'రాష్ట్ర విభజన' పై హీరో నాని ట్వీట్
హైదరాబాద్ : ఐదు దశాబ్దాలుగా రగులుతున్న సమస్యకు 'రాష్ట్ర విభజనే' పరిష్కారమని కాంగ్రేస్ తేల్చిచెప్పింది. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి జై కొట్టింది. మంగళవారం కేవలం మూడు గంటల వ్యవధిలో... అటు యూపీఏ సమన్వయ కమిటీతో, ఇటు సీడబ్ల్యూసీతో 'ఆమోద ముద్ర' వేయించింది. ఈ నేపధ్యంలో కొందరు సెలబ్రేటీలు ట్విట్టర్ లో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మరి కొందరు ఆచితూచి మాట్లాడుతున్నారు.
తెలుగు హీరో నాని ట్వీట్ చేస్తూ...మన ఇంటి మధ్యలో గోడ కడుతున్నారన్నమాట...సరే...ఎన్ని చూసాం...ఇదీ చూస్తు కూర్చుందాము....అని ట్వీట్ చేసారు. ఇది చదివిన వాళ్లు నాని బాధతో సెటైర్ గా అన్నాడని అంటున్నారు. తన సెలబ్రెటీ స్టేటస్ ని కూడా ప్రక్కన పెట్టి తన మనస్సులో మాట చెప్పారంటున్నారు.
ఇక నాని ప్రస్తుతం 'పైసా' సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో నాని పాత్ర గురించి ఒక ఇంటరెస్టింగ్ విషయం తెలిసింది. ఈ సినిమాలో నాని పాత్ర పేరు ప్రకాష్ కానీ అతను ఆ పేరు ని ప్ర'క్యాష్' గా మార్చుకుంటాడు సమాచారం.
సినిమా టైటిల్ పైసా కావడం వల్ల సినిమా అంతా మనీ లాండరింగ్, హవాలా మొదలైన వాటి చుట్టూ తిరుగుతుంది. ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్ పై రమేష్ పుప్పల నిర్మిస్తున్న ఈ సినిమాలో కేథరిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో తను నూర్ గా కనిపించనుంది. సాయి కార్తీక్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











