»   » మా అబ్బాయి అని చెప్పడం లేదుగానీ...: చంద్రబాబు నాయుడు

మా అబ్బాయి అని చెప్పడం లేదుగానీ...: చంద్రబాబు నాయుడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :మా అబ్బాయి అని చెప్పడం లేదుగానీ తన నటన, గాత్రం చాలా బాగుంటాయి. 'బాణం', 'సోలో' చిత్రాల్లో చక్కటి ప్రతిభ కనబరిచాడు. ఈ చిత్రం కూడా తప్పక విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన 'ప్రతినిధి' సినిమా పాటల వేడుకకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యి ఇలా స్పందించారు.


నారా రోహిత్‌ హీరోగా నటించిన ఈ చిత్రంలో శుభ్రా అయ్యప్ప హీరోయిన్. ప్రశాంత్‌ మండవ దర్శకుడు. జె.సాంబశివరావు నిర్మాత. సాయికార్తీక్‌ స్వరాలు సమకూర్చారు. తొలి సీడీని చంద్రబాబు ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. ''సినిమారంగం... రాజకీయరంగం ఇలా ఎందులోనైనా ఎన్టీఆర్‌కి ఎవరూ సాటి రాలేరు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చు'' అన్నారు

Nara Rohit's Pratinidhi music launched

చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ...''యువతరంలో స్ఫూర్తిని రగిలించే అంశాన్ని కథగా ఎంచుకొని దర్శకుడు సినిమాని తెరకెక్కించారు. సమాజాన్ని ప్రక్షాళన చేస్తే ప్రపంచంలో మనదేశం మొదటిస్థానంలో నిలబడుతుంది. రాజకీయాల్లో పడిపోతున్న విలువల్ని నిలబెట్టేందుకు నవతరం రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. దీనికి ఈ చిత్రం స్ఫూర్తిగా నిలుస్తుందని నమ్ముతున్నాను. ఈ చిత్రంలో రోహిత్‌ చాలా బాగా నటించాడని అర్థమవుతుంది. 'ప్రతినిధి' సినిమాలో రాజకీయ నాయకులకు చాలా ప్రశ్నలు వేశారు'' అన్నారు.

నారా రోహిత్‌ మాట్లాడుతూ ''ఇది ఒక వైవిధ్యమైన కథ. ప్రస్తుత సమాజాన్ని ప్రతిబింబించేలా ఉంటుంది. ప్రశాంత్‌ మండవకి తొలి చిత్రమైన చక్కగా తీశారు. సాయికార్తీక్‌ చక్కటి స్వరాలు సమకూర్చారు'' అన్నారు. ఈ కార్యక్రమంలో యూనిట్ తో పాటు పరుచూరి గోపాలకృష్ణ, తమ్మారెడ్డి భరద్వాజ, రంగనాథ్‌, కోట శ్రీనివాసరావు, నాని, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌, దామోదర ప్రసాద్‌, గుమ్మడి రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

English summary
In Nara Rohit's latest movie 'Prathinidhi', the young hero is throwing powerful satires on politicians and their thirst for power. This Film audio released by Chandra Babu Naidu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu