»   » నాని ఖాతాలో ఇంకో హిట్టు పడ్డట్టే.... నేను లోకల్ పబ్లిక్ టాక్

నాని ఖాతాలో ఇంకో హిట్టు పడ్డట్టే.... నేను లోకల్ పబ్లిక్ టాక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్‌లో వ‌రుస హిట్ల‌తో జోరు చూపిస్తున్నాడు నేచుర‌ల్ స్టార్ నాని. భ‌లే భ‌లే మ‌గాడివోయ్ సినిమా త‌ర్వాత నాని సినిమాల‌కు అదిరిపోయే రేంజ్లో ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రుగుతోంది. ఇప్ప‌టికే ఐదు వ‌రుస హిట్ల‌తో ఉన్న నాని త‌న తాజా చిత్రం నేను లోక‌ల్ సినిమాతో మ‌రో హిట్ కొట్టి డ‌బుల్ హ్యాట్రిక్ హిట్ల‌ను త‌న ఖాతాలో వేసుకుంటాడ‌న్న అంచ‌నాలు ఉన్నాయి..

Natural star Nani "Nenu Local" movie Public Talk

నాని హీరోగా నటించిన "నేను లోకల్" మూవీ నేడు థియేటర్స్ ని హిట్ చేసింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా నేను లోక‌ల్ రూ 19.70 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా ఓవ‌ర్సీస్ థియేట్రిక‌ల్ రైట్స్ రూ.3 కోట్ల‌కు అమ్ముడ‌య్యాయి. నాని రెండు సినిమాలు ఓవ‌ర్సీస్‌లో మిలియ‌న్ మార్క్ ట‌చ్ చేయ‌డంతో ఈ సినిమాకు అక్క‌డ కూడా మంచి బిజినెస్ జ‌రిగింది.

Natural star Nani "Nenu Local" movie Public Talk

అయితే ఈ మూవి పై పబ్లిక్ టాక్ ఏలా ఉందో ఇప్పుడు చూద్దాం.ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ఆడియో సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చటంతో ఈ మూవీకి రిలీజ్ రోజున ప్రేక్షకుల వద్ద మంచి రెస్పాన్స్ కనిపించింది. రిలీజ్ కి ముందే ప్రివ్యూ షోలను నిర్మాత ప్రదర్శించటంతో ఈ మూవీపై పాజిటివ్ టాక్ బయటకు వచ్చింది.


లోకల్ కుర్రాడిగా, బీటెక్ స్టూడెంట్‌గా నాని నటన సూపర్ అని టాక్. అంతేనా, బీటెక్ లైఫ్‌లో నాని పడే కష్టాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయట. భలేభలే మగాడివోయ్ సినిమా తర్వాత 'నేను లోకల్' ఫుల్ ఎంటర్‌టైనర్ మూవీ అని ప్రేక్షకులు చెబుతున్నారు.

బాబు పాత్రలో నాని చేసిన యాక్టింగ్ అందరికి నచ్ఛింది. ఇక నేను లోకల్ ఫస్టాఫ్.. కామెడీ సన్నివేశాలతో సరదాగా సాగిపోయింది. నాని కామెడీ,పోసాని కామెడీ, నాని-కీర్తి సురేష్ కెమిస్ట్రీ ఫస్టాఫ్‌ను బాగా ఆకట్టుకునే విధంగా చేశాయి. ఇక కీర్తి సురేష్, పోసాని ల మధ్య జరిగిన కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయంటున్నారు.

ఫస్టాప్ అంతా కామెడీతో నడిపించి, సెకండాఫ్‌లో ఎమోషన్స్‌కు ప్రాధాన్యమిచ్చారని తెలిసింది. కథనంలో కొత్తదనం లేకపోయినా నాని మార్క్ కామెడీతో సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని బెన్‌ఫిట్ షో చూసిన వాళ్ల టాక్. మాస్ సెంటర్స్ లో నాని చేసే అల్లరికి బాగానే రెస్పాన్స్ వస్తుంది.

ఈ మూవీలో ఎక్కువుగా కామెడీ సన్నివేశాలే ఉండటం విశేషం. అయితే కొన్ని సన్నివేశాలు బోరింగా ఉన్నప్పటికీ...అవి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని...సినిమా సక్సెస్ లో ఇవి పెద్దగా ఎఫెక్ట్ చూపించవని అంటున్నారు. మొత్తానికి నాని మినిమమ్ గ్యారెంటీ హీరోగా మరోసారి నిరూపించున్నాడని పబ్లిక్ టాక్‌తో తేలింది.

English summary
Natural star Nani is back with yet another interesting film Nenu Local. The youthful love story which is directed by Trinadha Rao Nakkina has hit the screens today
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu