Don't Miss!
- News
ఢిల్లీకి ముఖ్యమంత్రి జగన్ - "చేదోడు" అక్కడి నుంచే..!!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Sports
Team India : అవకాశాలు అన్నీ వేస్ట్.. చివరి హాఫ్ సెంచరీ ఎప్పుడు చేశావ్..?
- Lifestyle
కూల్ డ్రింక్స్ తాగితే పురుషుల్లో జుట్టు రాలుతుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Tuck Jagadish: నాయుడి గారి అబ్బాయి చెబుతున్నాడు.. వీడియోతో సర్‌ప్రైజ్ చేసిన నాని
తెలుగు సినీ ఇండస్ట్రీలో హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో నేచురల్ స్టార్ నాని ఒకడు. అసాధారణమైన సహజ సిద్ధ నటనతో ప్రతి సినిమాలోనూ అదిరిపోయే పెర్ఫార్మెన్స్ చేస్తూ.. ప్రేక్షకులను ఫిదా చేస్తున్నాడతను. ఈ క్రమంలోనే ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ మార్కెట్‌ను గణనీయంగా పెంచుకుంటున్నాడు. అదే సమయంలో చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా నాని ఓ సర్‌ప్రైజింగ్ వీడియోతో ఎంట్రీ ఇచ్చి ఓ గుడ్ న్యూస్ చెప్పాడు. ఆ వివరాలు మీకోసం!

‘టక్ జగదీష్' అంటూ వస్తున్న నాని
శివ నిర్వాణ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటించిన చిత్రం 'టక్ జగదీష్'. కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన ఇందులో టాలెంటెడ్ హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ నటిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. దీన్ని షైస్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, పెద్ది హరీష్ నిర్మిస్తున్నారు. నాజర్, జగపతిబాబు, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రలను చేస్తున్నారు.
సుడిగాలి సుధీర్ రెమ్యూనరేషన్ లీక్: ఏ షోకు ఎంత వస్తుందంటే.. వామ్మో నెలకే అంత ఆదాయమా!

అంచనాలు పెంచేసిన ‘టక్ జగదీష్'
సాధారణంగా నాని సినిమాలంటే లవ్ స్టోరీలతోనో, కుటుంబ కథలతోనో తెరకెక్కుతాయి. అతడిని మాస్ బ్యాగ్రౌండ్‌తో పెద్దగా చూసిన సందర్భాలు మాత్రం లేవనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో 'టక్ జగదీష్' సినిమా నుంచి వచ్చిన టీజర్, పోస్టర్లలో ఏకంగా కత్తి పట్టుకుని కనిపించాడు. దీంతో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఫలితంగా దీనిపై ఆసక్తి క్రమంగా పెరిగిపోయింది.

షూటింగ్ ఎప్పుడో.. ఆటంకాల వల్ల
'నిన్ను కోరి' వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో 'టక్ జగదీష్' అనే సినిమాలో నటించాడు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. అనివార్య కారణాలతో ప్రేక్షకుల ముందుకు మాత్రం రాలేదు. దీన్ని గత సమ్మర్‌లోనే విడుదల చేస్తున్నట్లు ప్రకటించినా.. కోవిడ్ సెకెండ్ వేవ్ కారణంగా అది సాధ్య పడలేదు. దీంతో ఈ చిత్రం వాయిదా పడిపోయింది.
Intinti Gruhalakshmi August 27th Episode: లాస్య గురించి నిజం తెలుసుకున్న నందూ.. శృతికి కొండత కష్టం

ఓటీటీలో టక్... టాలీవుడ్‌లో రచ్చ
'టక్ జగదీష్' మూవీని అమెజాన్ ప్రైమ్‌లో నేరుగా విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని యూనిట్ వెల్లడించకున్నా ఇటీవల 'లవ్ స్టోరీ' నిర్మాతల ప్రెస్‌మీట్‌తో ఇది కాస్తా బయటకు వచ్చింది. అదే సమయంలో పెద్ద రచ్చ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో 'టక్ జగదీష్' నిర్మాతలు తమ సినిమా ఎదుర్కొన్న పరిస్థితులను వివరిస్తూ లేఖను కూడా విడుదల చేయడంతో వివాదం సద్దుమణిగింది.

నాని ట్వీట్... దీని గురించే అంటూ
నేచురల్ స్టార్ నాని గురువారం తన ట్విట్టర్ ఖాతాలో 'టుమారో / రేపు' అని ఓ పోస్ట్ పెట్టాడు. అతడు ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ ఉన్నా.. ఈ స్టార్ హీరో చెప్పబోయే న్యూస్.. 'టక్ జగదీష్' మూవీ ఓటీటీ విడుదలకు సంబంధించిన అప్‌డేట్ అయి ఉంటుందన్న టాక్ జోరుగానే వినిపించింది. దీని కోసం నాని ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులంతా ఆపక్తిగా ఎదురు చూస్తూ వచ్చారు.
అందాలు ఆరబోసి షాకిచ్చిన రష్మిక మందన్నా: ఆమెను ఇంత ఘాటుగా ఎప్పుడూ చూసుండరు!
Recommended Video
|
వీడియోతో సర్‌ప్రైజ్ చేసిన జగదీష్
ముందుగా చెప్పన దాని ప్రకారమే ఈరోజు నాని అదిరిపోయే ప్రకటన చేశాడు. తాజాగా అతడు ఓ వీడియోను విడుదల చేశాడు. అందులో 'టక్ జగదీష్' చిత్రాన్ని సెప్టెంబర్ 10 నుంచి అమెజాన్‌లో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాదు, ఇందులో 'భూదేవిపురం చిన్న కొడుకు, నాయుడి గారి అబ్బాయి టక్ జగదీష్ చెబుతున్నాడు.. మొదలెట్టండి' అనే డైలాగ్‌ను కూడా చూపించారు.