»   » ‘నాన్నకు ప్రేమతో’ రెస్పాన్స్ ఈ రేంజిలో ఉందేంటి?

‘నాన్నకు ప్రేమతో’ రెస్పాన్స్ ఈ రేంజిలో ఉందేంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నాన్నకు ప్రేమతో' ఆడియో రిలీజ్ ఇటీవల గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా విడుదలైన అఫీషియల్ ట్రైలర్ కు యూట్యూబులో రెస్పాన్స్ భారీగా వస్తోంది. ట్రైలర్ విడుదలైన కేవలం 36 గంటల్లోనే యూట్యూబ్ లో 1 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. బాహుబలి సినిమాకు తప్ప ఈ రేంజిలో రెస్పాన్స్ టాలీవుడ్ లో ఏ సినిమాకు రాలేదు.

ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో సినిమాలకు ఓపెనింగ్సే కీలకం....ఏ సినిమా అయినా వారం రోజులు బాక్సాఫీసు వద్ద ఫలితం తేలిపోతుంది. సినిమాకు క్రేజ్ ఎక్కువగా ఉన్నపుడే ఓపెనింగ్స్ అదిరిపోతాయి. అందుకే ముందుగా సినిమా ట్రైలర్లు విడుదల చేసి వాటికి వచ్చే రెస్పాన్స్ ఆధారంగా ఓపెనింగ్స్ ఎలా ఉండబోతున్నాయనే దానిపై ఓ అంచనాకు వస్తున్నారు.


Nannaku Prematho trailer crosses the 1 million mark

‘నాన్నకు ప్రేమతో' చిత్రం ప్రేక్షకులు పెట్టుకున్న భారీ అంచనాలకు తగిన విధంగానే గ్రాండ్ గా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ఏ, ఇతర ఓవర్సీస్ మార్కెట్లలో వెయ్యికి పైగా థియేటర్లలో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ భారీ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార, అమిత్‌, తాగుబోతు రమేష్‌, గిరి, నవీన్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఫోటోగ్రఫీ: విజయ్‌ చక్రవర్తి, ఆర్ట్‌: రవీందర్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, పాటలు: చంద్రబోస్‌, డాన్స్‌: రాజు సుందరం, శేఖర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సుధీర్‌, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్‌.

English summary
The trailer of Nannaku Prematho which was released on Sunday has created a huge buzz all over. According to the latest update, the trailer has crossed the 1 million mark within 36 hours of its release.
Please Wait while comments are loading...