For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇక తప్పడం లేదు, టక్ జగదీష్‌తో థియేటర్‌లో కలుస్తా.. V రిలీజ్‌పై నాని ఎమోషనల్

  |

  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌‌పై దిల్ రాజు నిర్మాతగా నాని కెరీర్లో 25వ చిత్రంగా తెరకెక్కిన V సినిమా రిలీజ్‌కు సిద్ధమైంది. వాస్తవానికి ఈ చిత్రం ఏప్రిల్, మే నెలల్లో రిలీజ్ కావాల్సింది. కానీ కరోనావైరస్ పరిస్థితుల కారణంగా రిలీజ్ వాయిదా పడింది. అయితే ఇప్పట్లో థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపించకపోవడంతో ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో వరల్డ్ ప్రీమియర్‌గా రిలీజ్ చేయాలని నిర్ణయించారు. బుధవారమే నాని ప్రోమో రిలీజ్ చేసి V సినిమా విడుదలపై ఓ హింట్ ప్రేక్షకులను సన్నద్ధం చేసే ప్రయత్నం చేశారు.

  అసాధారణ పరిస్థితుల్లో V మూవీని

  అసాధారణ పరిస్థితుల్లో V మూవీని


  V చిత్రం గురించి నాని ఓ లేఖను గురువారం ట్వీట్ చేస్తూ.. నా ఫ్యామిలీ, అభిమానులందరికి విన్నపం. ప్రస్తుతం సమాజంలో అసాధారణ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఎప్పడూ ఉండే అనుభూతులకు మనమంతా దూరంగా బతుకుతున్నాం. ఆ నేపథ్యంలో V చిత్రాన్ని ఓటీటీ ద్వారా మీ ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేశాం అని నాని తెలిపారు.

  నా కెరీర్‌లో 25వ చిత్రం ఓ మధురానుభూతిగా

  నా కెరీర్‌లో 25వ చిత్రం ఓ మధురానుభూతిగా

  V మూవీ నా కెరీర్‌లో 25వ చిత్రం. నాకు, నా అభిమానులకు ప్రత్యేకంగా నిలువాలని కోరుకొంటున్నాను. కరోనా పరిస్థితుల వల్ల ఈ సినిమాను థియేటర్లలో కంటే ఓటీటీలో రిలీజ్ చేయాలని అనుకొన్నాం. ఈ నిర్ణయాన్ని నాకు ఓ మధురానుభూతిగా మిగిలిపోవాలని కోరుకొంటున్నాను అని నాని ఓ ప్రకటనలో తెలిపారు.

  12 ఏళ్లుగా అక్కడే కలిశా..

  12 ఏళ్లుగా అక్కడే కలిశా..


  గత12 ఏళ్లుగా థియేటర్‌లో వెండితెరపైనే నన్ను చూశారు. తొలిసారి నేను మీ ఇంటి థియేటర్‌లోకే ప్రవేశిస్తున్నాను. నాకు గతంలో రిలీజ్ డే రోజున ఉండే ఉత్సాహం, కంగారు నాలో మొదలయ్యాయి. థియేటర్లు ఓపెన్ అయితే తప్పుకుండా టక్ జగదీష్ ద్వారా మిమల్ని సినిమా హాళ్లలోనే కలుస్తాను. ఇదే నా ప్రామిస్ అంటూ లేఖలో పేర్కొన్నారు.

  సెప్టెంబర్ 5న రిలీజ్

  సెప్టెంబర్ 5న రిలీజ్


  నాని, సుధీర్ బాబు కలిసి నటించిన V చిత్రం సెప్టెంబర్ 5వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానున్నది. 4వ తేదీ రాత్రి 9.30 నిమిషాలకు ప్రైమ్‌లో ప్రసారం అవుతుంది. అదితి రావు హైదరీ, నివేదా థామస్ హీరోయిన్లుగా నటించారు. జగపతి బాబు, వెన్నెల కిషోర్, నాజర్, శ్రీనివాస్ అవసరాల, ప్రియదర్శి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

  తెర వెనుక, తెర ముందు

  తెర వెనుక, తెర ముందు


  నటీనటులు: నాని, సుధీర్ బాబు, అదితి రావు హైదరీ, నివేదా థామస్ హీరోయిన్లుగా నటించారు. జగపతి బాబు, వెన్నెల కిషోర్, నాజర్, శ్రీనివాస్ అవసరాల, ప్రియదర్శి
  సాంకేతిక నిపుణులు, ఇతర వివరాలు
  రచన, దర్శకత్వం: మోహన్ కృష్ణ ఇంద్రగంటి
  నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్, హర్షిత్ రెడ్డి
  బ్యాక్ గ్రౌండ్ స్కోర్: ఎస్ థమన్
  మ్యూజిక్: అమిత్ త్రివేది
  సినిమాటోగ్రఫి: పీజీ విందా
  ఎడిటింగ్: మార్తాండ్ కే వెంకటేష్
  బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేటన్స్
  ఓటీటీ రిలీజ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
  ఓటీటీ రిలీజ్ డేట్: 2020-09-05

  English summary
  Nani's V movie set to release on Amazon Prime video on 5th September. This movie si so specail to Nani, because V could be 25th in his career. V Movie is planned world preview on September 5th.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X