న‌లో.. డైలాగ్ డెలివ‌రీలో త‌న‌దైన టైమింగ్ చూపిస్తూ ఎంట‌ర్టైన్ చేయ‌డానికి నాని త‌న‌వంతు ప్ర‌య‌త్న‌మే చేసిన‌ట్లున్నాడు.

"ప్రేమ రసం కాదు భయ్యా....! చట్నీ...!!" చాలూ.. నాని ఇంకో హిట్ కొట్టేసినట్టే. (ట్రైలర్)

ఉయ్యాలా జంపాలా లాగే నాని మజ్ను నీ మజ్నూ లో నాని పాత్రనీ పాత్ర‌ను ద‌ర్శ‌కుడు విరించి వ‌ర్మ స‌ర‌దాగా తీర్చిదిద్దిన‌ట్లున్నాడు.

"ప్రేమ రసం కాదు భయ్యా....! చట్నీ...!!" చాలూ.. నాని ఇంకో హిట్ కొట్టేసినట్టే. (ట్రైలర్)

‘‘మ‌నం లైఫ్‌లో చాలామందిని క‌లుస్తాం.. ఎప్పుడో ఎక్క‌డో ఒక‌ళ్లు క‌నెక్ట‌వుతారు. కానీ నా ద‌రిద్రం కొద్దీ ఒక‌ళ్ల‌కిద్ద‌రు క‌నెక్ట‌య్యారు''.. ఈ ఫ‌న్నీ డైలాగ్‌తో మొద‌ల‌య్యే ట్రైల‌ర్ స‌ర‌దాగా సాగిపోయింది.

"ప్రేమ రసం కాదు భయ్యా....! చట్నీ...!!" చాలూ.. నాని ఇంకో హిట్ కొట్టేసినట్టే. (ట్రైలర్)

ట్రయాంగిల్ లవ్ స్టొరీ ఇది. ఇద్దరమ్మాయిలను ప్రేమిస్తాడు నాని. చివరికి ఎవరు దక్కుతారు , అసలు దక్కుతారా లేదా అన్నది సస్పెన్స్. ట్రైలర్ లో ఓ డైలాగ్ భలే పేలింది.

"ప్రేమ రసం కాదు భయ్యా....! చట్నీ...!!" చాలూ.. నాని ఇంకో హిట్ కొట్టేసినట్టే. (ట్రైలర్)

‘మీ కథలో నవరసాలు ఉన్నాయి భయ్యా! మరి ప్రేమ' అని వెన్నెల కిషోర్‌ అడిగితే ‘ప్రేమ రసం కాదురా! చట్నీ' అంటూ నాని చెప్పే సమాధానం నవ్వులు పూయిస్తోంది. చివర్లో నాని హాజర్లు వేసే సీన్ కూడా నవ్వించింది.

"ప్రేమ రసం కాదు భయ్యా....! చట్నీ...!!" చాలూ.. నాని ఇంకో హిట్ కొట్టేసినట్టే. (ట్రైలర్)

అసిస్టెంట్ డైరెక్టర్ గా కనిపించ బోయే నాని ఈ సినిమాలో రాజమౌళి దగ్గర అసిస్టెంట్ గా కనిపించనున్నాడు. అసలు ట్రైలర్ మోట్లోనే వెనుకనుంచి కనిపించారు స్టార్ డైరెక్టర్ రాజమౌళి.

https://www.youtube.com/watch?v=Y6ktNdbenGY

"ప్రేమ రసం కాదు భయ్యా....! చట్నీ...!!" చాలూ.. నాని ఇంకో హిట్ కొట్టేసినట్టే. (ట్రైలర్)

చివ‌ర్లో సినిమా క‌మింగ్ సూన్ అనడానికి సూచిక‌గా పెట్టిన డైలాగ్ కూడా ఫ‌న్నీగా ఉంది. మొత్తంగా ట్రైల‌ర్ చూస్తే నాని మ‌రో హిట్టు కొట్టేలాగే క‌నిపిస్తున్నాడు. జెమిని కిర‌ణ్ నిర్మించిన ఈ చిత్రంలో నాని స‌ర‌స‌న కొత్త‌మ్మాయిలు అను ఇమ్మాన్యుయెల్.. ప్రియ‌శ్రీ న‌టించారు. గోపీసుంద‌ర్ సంగీత ద‌ర్శ‌కుడు.

English summary
The trailer of Majnu is out now on you tube. Trailer has been released on the occasion of audio songs event.
 
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu