twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఆటగాళ్ళు’... డబ్బింగ్ మొదలెట్టిన నారా రోహిత్

    By Bojja Kumar
    |

    నారా రోహిత్, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఇంటిలిజెంట్ థ్రిల్లర్ "ఆటగాళ్లు". పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ పతాకంపై వాసిరెడ్డి రవీంద్ర, వాసిరెడ్డి శివాజీ, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్రలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నారా రోహిత్ సరసన హీరోయిన్‌గా దర్శనా బానిక్ ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమవుతోంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. బుధవారం చిత్ర కథానాయకుడు నారా రోహిత్ ఈ చిత్రానికి డబ్బింగ్ మొదలు పెట్టారు.

    ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. "మేం ఊహించినదానికంటే సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. పోస్టు ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. నారా రోహిత్ ఈ రోజు డబ్బింగ్ ప్రారంభించారు. దర్శకుడు మురళి "ఆటగాళ్లు" చిత్రాన్ని అద్భుతంగా మలిచిన తీరు ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. నారా రోహిత్-జగపతిబాబుల పాత్రలు ప్రేక్షకుల్ని ఆద్యంతం ఆకట్టుకొంటాయి. త్వరలో ఫస్ట్ లుక్, ట్రైలర్ విడుదల చేసి వేసవి కానుకగా చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నాం" అన్నారు.

    Nara Rohith starts dubbing for Aatagallu

    ఈ చిత్రానికి మాటలు: గోపి, కెమెరా: విజయ్.సి.కుమార్, మ్యూజిక్: సాయికార్తీక్, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, ఆర్ట్: ఆర్.కె.రెడ్డి, పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం.సీతారామరాజు, నిర్మాతలు: వాసిరెడ్డి రవీంద్ర-వాసిరెడ్డి శివాజీ-మక్కెన రాము-వడ్లపూడి జితేంద్ర, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: పరుచూరి మురళి.

    English summary
    Sensible hero Nara Rohith and Stylish actor Jagapathi Babu starrer intelligent thriller 'Aatagallu' is gearing up for release. Shooting has been wrapped up and post-production works are on full swing. Darshana Banik is pairing Rohith in this film directed by Paruchuri Murali and produced by Ravindra, Vaasireddy Sivaji, Makkina Ramu and Vaddapudi Jitendra under the banner, Friends Movie Creations. Nara Rohith has started dubbing for the film from today.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X