Don't Miss!
- Sports
అందుకే నా వికెట్ త్యాగం చేశా: వాషింగ్టన్ సుందర్
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- News
అటెన్షన్ అమరావతి: అందరి చూపూ అటు వైపే..!!
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
బాబా కుక్కగా పుడతానంది, విజయ నిర్మలకు మరణం ముందే తెలుసా? నరేష్ ఏం చెప్పారంటే..
ప్రముఖ నటి, దర్శకురాలు, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మల జూన్ 27న పరమపదించిన సంగతి తెలిసిందే. విజయ నిర్మల మరణం సూపర్ స్టార్ కృష్ణతో పాటు తెలుగు సినీ పరిశ్రమను విషాదంలోకి నెట్టి వేసింది. తనతో పాటు 50 ఏళ్ల పాటు కలిసి జీవితాన్ని పంచుకున్న అర్దాంగి మరణాన్ని తట్టుకోలేక కృష్ణ కంటతడి పెట్టడం అందరినీ కలిచివేసింది.
తాజాగా అలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న విజయ నిర్మల తనయుడు నరేష్ నుంచి మరిన్ని విషయాలు రాబట్టే ప్రయత్నం చేశారు అలీ. ఈ సందర్భంగా తన తల్లి మరణించడానికి ముందు జరిగిన విషయాలను నరేష్ బయట పెట్టారు.

ఆ రోజు అమ్మ చాలా ఏడ్చారు
చనిపోవడానికి కొద్దిరోజుల ముందు అమ్మ నడవటానికి కూడా చాలా కష్టపడ్డారని నరేష్ గుర్తు చేసుకున్నారు. ఆమెకు జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోవడం మరింత ఇబ్బందిగా మారిందన్నాు. ‘‘ తన అనారోగ్యం కంటే కృష్ణగారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన తనకు ఈ పరిస్థితి రావడం, తన వల్ల ఆయన ఇబ్బంది పడుతున్నారనే విషయమే ఆమెను చాలా బాధించింది. ఓ రోజు ఈవిషయం చెబుతూ ఏడ్చేశారు. ఆ రోజు అమ్మ ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపొచ్చింది.'' అని నరేష్ తెలిపారు.

పైకి బాధ కనిపించకుండా నవ్వుతూ ఉండేవారు
అమ్మ తన మనసులో ఎంత బాధ ఉన్నా... బయటికి కనిపించకుండా నవ్వుతూ ఉండేవారు. అడిగిన వాళ్లకు, అడగని వాళ్లకూ ఎంతో ఇచ్చారు, సహాయం చేశారు. తన వద్ద పని చేసిన వారికి ఇల్లు కట్టించారు. ఆమె సేవా భావం చాలా గొప్పది అని నరేష్ తెలిపారు.

బాబా దగ్గర కుక్కగా, గురువారమే చనిపోతా... ఆమెకు మరణం ముందే తెలుసా?
ఒక రోజు అమ్మ పిలవడంతో వెళ్లాను. అపుడు ఆమె ఓ విషయం చెప్పారు. ‘నేను ఇబ్బంది పడకుండా భగవంతుడు తీసుకెళ్లిపోయినా.. షిర్డీలో బాబాగారి దగ్గర కుక్కగా పుడతా. గురువారం నాడే చనిపోతా' అన్నారు. ఆమె కోరుకున్న విధంగా గురువారం చనిపోయారు.... అని నరేష్ గుర్తు చేసుకున్నారు.

అమ్మ పాద ముద్రలకు బంగారు కవచం చేయించా
అమ్మ భౌతిక కాయం ఖననం చేయకముందే పాదముద్రలు తీయించి బంగారు కవచం చేయించాం. ప్రతి రోజు బయటకు వెళ్లే ముందు, పడుకునే ముందు ఆ పాదముద్రలకు క్రమం తప్పకుండా నమస్కారం చేస్తాను అని నరేష్ వెల్లడించారు.

విజయ నిర్మల
విజయ నిర్మల నటిగా రాణించడంతో పాటు లేడీ డైరెక్టర్లలో లెజెండ్‌గా పేరు తెచ్చుకున్నారు. దీంతో పాటు అత్యధికంగా 44 చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నారు. ఇప్పటికీ ఆమె రికార్డును ఎవరూ అందుకోలేకపోయారు.