»   »  నారా రోహిత్ ‘తుంటరి’ వేషాలు (ఫోటోస్)

నారా రోహిత్ ‘తుంటరి’ వేషాలు (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: శ్రీ కీర్తి ఫిలిమ్స్ రూపొందిస్తున్న‌ ప్రొడ‌క్ష‌న్ నెం.2లో నారా రోహిత్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం 'తుంట‌రి'. బాణం, సోలో, సారొచ్చారు, ప్ర‌తినిధి, రౌడీఫెలో వంటి సినిమాల‌తో త‌న‌దైన మార్కుతో దూసుకెళ్తున్నారు నారా రోహిత్‌.

తాజాగా శ్రీ కీర్తి ఫిలిమ్స్ లో ఆయ‌న న‌టిస్తున్న ‘తుంటరి' చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ప్రముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు ఎ.ఆర్‌.మురుగ‌దాస్ క‌థ‌ను అందించిన సినిమా ఇది.

నారా రోహిత్ ప‌క్క‌న ల‌తా హెగ్దే నాయిక‌గా న‌టిస్తోంది. గుండెల్లో గోదారి ఫేమ్ కుమార్ నాగేంద్ర ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వంలో అశోక్ బాబా, నాగార్జున్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నిర్మాతలు అశోక్ బాబా, నాగార్జున్ మాట్లాడుతూ ‘'ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. . ఈ చిత్రంలో నారా రోహిత్ న్యూ లుక్‌తో క‌నిపిస్తారు. సినిమా బాగా వచ్చింది. ప్రస్తుతం సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. త్వరలోనే టీజర్ ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే సాయికార్తీక్ సంగీతం అందించినఈ ఆడియో విడుదల కార్యక్రమాన్ని త్వరలోనే నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నాం'' అన్నారు.

స్లైడ్ షోలో తుంటరి సినిమాకు సంబంధించిన ఫోటోస్..

తుంటరి

తుంటరి


శ్రీ కీర్తి ఫిలిమ్స్ రూపొందిస్తున్న‌ ప్రొడ‌క్ష‌న్ నెం.2లో నారా రోహిత్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం 'తుంట‌రి'.

నారా రోహిత్

నారా రోహిత్


నారా రోహిత్ ప‌క్క‌న ల‌తా హెగ్దే నాయిక‌గా న‌టిస్తోంది. గుండెల్లో గోదారి ఫేమ్ కుమార్ నాగేంద్ర ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వంలో అశోక్ బాబా, నాగార్జున్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

న్యూ లుక్

న్యూ లుక్


ఈ చిత్రంలో నారా రోహిత్ న్యూ లుక్‌తో క‌నిపిస్తారు.

తెర వెనక

తెర వెనక


ఈ చిత్రానికి కెమెరాః ఎం.ఆర్‌.ప‌ళ‌ని కుమార్‌, మ్యూజిక్ః సాయికార్తీక్‌, ఎడిట‌ర్ః త‌మ్మిరాజు, ఆర్ట్ః ముర‌ళి కొండేటి, స్టంట్స్ః వెంక‌ట్‌,కొరియోగ్ర‌ఫీః బాబా భాస్క‌ర్‌, నిర్మాత‌లుః అశోక్ బాబా, నాగార్జున్‌, ద‌ర్శ‌క‌త్వంః కుమార్ నాగేంద్ర‌.

English summary
Nara Rohit's Tuntari movie update. This movie currently in post-production stage. Directed by Kumar Nagendra of Gundelo Godari fame, it has story by, interestingly, AR Murugadoss. Produced by Ashok and Nagarjun on Sri Keerthi Films, Latha Hegde is paired opposite Rohit in this youthful entertainer.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu