»   » ప్రకాష్‌ రాజ్ కోసం.. ప్రభు-నయన పెళ్లి వాయిదా

ప్రకాష్‌ రాజ్ కోసం.. ప్రభు-నయన పెళ్లి వాయిదా

Posted By:
Subscribe to Filmibeat Telugu

అన్ని అడ్డంకులు తొలగిపోయాయి... ఇక పెళ్లికి అంతా సిద్దం అయింది అనే తరుణంలో ప్రకాష్ రాజ్ రూపంలో ప్రభుదేవ-నయనతారలకు అడ్డంకి ఎదురైంది. దీంతో తమ పెళ్లిని మరి కొంత కాలం వాయిదా వేసుకోక తప్పలేదు. ప్రకాష్ రాజ్ 'ధోనీ" అనే సినిమాకు దర్శకత్వం వహిస్తూ బిజీగా ఉండటమే ఇందుకు కారణం.

ఆయన సినిమాకు, వీళ్ల పెళ్లికి ఏమిటి సంబంధం అనుకుంటున్నారా? ఉందండీ బాబూ.... సినిమాల్లో వివిధ విభిన్నమైన పాత్రలు పోషిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్న ప్రకాష్ రాజ్...నిజ జీవితంలోనూ ఓ భిన్నమైన రోల్ చేస్తున్నారు. ప్రభుదేవా-నయనతారలకు ప్రకాష్ రాజ్ అత్యంత సన్నిహితుడు. వీళ్ల పెళ్లి కార్యక్రమాలు అన్ని ఆయనే దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. సెప్టెంబర్ లో వీళ్ల పెళ్లి జరుగాల్సి ఉంది. ప్రకాష్ రాజ్ బిజీగా ఉండటంతో పెళ్లి అక్టోబర్ కు వాయిదా పడింది.

మరో విషయం ఏమిటంటే....ప్రభు-నయన ప్రేమలో పడిన కొత్తలో ప్రకాష్ రాజ్ ఇంట్లోనే ఏకాంతంగా గడిపేవారట. షూటింగుల పేరుతో ప్రకాష్ ఊర్లు తిరుగుతుండటంతో తమ రొమాన్స్ కోసం ఆయన ఇంటిని వాడుకునే వారట.

English summary
Prakash Raj is busy with his Tamil bilingual - Telugu Dhoni Movie Shooting this month. So,Prabhudeva Postponed the marriage to next month October instead of September.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu