»   »  ‘నాన్నకు ప్రేమతో’ సంక్రాంతికి డౌటే అంటున్నారు!

‘నాన్నకు ప్రేమతో’ సంక్రాంతికి డౌటే అంటున్నారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'నాన్నకు ప్రేమతో' సంక్రాంతికి ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే సినిమా అనుకున్న సమాయానికి రావడం డౌటే అంటున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తిగారు చనిపోవడంతో సినిమాకు సంబంధించిన రికార్డింగ్ పనులు ఆగిపోయాయని అంటున్నారు. ఈ సినిమాకి సంబంధించి దేవి ఇంకా ఓ పాట రికార్డ్ చేయాల్సి ఉందట. అలాగే రీ-రికార్డింగ్ కూడా చేయాల్సి ఉంది. దేవిశ్రీ తండ్రి పోయిన బాధ నుండి తేరుకుని పని పూర్తి చేస్తే తప్ప సినిమా విడుదలయ్యే అవకాశం లేదు అని అంటున్నారు. మరో వైపు ఈ నెల 23న జరుగాల్సిన ఆడియో కూడా వాయిదా పడినట్లు టాక్.

రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే అత్యంత కాస్ట్‌లియస్ట్‌ చిత్రంగా 'నాన్నకు ప్రేమతో' చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా చాలా లావిష్‌గా చిత్రీకరిస్తున్నారు. దర్శకుడు సుకుమార్‌ టెక్నికల్‌గా చాలా హై స్టాండర్డ్స్‌లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

‘Nannaku Prematho’ May Not..

ఈ సినిమా షూటింగ్ ఎక్కువ శాతం విదేశాల్లోనే జరిగింది. 60 రోజులపాటు లండన్‌లో షూటింగ్ జరిగింది. తర్వాత స్పెయిన్ లోని రేర్ లొకేషన్లలో షూటింగ్ జరిపారు. యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ భారీ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార, అమిత్‌, తాగుబోతు రమేష్‌, గిరి, నవీన్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఫోటోగ్రఫీ: విజయ్‌ చక్రవర్తి, ఆర్ట్‌: రవీందర్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, పాటలు: చంద్రబోస్‌, డాన్స్‌: రాజు సుందరం, శేఖర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సుధీర్‌, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్‌.

English summary
NTR’s ‘Nannaku Prematho’ May Not Hit Screens On Pongal. It is known that Devi Sri Prasad’s father passed away recently. The versatile music director is heading the music department for the Sukumar directorial.
Please Wait while comments are loading...