»   »  "మీడియాతో మాట్లాడటం నావల్ల కాదు"

"మీడియాతో మాట్లాడటం నావల్ల కాదు"

Posted By:
Subscribe to Filmibeat Telugu


మీడియాతో ముందు మాట్లాడాలంటే నాతో కాదు...వినడానికి ఇది కొంచెం ఇబ్బందిగా ఉండవచ్చు కానీ ఇది నిజం.. కెమరా ముందు నటించమంటే నటిస్తాను...అలిసిపోయే దకా నటిస్తాను...అదే నా కెరీర్ గురించో లేక సినిమా గురించో మీడియాతో మాట్లాడమంటే నాకు చేతకాదు...చేతనయ్యేదొక్కటే...నేను నటించిన సినిమా విజయం సాధించాలని దేవుడిని ప్రార్ధించడమే..ఇంతదాకా నేను మంచి నిర్మాతలతో పనిచేశాను..వారు నా నిస్సహాయతను చక్కగా అర్థం చేసుకున్నారు....అంటూ నయనతార చెబుతోంది. సినిమా ప్రమోషన్ కోసం నయనతార మీడియా మీట్ లో పాల్గొనాల్సిందిగా కోరగా తనతో కాదంది. నా పని నటన వరకే అంటూ తప్పించుకుంది.

తులసి సినిమా షూటింగ్ జరుగుతున్నన్నాళ్లు హీరో వెంకటేష్ తో క్లోజ్ గా మూవ్ అయినట్టు వస్తున్న వార్తలను ఆమె కొట్టిపడేసింది. వెంకటేష్ నిజంగా జెంటిల్ మాన్....నిజమైన ప్రొఫెషనల్ నటుడు...ఆయన సరసన నటించడం చాలా సులువుగా అనిపించింది.. ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను...అప్పటినుంచి నా ఆలోచనా ధోరణిలో కూడా చాలా మార్పు వచ్చింది... అంటోంది. తమిళ హీరోలలో రజనీ సార్ చాలా గ్రేట్ ఆయనతో ఎవరినీ పోల్చవద్దని అంటోంది. రజనీ సర్ సినిమాలో చిన్న పాత్ర చేయమన్నా చేస్తానంటోంది.

Read more about: media nayantara
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X