మహేష్ సినిమాలో ఓ స్టైలిష్ క్యారెక్టర్ కోసం నయనతార...!
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా 'బిజినెస్ మ్యాన్" సినిమా తెరకెక్కనున్న సంగతి తెల్సిందే. ఈ సినిమా కోసం పూరి జగన్నాథ్, ఏరికోరి మరీ కాజల్ ని హీరోయిన్ గా బుక్ చేసుకున్నాడు. హన్సిక ఈ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ చేయనుందనే గాసిప్స్ విన్పిస్తున్నాయి. ఇదిలా వుంటే ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నయనతార కన్పించనుందట. ఐదు నిమిషాల పాటు కన్పించే ఈ పాత్ర కోసం నయనతార అయితే బావుంటుందని పూరి భావిస్తున్నట్టు సమాచారం.
చాలా స్టైలిష్ గా ఈ పాత్ర వుండబోతోందని, ఆల్రెడీ నయనతారతో ఈ పాత్ర కోసం పూరి సంప్రదింపులు జరిపాడని తెలస్తోంది. నయనతార సైతం పూరి ఆఫర్ కి ఓకే చెప్పిందట. గాసిప్స్ విన్పిస్తున్న వార్తలే నిజమైతే, మహేష్ తో నయనతార జతకట్టడం ఇదే తొలిసారి అవుతుంది.
nayantara mahesh babu the business man kajal hansika నయనతార మహేష్ బాబు ది బిజినెస్ మేన్ కాజల్ హన్సిక


Click it and Unblock the Notifications