»   » వైరల్ ఫోటో: వదినమ్మ సురేఖతో పవన్ కళ్యాణ్

వైరల్ ఫోటో: వదినమ్మ సురేఖతో పవన్ కళ్యాణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కొణిదెల సురేఖ కలిసి ఇటీవల ఓ వేడుకలో సందడి చేశారు. ఈ ఇద్దరూ కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వదినమ్మతో పవన్ కళ్యాణ్ బంధం అనే కాప్షన్‌తో ఉన్న ఈ ఫోటోను మెగా అభిమానులు లైకులు, షేర్లతో ముంచెత్తుతున్నారు.

ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి కుమార్తె ఎంగేజ్మెంట్ వేడుకకు పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ కలిసి హాజరయ్యారు. అక్కడికి సురేఖ కూడా రావడంతో వెంటనే ఆమె వద్దకు వెళ్లి పలకరించారు.

ఫోటో వైరల్

ఫోటో వైరల్

పవన్ కళ్యాణ్, సురేఖ ఆత్మీయపలకరింపుకు సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియలో వైరల్ అయింది. ఇలాంటి వేడుకల్లో పవన్ కళ్యాణ్, సురేఖ కలిసి కనిపించడం చాలా అరుదు.

Pawan Kalyan and Trivikram Film Satellite Rights Got Record Price
తల్లి తర్వాత తల్లి

తల్లి తర్వాత తల్లి

వదినమ్మను తల్లి తర్వాత తల్లి అని అంటుంటారు. తన కళ్ల ముందు పెరిగిన పవన్ కళ్యాణ్ గురించి సురేఖ కూడా తల్లిలాంటి బాధ్యత నిర్వర్తించారు సురేఖ. పవన్ కళ్యాణ్ సినిమాల వైపు రావడానికి ఆమె ప్రోత్సాహం కూడా ఉంది.

వదినమ్మకు సహాయంగా

వదినమ్మకు సహాయంగా

పవన్ కళ్యాణ్ తన ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత ఇంట్లోనే ఉండేవాడు. అతనికి అప్పట్లో ఎక్కువగా బయట తిరిగే అలవాటు ఉండేది కాదట. వదినమ్మకు చేదోడు వాదోడుగా అప్పట్లో పవన్ మెలిగేవాడు.

ఫన్నీ సంఘటన

ఫన్నీ సంఘటన

ఓసారి పవన్ కళ్యాణ్ చిరు ఫ్యామిలీతో కలిసి సింగపూర్ వెళ్లారు. పవన్, పిల్లలను హెటల్ రూమ్ లోనే ఉంచి చిరు-సురేఖ బయటకు వెళ్లారట. అప్పుడు చాలా చిన్న పిల్లాడుగా ఉన్న రామ్ చరణ్ కోపంతో హోటల్ గదిలో ఉన్న వస్తువులన్నీ చిందరవందరగా పడేసాడట. చెర్రీ చేసిన ఆకతాయి పనికి భయ పడిపోయిన పవన్ కళ్యాణ్.... హెటల్ సిబ్బంది చూస్తే ఏదైనా గొడవ అవుతుందని తానే రూమ్ మొత్తం క్లీన్ చేసాడట. ఈ ఫన్నీ సంఘటనను పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటారు.

English summary
Pawan Kalyan arrived for the engagement ceremony of NTV Chairman Narendra Chowdary's Daughter. He was accompanied by dear friend Trivikram Srinivas. One big moment that caught the attention of everyone at the engagement ceremony was the bonding of Pawan Kalyan & Chiru's Wife Surekha.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu