»   » రిలీజ్ డేట్: ‘నాన్నకు ప్రేమతో..’ అఫీషియల్ ప్రెస్‌నోట్

రిలీజ్ డేట్: ‘నాన్నకు ప్రేమతో..’ అఫీషియల్ ప్రెస్‌నోట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, ఆర్య సుకుమార్‌ కాంబినేషన్‌లో రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రం 'నాన్నకు ప్రేమతో..'. ఈ చిత్రాన్ని జనవరి 13న సంక్రాంతి కానుకగా వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌.

ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ - ''యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే అత్యంత కాస్ట్‌లియస్ట్‌ చిత్రంగా రూపొందిన 'నాన్నకు ప్రేమతో' చిత్రాన్ని జనవరి 13న సంక్రాంతి కానుకగా వరల్డ్‌వైడ్‌గా చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. దేవిశ్రీప్రసాద్‌ సంగీత సారధ్యంలో రూపొందిన ఆడియో చాలా పెద్ద హిట్‌ అయింది. అన్ని ఏరియాల నుంచి ఆడియోకి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఈ చిత్రానికి అన్నీ సూపర్‌హిట్‌ పాటలు చేశారు దేవిశ్రీప్రసాద్‌. ఎన్టీఆర్‌, సుకుమార్‌ ఫస్ట్‌ కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రం మా బేనర్‌లో మరో సూపర్‌హిట్‌ మూవీ అవుతుంది'' అన్నారు.


Nannaku Prematho release on 13 January

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ భారీ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార, అమిత్‌, తాగుబోతు రమేష్‌, గిరి, నవీన్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఫోటోగ్రఫీ: విజయ్‌ చక్రవర్తి, ఆర్ట్‌: రవీందర్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, పాటలు: చంద్రబోస్‌, డాన్స్‌: రాజు సుందరం, శేఖర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సుధీర్‌, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్‌.

English summary
Nannaku Prematho release on 13 January. Naanaku Prematho is an upcoming Telugu action family drama film written and directed by Sukumar and produced by B. V. S. N. Prasad under his Sri Venkateswara Cine Chitra Banner and co-produced by Bhogavalli Bapineedu & Reliance Entertainment .
Please Wait while comments are loading...