Don't Miss!
- News
union budget: మరికొద్ది గంటల్లో పార్లమెంటులో కేంద్ర బడ్జెట్, ఆశలు, అంచనాలు
- Finance
gst: రికార్డు స్థాయిలో GST వసూళ్లు.. ఇప్పటివరకు ఇదే రెండవ అత్యధికం
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్‌ప్రీత్ కౌర్
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
National Film Awards 2022: జాతీయ స్థాయిలో సత్తా చాటిన చిన్న సినిమాలు
శుక్రవారం సాయంత్రం కేంద్ర ప్రసార మాధ్యమాల శాఖ ప్రకటించిన 68వ జాతీయ సినిమా అవార్డులలో తెలుగు సినిమాల సత్తా చాటడం ఆసక్తికరంగా మారింది. తెలుగులో భారీ బడ్జెట్ చిత్రాలతో పోటీ పడుతూ చిన్న సినిమాలు పలు అవార్డులు దక్కించుకోవడం ఆసక్తి రేకెత్తించింది. తెలుగులో బెస్ట్ ఫిలింగా నిలిచిన కలర్ ఫోటో సినిమాని తక్కువ బడ్జెట్ తో కరోనా కాలంలో తెరకెక్కించారు. సుహాస్ హీరోగా చాందిని చౌదరి హీరోయిన్లుగా సునీల్ నెగిటివ్ షేడ్స్ లో నటించిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా జాతీయ అవార్డుల నామినేషన్ కి వెళ్లిన సంగతి కూడా బయటకు రాలేదు. కానీ ఒక్కసారిగా అక్కడకి వెళ్ళడమే కాక అవార్డు కూడా సంపాదించి అందరినీ షాక్ కి గురి చేసింది.
ఇక అదే విధంగా చిన్న సినిమాగా రూపొందిన నాట్యం కూడా మూడు కేటగిరీలలో అవార్డులు దక్కించుకుంది. సత్యం రామలింగరాజు కోడలైన సంధ్యా రాజు హీరోయిన్ గా నటిస్తూ కొరియోగ్రఫీ చేస్తూ స్వయంగా నిర్మించిన నాట్యం సినిమాకు రేవంత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు గాను మూడు అవార్డులు దక్కాయి బెస్ట్ కొరియోగ్రఫీ, బెస్ట్ డాన్సర్, అలాగే బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ క్యాటగిరీలకు గాను అవార్డులు దక్కాయి.

ఇక చిన్న సినిమాల సంగతి పక్కన పెడితే తమన్ సంగీతం అందించిన అల వైకుంఠపురంలో సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఆ సినిమా పాటలు అప్పట్లోనే బ్లాక్ బాస్టర్లుగా నిలిచి చాట్ బస్టర్లుగా కూడా అనేక రికార్డులు బద్దలుగొట్టాయి.

ఇక ఈ సినిమాను బెస్ట్ మ్యూజికల్ డైరెక్షన్ క్యాటగిరీలో అవార్డు వరించింది. ఇక ఈ అవార్డు గురించి తమన్ ఆసక్తికరంగా స్పందించాడు. ఈ అవార్డు తనది కాదని ఈ అవార్డు త్రివిక్రమ్ దేనని, ఆయన చెప్పింది తాను చేశాను తప్ప తాను ఏమీ ప్రత్యేకంగా చేయలేదని చెప్పుకొచ్చారు. ఇక ఈ అవార్డు ఢిల్లీలో తీసుకుని వెళ్లి హైదరాబాదులో త్రివిక్రమ్ ఇంట్లో పెట్టేసి తాను చెన్నై వెళ్ళిపోతానంటూ ఆయన కామెంట్ చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొత్తం మీద చిన్న సినిమాలు సత్తా చాటుతున్న వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇక అవార్డులు దక్కించుకున్న సినిమాలకు సంబంధించిన యూనిట్ సభ్యులను, అవార్డు దక్కించుకున్న వారిని సోషల్ మీడియాలో అభినందిస్తున్నారు.