»   » నరకాసురుడి నుంచి నాగచైతన్య ఔట్.. బూరెల బుట్టలో మరో హీరో..

నరకాసురుడి నుంచి నాగచైతన్య ఔట్.. బూరెల బుట్టలో మరో హీరో..

Posted By:
Subscribe to Filmibeat Telugu

రారండోయ్ వేడుక చూద్దాం చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న నేపథ్యంలో ఓ తమిళ చిత్రం నుంచి అక్కినేని నాగచైతన్య తప్పుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. డేట్స్ సమస్య వల్లే నరకాసురుడు చిత్రం నుంచి నాగచైతన్య తప్పుకొన్నట్టు చిత్ర వర్గాలు వెల్లడిస్తున్నాయి. నాగచైతన్య స్థానంలో సందీప్ కిషన్‌ను తీసుకొన్నట్టు వారు పేర్కొన్నారు. సందీప్ కిషన్ నటించిన మహానగరం చిత్రం మంచి కలెక్షన్లతోపాటు విమర్శకుల ప్రశంసలు అందుకొన్న సంగతి తెలిసిందే.

సందీప్ కిషన్ ఎక్సైట్..

సందీప్ కిషన్ ఎక్సైట్..

బుధవారం (మే 31)న సందీప్ కిషన్‌ను గోవాలో కలుసుకొన్నాం. ఆయనకు కథ వినిపించగానే చాలా ఎక్సైట్ అయ్యాడు. వెంటనే మా సినిమాను చేయడానికి సందీప్ కిషన్ ఒప్పుకొన్నాడు. ఆగస్టు చివర్లోగానీ, సెప్టెంబర్ తొలివారంలో గానీ ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభిస్తాం. వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం అని దర్శకుడు కార్తీక్ నరేన్ వెల్లడించారు. గతంలో కార్తీక్ 16 ఎవ్రీ డీటెయిల్ కౌంట్స్ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. తక్కువ బడ్జెట్‌తో రూపొందింన 16 చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకొన్న సంగతి తెలిసిందే.

చైతూతో డేట్స్ సమస్య

చైతూతో డేట్స్ సమస్య

నాగచైతన్యతో సినిమా చేయాలని మొదట అనుకొన్నాం. డేట్స్ సమస్య వచ్చింది. దాంతో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకొన్నాడు. చైతూతో ఎలాంటి విభేదాలు లేవు. ఈ పరిణామం తర్వాత కూడా మంచి సంబంధాలు ఉన్నాయి అని కార్తీక్ వివరించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ నిర్మిస్తున్నారు.

భవిష్యత్‌లో కలిసి చేస్తాం..

భవిష్యత్‌లో కలిసి చేస్తాం..

ఇతర కమిట్స్‌మెంట్స్ నాగచైతన్య బిజీగా ఉన్నారు. దాంతో డేట్స్ సమస్య ఏర్పడింది. అంతేకాని వేరే ఇబ్బందులు లేవు. మంచి కథ దొరికితే భవిష్యత్‌లో కలిసి పనిచేస్తాం అని కార్తీక్ చెప్పారు. ఈ చిత్రంలో అరవింద్ స్వామి, శ్రీయసరన్, ఇంద్రజిత్ సుకుమారన్ నటిస్తున్నారని, ఇంకా ఇతర పాత్రలధారులను ఫైనలైజ్ చేయలేదు అని ఆయన తెలిపారు.

హీరోయిన్ ఎంపిక పూర్తి కాలేదు.

హీరోయిన్ ఎంపిక పూర్తి కాలేదు.

సందీప్ కిషన్ సరసన నటించే హీరోయిన్ ఎంపిక ఇంకా చేయలేదు. త్వరలోనే ఆ ప్రక్రియను పూర్తి చేస్తాం. ఈ నెలలోనే నరకాసురుడు టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తాం అని కార్తీక్ నరేన్ చెప్పారు. థ్రిల్లర్ చిత్రంగా రూపుదిద్దుకొనున్న ఈ చిత్రంలో నాగచైతన్, అరవింద్ స్వామి నటిస్తున్నారనగానే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా తప్పుకోవడంతో ఎలాంటి అంచనాలు నెలకొంటాయో వేచి చూడాల్సిందే.

English summary
Actor Sundeep Kishan, basking in the success of Maanagaram, has replaced actor Naga Chaitanya, who chose to opt out of the upcoming Tamil thriller Naragasooran citing date issues. Director Karthick Naren confirm that Naga Chaitanya, with whom he still shares a good relationship, exited the project due to “date issues”.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu