twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వివాదంలో నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్: 60 మంది డుమ్మా...డమ్మీలతో సీట్లు నింపిన వైనం!

    By Bojja Kumar
    |

    కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 65వ జాతీయ అవార్డుల ప్రదానోత్సవం గురువారం మధ్యాహ్నం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగింది. అయితే ఈ అవార్డుల ప్రదానోత్సవం విషయంలో వివాదం నెలకొనడంతో దాదాపు 60 మంది అవార్డు గ్రహీతలు ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కేవలం 11 అవార్డులు మాత్రమే ప్రదానం చేస్తారని, మిగతా అవార్డులు కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, రాజ్యవర్దన్ సింగ్ రాథోడ్ అందజేస్తారనే విషయంలో అసంతృప్తిగా ఉన్న పలువురు అవార్డు గ్రహీతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

    ఆనవాయితీ బ్రేక్ చేసిన వైనం

    ఆనవాయితీ బ్రేక్ చేసిన వైనం

    జాతీయ అవార్డులు రాష్ట్రపతి చేతుల మీదుగా అందజేయడం ఆనవాయితీ. అయితే ఈ ఆనవాయితీని బ్రేక్ చేస్తూ కేవం 11 అవార్డులు మాత్రమే ఆయన చేతుల మీదుగా ఇవ్వడం ఏమిటీ అంటూ పలువురు అవార్డీలు అసంతృప్తి వ్యక్తం చేశారు.

    60 మంది డుమ్మా, ఓపెన్ లెటర్

    60 మంది డుమ్మా, ఓపెన్ లెటర్

    దాదాపు 60 మంది అవార్డు గ్రహీతలు దీన్ని నిరసిస్తూ తాము ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదని ఓపెన్ లెటర్ రాశారు. ఈ లెటర్లో సంతకం చేసిన వారిలో ప్రముఖ సింగర్ కెఏ ఏసుదాసు, ఫిల్మ్ మేకర్ నాగరాజ్ మంజులే, ఫిల్మ్ మేకర్ ప్రసాద్ ఓక్ ఉన్నారు. తాను ఈ అవార్డులను బాయ్‌కాట్ చేయడం లేదని, తమ నిరసన వ్యక్తం చేసతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

     రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం గొప్ప గౌరవం

    రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం గొప్ప గౌరవం

    రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం అనేది ప్రతి ఒక్కరూ గౌరవంగా భావిస్తారు. ఆయనతో కలిసి దిగిన ఫోటోను తమ జీవితంలో ఒక గొప్ప జ్ఞాపకంగా పదిలపరుచుకుంటారు. అందుకే రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు ఇవ్వకపోతే తాము గైర్హాజరు అవుతామని ప్రభుత్వ ప్రతినిధులకు లేఖ రాసినట్లు డైరెక్టర్ ఇంద్రానీ చక్రవర్తి తెలిపారు.

    డమ్మీలతో సీట్లను నింపిన వైనం

    డమ్మీలతో సీట్లను నింపిన వైనం

    నిరసన వ్యక్తం చేస్తూ పలువురు అవార్డు గ్రహీతలు డుమ్మా కొట్టడంతో రెండు వరుసల్లో చైర్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. దీంతో ఆ స్థానాలను డమ్మీ వ్యక్తులతో నింపారు. ఆయా టేబుల్స్ మీద ఉన్న నేమ్ పేట్లను తొలగించారు.

    రాష్ట్రపతి కార్యదర్శి వివరణ

    రాష్ట్రపతి కార్యదర్శి వివరణ

    రాష్ట్రపతి కార్యదర్శి దీనిపై ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ అవార్డు కార్యక్రమానికి కేవలం గంట సమయం మాత్రమే రాష్ట్రపతి కేటాయించారని, అందుకే అందరికీ అవార్డులు ఆయన చేతుల మీదుగా అందుకునే అవకాశం దక్కలేదని అన్నారు.

    బోనీ కపూర్ ఏమన్నారంటే...

    బోనీ కపూర్ ఏమన్నారంటే...

    ఈ అవార్డు వివాదంపై నిర్మాత బోనీ కపూర్ స్పందించారు. తన భార్య శ్రీదేవి తరుపున అవార్డు అందుకున్న ఆయన.... వారు ఎందుకు అలా చేశారో తనకు తెలియదని, స్మృతి ఇరానీ చేతుల మీదుగా అవార్డు ఇచ్చినా తాము సంతోషంగా స్వీకరించే వారమని తెలిపారు.

    English summary
    The 65th National Film Awards, which was held Thursday afternoon, was mired in controversy after more than 60 awardees skipped the event. The awardees were furious after it was revealed that President Ram Nath Kovind will hand over just 11 awards.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X