»   »  భయమేస్తోంది, ఒళ్లు దగ్గర పెట్టుకుని చేయాలని తెలుసు: నాని

భయమేస్తోంది, ఒళ్లు దగ్గర పెట్టుకుని చేయాలని తెలుసు: నాని

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాని నటించిన 'నేను లోకల్' మూవీ బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ అయిన నేపథ్యంలో హీరో నాని స్వయంగా సోషల్ మీడియా ద్వారా స్పందించారు. సినిమాను హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్ చెప్పారు.

Nani video byte about 'Nenu Local' success

నాని స్పందిస్తూ....ఫస్ట్ టైం నా సినిమా రిలీజ్ కి ఇండియాలో లేను. కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది. కానీ సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసి మీరు ఆ డిసప్పాయింట్మెంట్ మొత్తం కవర్ చేసారు. ఆ రోజు నుండి ఫేస్ బుక్ లో గానీ, ట్విట్టర్లో గానీ, ఫోన్లో గానీ ఇంకా ఏ విధంగా అయినా నాకు విషెస్ పంపి నన్ను ఇంతగా ఆదరించిన, సినిమాను సక్సెస్ చేసిన అందరికీ పేరు పేరునా థాంక్స్ అని నాని అన్నారు.

ఫిబ్రవరి 12... కృష్ణగాడివీర ప్రేమగాధ విడుదలై సంవత్సరం అయింది. ఆ తర్వాత జెంటిల్మెన్, ఆ తర్వాత మజ్నూ, ఆ తర్వాత నేను లోకల్... ఇలా ప్రతి సినిమాను మీరు సక్సెస్ చేసారు. నాకు ఎంతో సపోర్ట్ అందించారు. తెలియకుండా ఒక బాధ్యత పెరిగిపోయింది. నేను కలలో కూడా ఊహించనంత ఎత్తుకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు. భయ మేస్తోంది. ఇక నుండి ప్రతి సినిమా ఇంకా ఎక్కువ కష్టపడాలి. ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయాలి అని నాకు తెలుసు అని నాని అన్నారు.

ఈరోజు ఈ విషయం గురించి ఇంత లేటుగా రెస్పాండ్ అవడానికి కారణం నెక్ట్స్ మూవీ షూటింగ్ మొదలు పెట్టాం, అది కంటిన్యూస్ గా షూట్ జరుగుతోంది. ఆ సినిమా కూడా మీ ముందుకు ఎప్పుడెప్పుడు తీసుకొస్తానా అని చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాను. మరోసారి నేను లోకల్ చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసినందకు, నన్ను ఇంతగా నమ్మినందుకు మీ అందరికీ థాంక్స్ సో మచ్... అని నాని తెలిపారు.

English summary
Actor Nani thanked Telugu movie lovers for receiving his films so well. Nani said that he was a bit disappointed earlier as for the first time he wasn't in India on the day of his film 'Nenu Local' release.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu