»   »  మొత్తానికి మహేష్ రికార్డ్ ని బ్రద్దలు కొట్టాడు

మొత్తానికి మహేష్ రికార్డ్ ని బ్రద్దలు కొట్టాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎన్టీఆర్ లేటెస్ట్ చిత్రం "నాన్నకు ప్రేమతో" బాగా కలిసివస్తోంది. మొదట మిక్సెడ్ టాక్ తెచ్చుకుని కంగారు పెట్టినా ఇప్పుడు సంక్రాంతి రిలీజ్ ల రికార్డ్ ని బ్రద్దలు కొట్టి ఆనందాన్ని కలిగిస్తోంది.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఇంతకాలం మహేష్ చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో కలెక్షన్ వైజ్ గా టాప్ ప్లేస్ లో ఉంది. 51 కోట్లు సంపాదించి పెట్టి రికార్డ్ నెలకొల్పింది.నాన్నకు ప్రేమతో చిత్రం..నిన్నటి కలెక్షన్స్ తో కలిపి.. ఎన్టీఆర్ ఈ రికార్డ్ ని బ్రద్దులు కొట్టారు.

ఎందుకంటే ఎన్టీఆర్..నాన్నకు ప్రేమతో ఇప్పటివరకూ 50 కోట్లు షేర్ సంపాదించిందని నిర్మాత స్వయంగా ప్రకటించారు. ఈ చిత్రం ధియోటర్స్ లో ఇంకా వీకెండ్స్ లో హౌస్ ఫుల్స్ లో రన్ అవుతోంది. ఈ నేపధ్యంలో క్లోజింగ్ బిజినెస్ నాటికి ఖచ్చితంగా మరిన్ని కోట్లు సంపాదించి పెడుతుంది. అందుకే ఇదే సంక్రాంతి సినిమాల్లో టాప్ రికార్డ్ చిత్రం అవుతుంది అంటున్నారు.

Nannaku Prematho overtook Mahesh's movie

నిర్మాత మాట్లాడుతూ ''ఎన్టీఆర్‌ సినీ ప్రయాణానికీ, మా సంస్థకి ఎంతో ప్రతిష్ఠాత్మకమైన చిత్రమిది. '' అన్నారు. జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటించిన ఈ భారీ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార, అమిత్‌, తాగుబోతు రమేష్‌, గిరి, నవీన్‌ తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీప్రసాద్‌, ఫోటోగ్రఫీ : విజరు చక్రవర్తి, ఆర్ట్‌ : రవీందర్‌, ఫైట్స్‌ : పీటర్‌ హెయిన్స్‌, ఎడిటింగ్‌ : నవీన్‌ నూలి, పాటలు : చంద్రబోస్‌, డాన్స్‌ : రాజు సుందర కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : సుకుమార్‌.

English summary
Mahesh Babu's Seethamma Vaakitlo Sirimallechettu collected 51 crores share. Now Jr NTR's film Nannaku Prematho has overtook this figure with collections till yesterday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu