»   » లోకల్ హీరోను వదిలేసి వివాదాస్పద పాక్ నటుడితో డేటింగ్.. కొత్త జోష్‌లో బాలీవుడ్ హీరోయిన్

లోకల్ హీరోను వదిలేసి వివాదాస్పద పాక్ నటుడితో డేటింగ్.. కొత్త జోష్‌లో బాలీవుడ్ హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్‌లో అందాలు ఆరబోసినా గానీ సక్సెస్ లభించిన హీరోయిన్లలో ఒకరు నర్గీస్ ఫక్రీ. ఇటీవల కాలంలో నర్గీస్ నటించిన సినిమాల గురించి కాకుండా ఆమె కొనసాగించే డేటింగ్‌పైనే ఎక్కువ వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పాకిస్థాన్ నటుడు ఇమ్రాన్ అబ్బాస్‌తో అఫైర్ నడుపుతున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. వీరిద్దరు కలిసి ఉన్న ఫొటోలు ఇంటర్నెట్‌లో జోరుగా షికారు చేస్తున్నాయి. ఈ వ్యవహారంపై మీడియా వివరణ కోరగా ఇమ్రాన్ అంటే ఎవరో నాకు తెలియదు. గతంలో ఓ ఫొటోషూట్ కోసం దిగింది అని అని రొటీన్ సమాధానం చెప్పడం గమనార్హం.

అప్పట్లో జోరుగా అఫైర్..

అప్పట్లో జోరుగా అఫైర్..

బాలీవుడ్‌లో ప్రవేశించిన కొత్తలో హీరో ఉదయ్ చోప్రా, నర్గీస్ ఫక్రీల మధ్య ప్రేమాయణం జోరుగా సాగింది. అప్పట్లో ఓ పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో నా జీవితంలో ఉదయ్ చోప్రా తప్ప నాకు మరొకరు లేరు. ఉండరు అని చెప్పింది. ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే ఉదయ్ లాంటి వ్యక్తి మంచి మనిషి వెతికినా దొరుకడు. అతని లాంటి వ్యక్తి నాకు దొరకడం నా అదృష్టం అని చెప్పింది.

అభిప్రాయ బేధాలతో బ్రేకప్

అభిప్రాయ బేధాలతో బ్రేకప్

అజర్ సినిమా ప్రమోషన్ సందర్భంగా ఉదయ్, నర్గీస్ మధ్య అభిప్రాయబేధాలు చోటుచేసుకొన్నట్టు వార్తలు వచ్చాయి. కానీ వారిద్దరూ తమ అఫైర్ బ్రేకప్‌పై పెదవి విప్పకుండా జాగ్రత్త పడ్డారు. అప్పటి నుంచే వారి రిలేషన్ అంటిముట్టనట్టు ఉన్నట్టు కనిపించింది.

గొడవలు.. అమెరికాకు పయనం..

గొడవలు.. అమెరికాకు పయనం..

ప్రముఖ క్రికెటర్ అజరుద్దీన్ బయోపిక్ అజర్‌, హౌస్‌ఫుల్3 చిత్రాల్లో నటించే సమయంలో హీరో ఉదయ్ చోప్రాతో నర్గీస్ ఫక్రీ అఫైర్ బెడిసి కొట్టింది. ఓ దశలో ఓ రాత్రంతా తీవ్ర స్థాయిలో గొడవ జరుగడంతో నర్గీస్ సృహ కోల్పోయిందనే వార్తలు మీడియాలో ప్రచారమయ్యాయి. ఉదయ్ చోప్రాతో బ్రేకప్‌ను తట్టుకోలేక అప్పట్లో చెప్పపెట్టకుండా ముంబైను వదిలి అమెరికాకు వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది.

ప్రస్తుతం పాక్ నటుడితో డేటింగ్

ప్రస్తుతం పాక్ నటుడితో డేటింగ్

ఉదయ్‌తో అఫైర్ పూర్తిగా బ్రేక్ అయిన తర్వాత ప్రస్తుతం పాకిస్థాన్ నటుడు ఇమ్రాన్‌తో జోరుగా ప్రేమాయణం సాగిస్తున్నట్టు రూమర్లు తెగ ప్రచారమవుతున్నాయి. ఇమ్రాన్‌కు పాకిస్థాన్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. కరణ్ జోహర్ రూపొందించిన యే దిల్ హై ముష్కిల్ చిత్రం ద్వారా ఇమ్రాన్ బాలీవుడ్‌కు పరిచయమయ్యాడు.

పాక్ నటుడిపై నిరసనలు

పాక్ నటుడిపై నిరసనలు

భారత, పాక్ సరిహద్దుల్లో దాడుల నేపథ్యంలో పాక్ నటులను బహిష్కరించాలనే వాదన బలంగా వినిపించింది. ఆ సమయంలో ఇమ్రాన్ నటించిన యే దిల్ హై ముష్కిల్ చిత్రం రిలీజ్ ఇబ్బందుల్లో పడిన సంగతి తెలిసిందే. శివసేన, దేశంలోని ఇతర సంస్థలతో జరిగిన చర్చల ఫలితంగా ఆ చిత్రం విడుదలైంది.

English summary
Nargis Fakhri is back in news, but for personal reasons. It was recently that a picture of Nargis with Pakistani actor Imran Abbas went viral on social media. Earlier Nargis has affair with Uday Chopra. Nargis Fakhri has flown to the US to nurse her broken heart after her break-up with rumoured boyfriend Uday Chopra.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu