»   » ప్రేమ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడ్డా... (నయనతార అంతరంగం)

ప్రేమ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడ్డా... (నయనతార అంతరంగం)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌత్ సినీ ఇండస్ట్రీలో ప్రేమ వ్యవహారాలతో ఎక్కువగా వార్తల్లో నిలిచిన హీరోయిన్ ఈ మధ్య ఎవరైనా ఉన్నారు అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చే హీరోయిన్ నయనతార. నయనతార సినీ రంగంలోకి వచ్చి తొలినాళ్లలో శింబుతో ప్రేమ వ్యవహారం అప్పట్లో ఓ సెన్సేషన్.

ఇద్దరూ పడకగదిలో ఒకరి పెదాలను ఒకరు జుర్రుకుంటూ ముద్దుల్లో మునిగి తేలుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ కావడంతో అప్పట్లో సంచలనం క్రియేట్ చేసాయి. అయితే వీరి ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వెళ్లలేదు. విడిపోవడం వల్ల ఇద్దరూ పెద్దగా హర్టయింది కూడా లేదు. తర్వాత ఎవరి దారి వారు చూసుకున్నారు.

అయితే నయనతార డీప్‌గా ప్రేమలో మునిగి తేలింది మాత్రమ ప్రభుదేవాతోనే. ఇద్దరూ కొంతకాలం కలిసి సహజీవనం కూడా చేసారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. నయనతార తను ప్రేమించిన ప్రభుదేవను చాలా నమ్మింది. ఆయనే తన సర్వస్వం అనుకుంది. ఆయన కోసం అన్నీ వదుకోవాలని నిర్ణయించుకుంది. తనకు ఇంత పేరు, ప్రతిష్టలు, డబ్బు తెచ్చి పెట్టిన సినిమాలకు కూడా దూరం అవ్వాలనుకుంది. మతం కూడా మార్చుకోవాలని నిర్ణయించుంది.

ఒక మహిళ ఒక పురుషుడి కోసం ఇన్ని త్యాగాలు చేస్తుందంటే అతడిపై ఆమెకు ఎంత నమ్మకం, ప్రేమ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మరి ప్రభుదేవా ఆమె నమ్మకాన్ని నిలబెట్టుకోలేదో? మరేమో? తెలియదు కానీ ఇద్దరూ విడిపోయారు. ఈ సంఘటన తర్వాత నయనతార కొంతకాలం డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. మళ్లీ ఆమె కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఆమె స్నేహితులు మళ్లీ నువ్వు సినిమా రంగంలోకి వెళితేనే నీ మనసు తేలిక అవుతుంది, అన్నీ మరిచి పోగలుగుతావు అని సలహా ఇవ్వడంతో సినిమా రంగంలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించి సక్సెస్ ఫుల్ గా సాగుతోంది నయనతార.

ఇటీవల ఓ పత్రిక ఇంటర్వ్యూలో నయనతర తన జీవితం, ప్రేమ, కెరీర్ తదితర అంశాలకు సంబంధించిన అంతరంగాన్ని బయట పెట్టింది.

విడిపోవడమే మంచింది..

విడిపోవడమే మంచింది..


ప్రేమలో ఉన్న ఇద్దరి మధ్య ఒక్కరి నుంచి సమస్య తలెత్తినా ఇద్దరికీ ఇబ్బందే. చిన్నచిన్న అపార్థాలూ, మనస్పర్థలను ఒక దశ వరకూ భరించొచ్చు. కానీ అవి భరించలేనంతగా ఉంటే విడిపోవడమే మంచింది అన్నారు నయనతార.

నాకూ అలాంటి అనుభవం

నాకూ అలాంటి అనుభవం


ప్రేమలో ఉన్నపుడు నాకు అలాంటి అనుభవమే ఎదురైతే విడిపోవాలని నిర్ణయించుకున్నాను అని ననయనతార తెలిపారు.

అన్నీ వదులుకోవడానికి సిద్దపడ్డా

అన్నీ వదులుకోవడానికి సిద్దపడ్డా


ఓ దశలో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమవుదామనుకున్నా. ప్రేమ కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమేనన్న విషయం అవతలి వ్యక్తికి తెలియజేయాలని ఆ నిర్ణయం తీసుకున్నా అని నయనతార తెలిపారు.

భావోద్వేగాలు

భావోద్వేగాలు


సామాన్యులైనా, సెలెబ్రిటీలైనా భావోద్వేగాలనేవి అందరికీ ఒకలానే ఉంటాయి. కానీ దాన్నుంచి బయటపడటానికి నాకు సినిమాలనే చక్కటి ప్రత్యామ్నయం దొరికిందని నయనతార తెలిపారు.

డబ్బు కోసం చేయను

డబ్బు కోసం చేయను


నా మనసుకు నచ్చితే ఏ పనైనా చేస్తా...కేవలం డబ్బు కోసం మాత్రం ఏ పనీ చేయను. తమిళంలో ‘బిల్లా' సినిమా కోసం బికినీ వేసుకున్నా. కానీ తెలుగులో ఆ సన్నివేశం మళ్లీ చేయడం ఇష్టంలేక సినిమాని వదులుకున్నా అని నయనతార తెలిపారు.

మగాళ్లలో నచ్చేది

మగాళ్లలో నచ్చేది


నిజాయతీగా ఉండే మగవాళ్లను ఎవరైనా ఇష్టపడతారు. అది చాలా చిన్న లక్షణంలానే అనిపించినా అతి ఉంటేనే బంధాలు బావుంటాయి అన్నారు.

గ్లామర్

గ్లామర్


గ్లామర్‌ అనేది దుస్తుల్లోనో, మేకప్‌లోనో కాదు, వ్యక్తిత్వంలో ఉంటుంది. నేను సినిమాల్లో బికినీల కంటే చీరల్లో, తక్కువ మేకప్‌తో నటించిన పాత్రల్లోనే ఎక్కువ అందంగా ఉన్నాననిపిస్తుందని తెలిపారు.

సోషల్ మీడియాలో లేను

సోషల్ మీడియాలో లేను


ఫేస్‌బుక్‌ ట్విటర్‌ లాంటి వాటిలో ఎలాంటి ఖాతాలూ లేవు. నాకు ఇబ్బంది కలగనంత వరకు అభిమానులు నాపేరుతో నిర్వహిస్తున్న ఖాతాలు ఓకే.

భవిష్యత్తులో పెళ్లి?

భవిష్యత్తులో పెళ్లి?


నా జీవితం నేను అనుకున్నట్లుగా ఎప్పుడూ జరుగలేదు. అందుకే భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదు అంత సమయం కూడా లేదు. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నాను అన్నారు నయనతార.

English summary
South hot actress Nayantara about love and relationship. Nayanthara is an Indian film actress who predominantly appears in Tamil, Telugu, and Malayalam films. She is also the recipient of numerous awards.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu