For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Jr NTR: నయనతారకు కవల పిల్లలు.. ఎప్పుడో చెప్పేసిన జూనియర్ ఎన్టీఆర్.. ట్రెండింగ్ లో వీడియో

  |

  నయనతార సినీ ఇండస్ట్రీకి వచ్చి దాదాపుగా 17 ఏళ్లు కావోస్తుంది. దక్షిణ చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. తెలుగు, మలయాళ, తమిళ భాషల్లో చిత్రాలు చేసి సౌత్​ ఇండియా లేడి సూపర్​ స్టార్​గా స్టార్​డమ్​ సంపాందించుకుంది. ఇదిలా ఉంటే ఇటీవల కోలీవడ్​ డైరెక్టర్​ విఘ్నేష్​ శివన్​ను పెళ్లాడి, వివాహ బంధంలో మునిగితేలుతున్న నయనతార తాజాగా అంటే ఆదివారం గుడ్ న్యూస్ తెలిపింది. ఇద్దరు మగ కవల పిల్లలకు జన్మనిచ్చినట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే నయనతారకు కవల పిల్లలు పుడతారనే విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ అప్పట్లోనే చెప్పారని ఓ వీడియో ట్రెండ్ అవుతోంది. మరి ఆ వీడియో వివరాలేంటో చూద్దామా!

  జూన్‌ 9న వివాహా బంధంతో ..

  జూన్‌ 9న వివాహా బంధంతో ..

  సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార, కోలీవుడ్ పాపులర్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ ల మధ్య ప్రేమ, డేటింగ్‌ల మీద ఎన్ని రకాల రూమర్లు వచ్చాయో అందరికీ తెలిసిందే. కొన్ని రోజులేమో.. ఈ ఇద్దరూ విడిపోయారని వార్తలు వచ్చాయి. ఇంకొన్ని రోజులేమో డేటింగ్‌లోనే ఉన్నారనే కథనాలు వచ్చాయి. ఇంతలోనే దోష నివారణ కోసం గుళ్లూ గోపురాలు తిరుగుతున్నారని, త్వరలోనే వివాహాం చేసుకుంటారని వార్తలు వినిపించాయి. ఈ ప్రేమ, డేటింగ్, పెళ్లి పుకార్ల తర్వాత మొత్తానికి నయన్ విఘ్నేశ్ ఇద్దరూ కూడా జూన్‌ 9న వివాహా బంధంతో ఒక్కటయ్యారు.

  రూ. 25 కోట్లకు కొనుగోలు..

  రూ. 25 కోట్లకు కొనుగోలు..

  మహాబలిపురంలో నయన్ విఘ్నేశ్ పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. వీరిద్దరి పెళ్లికి కోలీవుడ్ నుంచి అతిరథ ప్రముఖులు హాజరైన విషయం తెలిసిందే. ఇక ఈ వివాహానికి సంబంధించిన కాంట్రాక్ట్ నెట్ ఫ్లిక్స్ రూ. 25 కోట్లకు కొనుగోలు చేసిందని తెలిసిందే. ఇటీవల వారి పెళ్లి వేడుకలకు సంబంధించిన ఓ వీడియోను కూడా విడుదల చేసింది. ఇదిలా ఉంటే పెళ్లి తర్వాత నయనతార, విఘ్నేష్ శివన్ లు హనీమూన్ కోసమని అనేక ప్రాంతాలు చుట్టివచ్చారు

  ఉయిర్, ఉలగమ్ గా పేర్లు..

  ఉయిర్, ఉలగమ్ గా పేర్లు..

  తమ వివాహ బంధాన్ని ఎంతో ఆనందంగా గడిపారు. ఫలితంగా నయన్ విఘ్నేష్ దంపతులకు పండంటి ఇద్దరు మగ కవల పిల్లలు జన్మించారు. ఈ గుడ్ న్యూస్ ను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది నయనతార. అంతేకాకుండా వాళ్లిద్దరి పేర్లు ఉయిర్, ఉలగమ్ అని ప్రకటించింది. తన కవల పిల్లలను చిట్టి కాళ్లను ముద్దాడుతూ ట్విటర్ వేదికగా ఫొటో షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది ఈ లేడి సూపర్ స్టార్.

  సరోగసీ విధానం ద్వారా..

  సరోగసీ విధానం ద్వారా..

  ప్రస్తుతం నయనతార, విఘ్నేష్ కవల పిల్లల అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా రన్ అవుతోంది. పెళ్లి చేసుకున్న నాలుగు నెలల్లోనే ఎలా కవలపిల్లలకు జన్మనిచ్చింది అని అనేకమందికి వస్తున్న సందేహం. అయితే నయనతార సరోగసీ విధానం ద్వారా కవలపిల్లలకు జన్మనిచ్చి ఉండొచ్చు అని పులువురు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ విషయంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావిస్తూ ఓ వీడియో వైరల్ అవుతోంది.

  మచ్చ శాస్త్రం చెబుతుందని..

  మచ్చ శాస్త్రం చెబుతుందని..

  నయనతారకు కవలపిల్లలు పుడతారనే విషయం జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పాడని దీని సారాంశం. నయనతార ఎడమ నడుము మడతలో పుట్టుమచ్చ ఉందని, అందుకే ఆమెకు కవల పిల్లలు పుడతారని మచ్చ శాస్త్రం చెబుతుందని ఎన్టీఆర్ ముందే గెస్ చేసి చెప్పాడని సరదాగా మాట్లాడుకుంటున్నారు. అయితే నయనతార, ఎన్టీఆర్ కలిసి నటించిన అదుర్స్ మూవీ గుర్తుండే ఉంటుంది.

  సరదాగా కామెంట్లు..

  నయనతార తనకు కవలపిల్లలు పుట్టారనే విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో అదుర్స్ చిత్రంలోని ఆ సన్నివేశపు వీడియోను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. సో లేడి సూపర్ స్టార్ నయనతారకు కవలలు పుడతారని ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పాడని సరదాగా కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ వీడియో ట్రెండ్ అవుతోంది. కాగా ''మా ప్రార్థనలు, మా పూర్వీకుల ఆశీర్వాదాలతో ఇద్దరు పిల్లలు మా జీవితంలోకి వచ్చారు. మాకోసం మీ అందరి ఆశీస్సులు కూడా కోరుకుంటున్నా'' అని విఘ్నేష్ శివన్ ట్వీట్ చేశాడు. .

  English summary
  South Lady Super Star Nayanthara And Kollywood Director Vignesh Shivan Blessed With Twin Baby Boys And Jr NTR Name Trending In Social Media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X