»   » బూతు మాటలు: హీరో సమక్షంలో వివరణ ఇచ్చిన హీరోయిన్!

బూతు మాటలు: హీరో సమక్షంలో వివరణ ఇచ్చిన హీరోయిన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇమ్రాన్ హష్మి హీరోగా ప్రముఖ క్రికెటర్ అజారుద్దీన్ జీవితం ఆధారంగా బాలీవుడ్లో 'అజర్' అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మి సరసన ప్రాచీ దేశాయ్, నర్గీస్ ఫక్రి నటిస్తున్నారు.

అజార్ కు అత్యంత ఆప్తుడిగా పేరున్న ప్రముఖ దర్శకుడు ఆంటోనీ డిసౌజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ బయోపిక్ ను కేవలం డ్రామాగా తీర్చిదిద్దకుండా ఒక సినిమాకు కావాల్సిన అన్ని కమర్షియల్ హంగులూ ఇందులో జొప్పించారు. మే 13న సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

సినిమా విడుదల దగ్గర పడటంతో చిత్ర నటీనటులు అంతా 'అజర్' ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో కొన్ని పుకార్లు కూడా షికార్లు చేస్తున్నాయి. ఈ చిత్రంలో 'ఇమ్రాన్ హష్మీ ఓ ఆర్టిఫిషియల్ మీసంతో కనిపిస్తాడని. ఆ మీసంతో ఉన్న ఇమ్రాన్‌తో ముద్దు సీన్లు చేయాలంటే నాకు అసహ్యంగా అనిపించేది...ఆ మీసం మానవుడి రహస్య అంగాల వద్ద ఉండే హెయిర్ తో చేసారని నా అనుమానం అంటూ నర్గీస్ ఫక్రి అన్నట్లు గాసిప్స్ ప్రచారంలోకి వచ్చాయి.

తాజాగా ఇమ్రాన్ హష్మి, ప్రాచీ దేశాయ్, నర్గీస్ ఫక్రి కలిసి.... ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నర్గీస్ ఫక్కి అన్నట్లుగా ప్రచారం జరుగుతున్న బూతు మాటల గురించి ప్రస్తావన వచ్చింది. ఈ వార్తలు విని నేను షాకయ్యాను.... నిజంగా నా మీసం ఆ హెయిర్ తో తయారైందని నువ్వు అన్నావా? అంటూ ఇమ్రాన్ ప్రశ్నించారు. దీనికి నర్గీస్ ఫక్రి సమాధానం ఇస్తూ.... నేను అసలు అలాంటి బూతు మాటలు మాట్లాడ లేదు. ఎవరు ఇలాంటి వార్తలు ప్రచారంలోకి తెచ్చారో నాకు అర్తం కావడం లేదు అని నర్గీస్ పక్రి వివరణ ఇచ్చారు.

తమపై ఇలాంటి వార్తలు రావడంపై ముగ్గురు నవ్వుకున్నారు. ఒక రకంగా ఇవి కూడా సినిమా పబ్లిసిటీకి ఉపయోగ పడతాయని అభిప్రాయ పడ్డారు.

అజర్

అజర్


ఇమ్రాన్ హస్మి అజారుద్దీన్ పాత్రలో కనిపించబోతున్నాడు. క్రికెట్ ప్రధానంగా సాగే ఈ సినిమాలో.... ఇమ్రాన్ అజారుద్దీన్ స్టైయిల్‌లో బ్యాటింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం స్వయంగా అజారుద్దీనే వచ్చి ఇమ్రాన్‌కు ట్రైనింగ్ ఇచ్చారు.

అవన్నీ

అవన్నీ


'అజర్' చిత్రంలో....అజారుద్దీన్ క్రికెట్లో అంచలంచెలుగా ఎదిగిన ఘట్టాలు....మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతం తర్వాత అతను ఎదుర్కొన్న పరిస్థితులును ప్రధానంగా ఫోకస్ చేయబోతున్నారు. ఇందులో అజారుద్దీన్ ప్రేమ వ్యవహారం, పెళ్లి అంశాలను కూడా ఇంట్రెస్టింగ్ గా చూపించబోతున్నపారు.

ఆ మధ్య విడుదలైన టీజర్లో....

ఆ మధ్య విడుదలైన టీజర్లో....


నేను మూడు కారణాలు వలన బాగా ఫేమసయ్యాను. దేముడ్ని నమ్మడం, పెళ్లి, మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ అజర్ డైలాగు చెప్పారు. అవే ఇప్పుడు క్రికెట్ వీరాభిమానులను, సినీ అబిమానులను తన వైపు తిప్పుకుని, ఆలోచనలో పడేలా చేసాయి.

మే 13న రిలీజ్

మే 13న రిలీజ్


అజర్ చిత్రాన్ని మే 13న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

English summary
Recently, Nargis had mentioned that she didn't like kissing Emraan coz of his moustache. She also felt that it was made pubic hair and after hearing about this Emraan was grossed out. "No, I wouldn’t ever say that. Why would I say that? That’s just weird, who would say that?" Nargis said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X