»   » ఎన్టీఆర్ బయోపిక్‌తో వర్మకు సీన్ రివర్స్.. మాటలతో తాట తీసిన లోకేశ్, పోసాని, లక్ష్మీ పార్వతి

ఎన్టీఆర్ బయోపిక్‌తో వర్మకు సీన్ రివర్స్.. మాటలతో తాట తీసిన లోకేశ్, పోసాని, లక్ష్మీ పార్వతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏ క్షణాన ఎన్టీఆర్ బయోపిక్ అంటూ ప్రకటించారో అప్పటి నుంచి మీడియాలో గందరగోళంగా మారింది. పలువరు ప్రముఖుల వర్మను మాటలతో తాట తీస్తున్నారు. పోసాని కృష్ణమురళి, లక్ష్మీ పార్వతి, లోకేష్ తదితరులు వర్మపై నిప్పులు చెరిగారు. అయితే ఎన్టీఆర్ బయోపిక్ అంటే ఆషామాషీ వ్యవహారం కాదని పలువరు బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. ముందు వెనుకా ఆలోచించకుండా ప్రకటనలు చేసి వివాదంలో చిక్కుకునే వర్మ తాజాగా ఓ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎన్టీఆర్ బయోపిక్‌కు వర్మ దర్శకుడు కాదని తాజాగా మంత్రి లోకేశ్ స్పష్టం చేయడం గమనార్హం.

ఎన్టీఆర్ బయోపిక్ ఆలోచన పుట్టింది.

ఎన్టీఆర్ బయోపిక్ ఆలోచన పుట్టింది.

ఎన్టీయార్‌ జీవితంపై సినిమా తీస్తే బాగుంటుందన్న ఆలోచన సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ (సీసీఎల్) నిర్వహిస్తున్న విష్ణు ఇందూరిదనే మాట వినిపిస్తున్నది. ఇటీవల విదేశాల్లో సినీతారలతో ‘సైమా' అవార్డుల లాంటి ఫంక్షన్లతో ఒక్కసారిగా సెలబ్రిటీ అయిన విష్ణు ఆ ప్రతిపాదనతో బాలకృష్ణను కలిశారట. ఆ ప్రాజెక్టు పని మీదే ఎన్టీయార్‌తో అనుబంధమున్న వారిని, చరిత్రకారుల్నీ బాలకృష్ణ కలుస్తూ వచ్చారనేది తాజా సమాచారం. ఈ క్రమంలోనే వర్మను విష్ణు కలిసి ఉంటాడనే మాట వినిపిస్తున్నది.

ప్రకటన, పాటతో వర్మ అత్యుత్సాహం

ప్రకటన, పాటతో వర్మ అత్యుత్సాహం

ఆలి లేదు చూలూ లేదు గానీ కొడుకు పేరు గోవిందు అన్నాడట వెనుకట ఎవడో. ఎన్టీఆర్ బయోపిక్ తీస్తున్నానని ప్రకటించడమే కాకుండా దానికి తోడు సొంతంగా పాడిన పాటను కూడా విడుదల చేశాడు. ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని రాయప్రోలు గారు అంటే.. నేను ఒక సినీ దర్శకుడి హోదాలో కాకుండా 8 కోట్ల తెలుగువాళ్లలో కేవలం ఒక్కడిగా ‘ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి తెలుగు భారతిని.. పొగడరా నీ తండ్రి ఎన్టీఆర్‌ని' అని వర్మ అంటానన్నారు. ఎన్టీఆర్ గొప్పతనాన్ని కీర్తిస్తూ.. ‘జై ఎన్టీఆర్..' అంటూ తానే రాసి పాడిన పాటను కూడా వర్మ రిలీజ్ చేశారు.

వెనుక ఉండి నడిపించింది..

వెనుక ఉండి నడిపించింది..

ఎన్టీఆర్ బయోపిక్ గురించి ప్రకటన చేశారు గానీ.. అసలు వెనుక ఎవరుండి నడిపిస్తున్నారనే విషయాన్ని గోప్యంగా దాచారు. ఈ సినిమాలో బాలకృష్ణ హీరో అని గానీ, నిర్మాత ఫలానా అతను అనే మాటగానీ జారకుండా జాగ్రత్త పడ్డాడు. ప్రకటన తర్వాత ఔత్సాహిక నిర్మాతలు క్యూ కడుతారని ఈ గిమ్మిక్కు చేసి ఉంటారని పలువురు పేర్కొంటున్నారు.

నాలుగు రోజుల క్రితమే మాస్టర్ ప్లాన్

నాలుగు రోజుల క్రితమే మాస్టర్ ప్లాన్

వర్మ శిష్యుడు పూరీ జగన్నాథ్‌తో బాలకృష్ణతో ‘పైసా వసూల్‌' అనే చిత్రాన్ని ప్రస్తుతం చేస్తున్నారు. ఎన్టీయార్‌ బయోపిక్‌కు దర్శకుడు వర్మ అయితే బాగుంటుందనే భావనను బాలకృష్ణకు కలిగించారట. నాలుగురోజుల క్రితం జూన్‌ 30 ఉదయం పూరీ ఆఫీసులోనే బాలకృష్ణ, వర్మ, పూరీ, ఎన్టీయార్‌ కార్యదర్శిగా పనిచేసిన ఓ ప్రభుత్వ అధికారి కలిశారనేది తాజా సమాచారం. ఎవరి ప్రయోజనాలు ఏమైనా, నాలుగు రోజులకే బాలకృష్ణ పేరు ప్రస్తావించకుండా వర్మ తాజాగా ప్రకటన విడుదల చేయడం గందరగోళంగా మారింది.

వర్మకు షాకిచ్చిన లోకేశ్

వర్మకు షాకిచ్చిన లోకేశ్

ఎన్టీఆర్ బయోపిక్ ప్రకటన చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మంత్రి నారా లోకేష్ షాక్ ఇచ్చారు. ఎన్టీఆర్ బయోపిక్‌కు దర్శకుడిగా వర్మను తాము అనుకోలేదని ఆయన స్పష్టం చేశాడు. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీయాలనే విషయాన్ని పోర్చుగల్ పర్యటనలో తాము అనుకున్నామని చెప్పారు. ఎన్టీఆర్ పాత్రకు బాలయ్య అయితేనే సరిపోతారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశామన్నారు. దర్శకుడు ఎవరైనా సరే బాలయ్య ఉంటే సినిమా హిట్ అవుతుందని అన్నారు.

వర్మను వెంటాడి కొడుతారు..

వర్మను వెంటాడి కొడుతారు..

ఎన్టీఆర్ బయోపిక్‌ను దర్శకుడు వర్మ తీస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళి హెచ్చరించారు. ఎన్టీఆర్ జీవిత కథను వక్రీకరిస్తే ప్రజలు, అభిమానులు వెంటాడి కొడుతారని ఆయన హెచ్చరించారు. ఎన్టీఆర్ ఒక మహానటుడు, తెలుగు జాతి కీర్తిని దశదిశలా వ్యాప్తి చేసిన మహనీయుడు, ఆయన గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా, తప్పుగా చూపించినా సహించేది లేదని పలువురు స్పష్టం చేస్తున్నారు.

లక్ష్మీ పార్వతీకి ఎన్నో సందేహాలు

లక్ష్మీ పార్వతీకి ఎన్నో సందేహాలు

దర్శకుడు రాంగోపాల్ వర్మపై ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి అనేక సందేహాలు వ్యక్తం చేశారు. ఆయన ఎప్పుడూ వివాదాల్లో మునిగి తేలుతుంటారు. పగ, ప్రతీకారం అంశాలు, ఫ్యాక్షన్ కథలు తెరకెక్కించే ఆయన మహానటుడు ఎన్టీఆర్ జీవితాన్ని సరిగా తెరకెక్కిస్తారా అనే అనుమానాన్ని ఆమె వ్యక్తం చేశారు.

English summary
Grandson of NTR, Nara Lokesh is serious over Director Ram Gopal Varma. He said that Varma has not choosen for biopic. We thought on Biopic at Portugal. But we came to conclusion that Balakrishna would be suitable as NTR in biopic. Tuesday director Ram Gopal Varma announced a project on NTR life history.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu