Don't Miss!
- Sports
Australia Open 2023 క్వీన్ అరినా సబలెంక..!
- Lifestyle
Astrology Tips: స్త్రీలు చేయకూడని పనులు.. వాటిని చేయడం వల్ల ఇంట్లో దరిద్రమే
- News
YCPకి నియోజకవర్గాన్ని రాసిస్తున్న TDP సీనియర్ నేత!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Finance
Multibagger Stock: ఒక సంవత్సరంలో 1000 శాతం రాబడి అందించిన మల్టీబ్యాగర్ స్టాక్ ఇదే..!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
సచిన్, కోహ్లీ చాలా క్లోజ్.. నర్సింగ్ యాదవ్ మరణానికి కారణమిదే.. ఐదేళ్ల క్రితమే తెలిసింది: క్లారిటీ ఇచ్చిన భార్య
సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నర్సింగ్ యాదవ్ ఇటీవల ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. 2020లో ఎంతో మంది సినీ తారలు ప్రాణాలు వదిలారు. ఇక నర్సింగ్ యాదవ్ కూడా ఆ ఏడాది చివరలో కన్ను మూయడం అందరిని షాక్ కు గురి చేసింది. ఇక ఆయన ఎలా మరణించారు అనేది చాలా మందికి కొంత కన్ఫ్యూజన్ ను క్రియేట్ చేసింది. ఆ విషయంపై నర్సింగ్ యాదవ్ భార్య చిత్ర వివరణ ఇచ్చారు. అలాగే క్రికెటర్లతో ఉన్న అనుబంధం గురించి కూడా తెలియజేశారు.

అలాంటి పాత్రలతో..
టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు మూడు వందల సినిమాలు చేసిన ఆర్టిస్ట్ గా నర్సింగ్ యాదవ్ ఎంతగానో గుర్తింపు అందుకున్నాడు. తెలంగాణ భాషలో ఒక రియాలిటీ రౌడిగా ఆయన చేసిన పాత్రలు చాలా వరకు క్లిక్కయ్యాయి. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో నర్సింగ్ యాదవ్ చేసిన పాత్రలు అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేశాయి.

రూమర్స్ వైరల్..
2020 డిసెంబర్ 31న కన్నుమూసిన నర్సింగ్ యాదవ్ ప్రాణాలు కోల్పోవడానికి గల కారణాలు సోషల్ మీడియాలో చాలానే వైరల్ అవుతున్నాయి. అయితే ఆ రూమర్స్ అబద్ధమని ఆయన సతీమణి చిత్ర యాదవ్ ద్వారా అర్ధమయ్యింది. భర్త మరణం ఒక్కసారిగా షాక్ కు గురి చేసినట్లు చిత్ర భావోద్వేగానికి గురయ్యారు.

నటుడిగా నర్సింగ్ యాదవ్ కుమారుడు
నర్సింగ్ యాదవ్ కు రుత్విక్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. రుత్విక్ 100% లవ్ సినిమాలో కూడా ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. తండ్రి మరణంపై రుత్విక్ కూడా ఎంతో భావోద్వేగానికి గురయ్యాడు. నాన్న నాతో ఎప్పుడు ఒక స్నేహితుడిలా ఉండేవారు అంటూ.. చూడటానికి గంబీరంగా ఉన్నప్పటికీ ఆయనది చిన్నపిల్లల మనస్తత్వమని అన్నారు.

సమయానికి ఆయన భోజనం చేయరు
ఇక నర్సింగ్ యాదవ్ మరణానికి గల కారణలపై మాట్లాడుతూ.. చిత్ర ఎమోషనల్ అయ్యారు. సినిమా ఇండస్ట్రీలో లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. రోజుకు రెండు మూడు షూటింగ్స్ లతో బిజీగా ఉండేవారు. సమయానికి ఆయన భోజనం చేయరు. నిద్ర కూడా కరెక్ట్ గా ఉండేది కాదు. కొన్నిసార్లు ఒత్తిడి కూడా గురవుతుంటారు.. అని అన్నారు.

5 ఏళ్ళ క్రితమే అర్ధమయ్యింది
5 ఏళ్ళ క్రితమే ఆయన ఆరోగ్యంపై అనుమానాలు వచ్చాయి. కానీ మ్యానేజ్ చేయవచ్చని అనుకున్నాము. రెండేళ్ల వరకు కూడా సినిమాలతో బిజిగానే ఉన్నారు. కానీ ఇంత సడన్ గా జరుగుతుందని అనుకోలేదు. ఆయాన లైఫ్ స్టైల్ మార్చుకునే లోపే అప్పటికే ఆలస్యం అయినట్లు తెలిసింది. మార్చ్ నుంచి కొంచెం సీరియస్ అవుతూ వచ్చింది. డయలిసిస్ నార్మల్ అనుకున్నాము. కానీ చివరిరోజు రెండు సార్లు వెంటనే హార్ట్ ఎటాక్ రావడంతో ప్రాణాలు వదిలారని చిత్ర తెలిపారు.

క్రికెటర్స్ తో కూడా సన్నిహితంగా
విరాట్ కోహ్లీ, సచిన్ నర్సింగ్ యాదవ్ గారికి చాలా క్లోజ్ అని చెప్పిన చిత్ర ఒకసారి ఇండియన్ టీమ్ క్రికెట్ అంతా కూడా సుల్తాన్ బజార్ లాంటి ఏరియాలో యాడ్ షూటింగ్ కు వస్తే ఆయనే దగ్గరుండి అక్కడ పబ్లిక్ ను మ్యానేజ్ చేశారని అన్నారు. సచిన్ కూడా ఇంటికొచ్చారు అంటూ క్రికెటర్స్ కొందరు ఆయనతో సన్నిహితంగా ఉంటారని ఆమె వివరణ ఇచ్చారు.