For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Nayanthara: సరోగసి కేసు నుంచి బయటపడేందుకు నయనతార ప్లాన్?.. లాయర్లతో మీటింగ్!

  |

  లేడి సూపర్ స్టార్ నయనతార, కోలీవుడ్ పాపులర్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ఇటీవల తల్లిదండ్రులైనట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అక్టోబర్ 9న పూర్వీకుల ఆశీర్వాదాలతో మగ కవల పిల్లలు ఉయిర్, ఉలగమ్ పుట్టారని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అయితే ఈ ఆనందం ఎక్కువసేపు నిలువలేదు. ఈ జంట సరోగసి పద్ధతిలో పిల్లలను కన్నదని, అది నబంధనలకు అననుగుణంగా పిల్లలను కన్నారా లేదా అని తమిళనాడు ప్రభుత్వం నోటీసులు జారి చేసిన విషయం తెలిసిందే. ఇందుకోసం ఓ కమిటీని నియమించింది కూడా. ఈ కమిటీ, ఒకవేళ కేసు అయితే దాని నుంచి ఎలా తప్పించుకోవాలా అని నయనతార దంపతులు ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

  అభిమానులకు శుభవార్త ..

  అభిమానులకు శుభవార్త ..

  సౌత్ లో స్టార్ హీరోయిన్ నయనతార, కోలీవుడ్ టాప్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ దంపతులు అక్టోబర్ 9న పండంటి మగ కవలలకు జన్మనిచ్చామని అభిమానులకు శుభవార్త అందించారు. దీంతో సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలతో నయన్ దంపతులను ఆశీర్వదించారు. అయితే తల్లిదండ్రులం అయ్యామనే వారి ఆనందం వెంటనే ఆవిరైపోయింది. నిబంధనలకు అనుగుణంగానే సరోగసి ద్వారా పిల్లలు కన్నారా అని నయనతార దంపతులకు తమిళనాడు సర్కారు నోటీసులు జారీ చేసింది.

  చట్ట బద్ధంగా జరిగిందా? లేదా..?

  చట్ట బద్ధంగా జరిగిందా? లేదా..?

  లేడి సూపర్ స్టార్ నయనతార సరోగసి ద్వారా తల్లి కావడం చట్ట బద్ధంగా జరిగిందా..? లేదా..? అనే విషయాన్ని విచారించేందుకు తమిళనాడు సర్కారు ఒక త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీ వారం రోజుల్లో తమిళనాడు ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలి. ఇందులో భాగంగానే నయనతార, విఘ్నేష్ శివన్ లను విచారణ చేయనుంది ఆ కమిటీ.

  అద్దె గర్భాన్ని ఇచ్చింది ఎవరు?

  అద్దె గర్భాన్ని ఇచ్చింది ఎవరు?

  అయితే నయనతార పిల్లలకు అద్దె గర్భాన్ని ఇచ్చింది ఎవరనే విషయంపై లోతుగా విచారణ జరుగుతోంది. కేరళకు చెందిన ఓ మహిళ సరోగసి ద్వారా పిల్లలను కని నయనతారకు ఇచ్చినట్లు విచారణలో తేలింది. ఆమె నయనతారకు ఫ్రెండ్ అని సమాచారం. కేరళలో వీరిద్దరు కలిసి చదువుకున్నారట. తనతోపాటు చదువుకున్న స్నేహితురాలితేనే నయన్ ట్విన్ బేబి బాయ్స్ కు జన్మనిచ్చిందని తెలుస్తోంది.

  సరోగసికి కొన్ని రూల్స్..

  సరోగసికి కొన్ని రూల్స్..

  సరోగసి ద్వారా పిల్లలను పొందడానికి కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి. ఆ నియమనిబంధనలను నయనతార అతిక్రమించింది అని ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. ఈ విషయంపై ప్రస్తుతానికైతే నయన్ దంపతులపై ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. కానీ తమిళనాడ్ గవర్నమెంట్ మాత్రం సరోగసి విధానం రూల్స్ ప్రకారం జరిగిందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలనుకుంటుంది.

  పదేళ్లు జైలు శిక్ష..

  పదేళ్లు జైలు శిక్ష..

  ఒకవేళ నయనతార నిబంధనలు అతిక్రమించిందని నిరూపించబడితే మాత్రం పదేళ్లు జైలు శిక్ష, రూ. 10 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంది. దీంతో నయనతార లాయర్లను సంప్రదిస్తోందని టాక్ వినిపిస్తోంది. ఈ కేసు నుంచి ఎలా బయటపడాలనే విషయంపై సమాలోచనలు జరుపుతున్నట్లు టాక్. అలాగే తను సరోగసి పొందిన మహిళను దుబాయ్ సిటిజన్ గా చూపించాలనుకున్నారని ఒక వార్త అయితే హల్ చల్ చేసింది. అందులో ఎంత నిజముందనేది మాత్రం తెలియదు.

  సరోగసి నిబంధనలు..

  సరోగసి నిబంధనలు..

  సరోగసి పద్ధతి ద్వారా పిల్లల్ని కనడానికి తమిళనాడు సర్కారు 90 నిబంధనలతో కూడిన ప్రమాణాలను రూపొందించింది. ఆ రూల్స్ ప్రకారం.. సంతానోత్పత్తికి సంబంధించిన కణాలను దానం చేసిన మహిళ వయసు 21 నుంచి 36 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఆమె తప్పనిసరిగా వివాహిత అయి ఉండాలి. సరోగసి ద్వారా పిల్లల కనాలనే విధానాన్ని పాటించే ముందు ఆ మహిళ తన భర్త నుంచి అనుమతి పొందాలి అనేటువంటి తదితర నిబంధనలు ఉన్నాయి.

  భారతదేశంలో సరోగసి బ్యాన్..

  భారతదేశంలో సరోగసి బ్యాన్..

  ఇక నయన్ కవలలకు జన్మనిచ్చిందన్న వార్త వచ్చినప్పుడు ఈ సరోగసికి సంబంధించి సీనియర్ హీరోయిన్ కస్తూరి శంకర్ ఓ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ట్వీట్ లో ''భారతదేశంలో సరోగసిని బ్యాన్ చేశారు. 2022 సంవత్సరం నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. క్లిష్ట పరిస్థితుల్లో తప్ప ఈ పద్ధతిని ప్రోత్సహించకూడదు. వచ్చే రోజుల్లో ఈ సరోగసి పద్ధతి గురించి ఎక్కువగా వినబోతున్నాం'' అని చెప్పుకొచ్చింది కస్తూరి.

  English summary
  South Lady Super Star Nayanthara Meets Lawyers Over Tamil Nadu Government Probe On Surrogacy After Announcing Blessed With Twin Baby Boys.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X