»   » హృతిక్‌ రోషన్ స్వయంగా ఫోన్ చేసి మరీ..: నవదీప్

హృతిక్‌ రోషన్ స్వయంగా ఫోన్ చేసి మరీ..: నవదీప్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: మన మద్రాస్ కోసం బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ సైతం తన వంతు సాయంగా ముందుకు వచ్చారు. వరద బాధితులకు బాసటగా నిలవదలచుకున్న హృతిక్ తమిళనాడు ప్రభుత్వానికి కాకుండా తెలుగు హీరో నవదీప్‌నే నేరుగా ఫోన్‌లో సంప్రదించారు. ఈ మేరకు తాను చేయదలచిన సాయాన్ని నవదీప్‌కు తెలిపాడు. ఇదే విషయాన్ని నవదీప్ ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా పేర్కొంటూ హృతిక్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. కాగా హృతిక్ చేయదలచిన సాయం వివరాలు తెలియాల్సి ఉంది.

హృతిక్‌ స్వయంగా తమకు ఫోన్‌ చేసి వరద బాధితుల కోసం విరాళం అందించండం ఎంతో ఆనందం కలిగిందని, హృతిక్‌ రోషన్ కి ధన్యవాదాలు చెప్పారు. దీనికి సంబందించిన ఫేస్ బుక్ పోస్ట్ ఇక్కడ చూడవచ్చు.

Thanking Hrithik roshan for his contribution for #manamadraskosam :) he called us himself n contributed :)

Posted by Navdeep on 8 December 2015

చెన్నైలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో నిరాశ్రయులైన ప్రజలను ఆదుకునేందుకు కోలివుడ్ స్టార్సే కాక టాలీవుడ్ స్టార్స్ కూడా వినూత్న కార్యక్రమాలు చేపట్టి అనాధలైన వారిని ఆదుకునేందుకు సిద్దమయ్యారు. ఈ నేపధ్యంలో రానా, మంచు లక్ష్మీ , నవదీప్ 'హైదరాబాద్ సపోర్ట్స్ చెన్నై ' పేరిట ఓ కార్యక్రమం చేపట్టారు .

భారీగా కురుస్తున్న వర్షాలకు చెన్నై నగరం మొత్తం అతలాకుతలం కాగా అక్కడి ప్రజలకు ఆహార పానీయాలు అందించేందుకు విశాల్ , ఇళయరాజా, సిద్దార్ధ్ వంటి సినీ సెలబ్రిటీలు స్వయంగా రంగంలోకి దిగి అక్కడి వారికి ఆహర పొట్లాలను పంచి పెడుతున్నారు.

Navdeep happy with Hrithik roshan donation of chennai flood.

టాలీవుడ్ నుండి కొందరు సెలబ్రిటీలు 5, 10 , 25 లక్షలు విరాళాలు ఇవ్వగా రానా,లక్ష్మీ,నవదీప్ లు చెన్నై నిరాశ్రయిలను ఆదుకునేందుకు అందరు తమ వంతు భాద్యతగా కదిలి రావాలని పిలుపు ఇచ్చి...మీకు నచ్చినంత సాయం చేసి హెల్ప్ మద్రాస్ గెట్ బ్యాక్ లో పాలు పంచుకోవాలని రానా,నవదీప్ ,మంచు లక్ష్మీ కోరి విరాళాలు సేకరించారు.

English summary
Navadeep tweeted:"Thanking Hrithik roshan for his contribution for '‎manamadraskosam'‬ ...he called us himself n contributed"
Please Wait while comments are loading...