»   » రెండూ ఒక్కసారే, ఒక్కదాన్లోనే రెండుసార్లు: నానీ ఆగటం లేదుగా

రెండూ ఒక్కసారే, ఒక్కదాన్లోనే రెండుసార్లు: నానీ ఆగటం లేదుగా

Posted By:
Subscribe to Filmibeat Telugu

నిన్ను కోరి చిత్రం విజయం సాధించిన ఆనందంలో ఉన్న నాని తన తర్వాత సినిమాల పేర్లను ప్రకటించేశాడు. ఎంసీఏ పేరుతో నాని తన 20వ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి శ్రీరాం వేణు దర్శకత్వం వహిస్తుండగా.. రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

21వ చిత్రం పేరు

21వ చిత్రం పేరు

దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ కూడా ప్రారంభమయినట్లు నాని తన ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. ఈ చిత్రంలో కథానాయికగా ఎవరు నటిస్తున్నారనే విషయం తెలియాల్సి ఉంది. 21వ చిత్రం పేరును కూడా నాని శుక్రవారం ప్రకటించేశాడు.

Nani Thanks Selfie Video For Ninnu Kori Movie
కృష్ణార్జున యుద్ధం

కృష్ణార్జున యుద్ధం

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కృష్ణార్జున యుద్ధం అనే టైటిల్‌ను ఖరారు చేశారు. హిప్‌ హాప్‌ తమిజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం పోషిస్తున్నాడు. తాజాగా నాని 20వ చిత్రం ఎంసిఏ లోగో తో పాటు నాని 21వ చిత్రం కృష్ణార్జున యుద్ధం టైటిల్ లోగోని విడుదల చేశారు.

రెండు సార్లు డబల్ రోల్ లో

రెండు సార్లు డబల్ రోల్ లో

తక్కువ సమయం లో రెండు సార్లు డబల్ రోల్ లో కనిపించాడు నాని ఇప్పటికే డబుల్ యాక్షన్లో రెండుసార్లు సినిమాలు చేశాడు నాని. ఒకసారి 'జండాపై కపిరాజు' అంటూ సందడి చేయడగా.. మరోసారి 'జెంటిల్మన్' అంటూ కనిపించాడు. అయితే ఒక సారి వర్కౌట్ అయినట్టే కనిపించింది గానీ దానికి ముందు మాత్రం దారుణం గా దెబ్బతిన్నాడు నాని.

డబుల్ హ్యాట్రిక్ హిట్స్‌

డబుల్ హ్యాట్రిక్ హిట్స్‌

డబుల్ హ్యాట్రిక్ హిట్స్‌ను క్రాస్ చేసిన నాని తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టి జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నాడు.అయితే ఇప్పుడు రాబోతున్న సినిమా లో మరో సారి డ్యుఎల్ రోల్ చేయబోతున్నాడట. లేటెస్ట్ ప్రాజెక్ట్ పేరు కృష్ణార్జున యుద్దం అని కన్ఫాం కూడా అయిపోయింది.

డ్యుయల్ రోల్

డ్యుయల్ రోల్

ఎక్స్ ప్రెస్ డైరక్టర్ మేర్లపాక గాంధి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ గా కృష్ణార్జున యుద్ధం అని పెట్టారు. ఇందులో నాని డ్యుయల్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. జెండాపై కపిరాజు, జెంటిల్మన్ తర్వాత నాని చేయబోయే ద్విపాత్రాభినయం ఇదే అని చెప్పాలి.

ఎన్టీఆర్ అండ్ ఏఎన్నార్ కాంబినేషన్లో

ఎన్టీఆర్ అండ్ ఏఎన్నార్ కాంబినేషన్లో

సినిమా ఎనౌన్స్ మెంట్ నే భారీ ఎత్తున ప్రకటించిన నాని సినిమాలను కూడా అదే రేంజ్ లో ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు. 'కృష్ణార్జున'' అంటూ గతంలో ఎన్టీఆర్ వంటి స్టార్లు డబుల్ యాక్షన్ సినిమాలతో దూసుకొచ్చి సంగతి తెలిసిందే. ఆ తరువాత ఎన్టీఆర్ అండ్ ఏఎన్నార్ కాంబినేషన్లో ''కృష్ణార్జున యుద్దం'' కూడా వచ్చింది.

మేర్లపాక గాంధి

మేర్లపాక గాంధి

ఇప్పుడు ఈ రెండో టైటిల్ తో నాని ఒక యాక్షన్ కామెడీ చేస్తున్నాడు. వెంకటాద్రి ఎక్సప్రెస్ సినిమాతో సత్తాచాటిన మేర్లపాక గాంధి ఈ సినిమాకు డైరక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. పైగా ఈ సినిమాకు ధృవ సినిమాకు సంగీతం అందించిన హిప్ హాప్ తమిళ సంగీతం అందించడం విశేషం. సినిమా కంటెంట్ విషయానికిస్తే.. నానితో నాని చేసే యుద్దమే సినిమా అని చెప్పకనే చెబుతోంది. మరి డబుల్ రోల్స్ లో నాని ఎలా ఇంప్రెస్ చేస్తాడో చూడాలి.

English summary
Nani has officially confirmed the title of the film with Gandhi through twitter and also reveal the logo of the film. The film has been titled ‘Krishnarjuna Yuddham’.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu