For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Netrikann Twitter Review: నయనతార నటవిశ్వరూపం.. నెట్రికన్ మూవీ హైలైట్స్ ఇవే.. క్లైమాక్స్ మాత్రం!

  |

  ఆకట్టుకునే అందం.. అద్భుతమైన నటనతో వరుస సినిమాలు చేస్తూ దక్షిణాది మొత్తానికి స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది లేడీ సూపర్ స్టార్ నయనతార. కెరీర్ ఆరంభంలో పెద్దగా గ్లామర్ రోల్స్‌ మాత్రమే చేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత నుంచి పంథాను మార్చుకుంది. ఈ క్రమంలోనే తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లోనే నటిస్తోంది. అదే సమయంలో లేడీ ఓరియెంటెడ్ మూవీలతో పాటు ప్రయోగాత్మక చిత్రాలను ఎక్కువగా చేస్తోంది.

  ఇందులో భాగంగానే ఇప్పుడు నయనతార 'నెట్రికన్' అనే క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో నటించింది. ఈ మూవీ శుక్రవారం నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వచ్చిన మొట్టమొదటి స్పందనను.. ట్విట్టర్‌ ద్వారా వీక్షకులు ఇచ్చిన రివ్యూలను ఒకసారి పరిశీలిద్దాం పదండి!

  ‘నెట్రికన్' అంటూ వచ్చిన నయనతార

  ‘నెట్రికన్' అంటూ వచ్చిన నయనతార

  కెరీర్ ఆరంభం నుంచీ విలక్షణ చిత్రాల్లో నటిస్తూ తనలోని నటిని మరింతగా పరిచయం చేస్తూ ముందుకు సాగుతోంది లేడీ సూపర స్టార్ నయనతార. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో ఛాలెంజింగ్ రోల్స్ చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ‘నెట్రికన్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘గృహం' ఫేం మిలింద్ రౌ తెరకెక్కించిన ఈ సినిమాను నయన్ ప్రియుడు విఘ్నేష్ శివన్ నిర్మించాడు.

  అజ్మల్, మణికందన్, శరన్ కీలక పాత్రలను పోషించారు. గిరీష్ గోపాలకృష్ణన్ దీనికి సంగీతం అందించాడు. ఈ చిత్రంలో నయనతార అంధురాలిగా నటించింది. ఇది ఆగస్టు 13 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

  మెగా ఫ్యామిలీలోకి ఆరియానా గ్లోరీ: అతడితో కలిసి సెల్ఫీ వీడియో.. సీక్రెట్ లీక్ చేసిన బ్యూటీ

  అంచనాలు పెంచేసిన మూవీ ట్రైలర్స్

  అంచనాలు పెంచేసిన మూవీ ట్రైలర్స్

  నయనతార సినిమాలు అంటేనే ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. విభిన్నమైన కథలతో వినూత్నంగా తెరకెక్కుతాయి. మరీ ముఖ్యంగా ప్రతి చిత్రాన్ని ఆమె తనదైన శైలి నటనతో వన్ ఉమెన్ షో చేసుకుంటుంది.

  ఇక, ఇప్పుడు ‘నెట్రికన్' మూవీలోనూ ఆమె అంధురాలిగా ఛాలెంజింగ్ రోల్ చేసింది. దీంతో ఈ సినిమాపై ఆరంభం నుంచే అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే దీని నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ వాటిని మరింతగా రెట్టింపు చేసేశాయి. దీంతో ఈ మూవీ కోసం నయనతార అభిమానులతో పాటు సినీ ప్రియులంతా వేయి కళ్లతో వేచి చూస్తున్నారు.

  నయనతార రేంజ్‌కు తగ్గట్లు.. భారీగా

  నయనతార రేంజ్‌కు తగ్గట్లు.. భారీగా

  అమ్మాయిలను కిడ్నాప్ చేసి హింసించే ఓ సైకో కన్ను అంధురాలైన హీరోయిన్ మీద పడితే.. అతని నుండి తప్పించుకోవడానికి ఆమె ఎలాంటి ప్రయత్నాలు చేసింది.. ఆ సైకో కిల్లర్‌ను ఎలా అంతమొందించింది? అంశాలతో ఆసక్తికరంగా తెరకెక్కిన చిత్రమే ‘నెట్రికన్'.

  ప్రచార చిత్రాలు విడుదలైన తర్వాత ఏర్పడిన అంచనాలకు అనుగుణంగా ఈ సినిమాకు డిమాండ్ ఏర్పడింది. ఈ మూవీ హక్కుల కోసం చాలా సంస్థలు పోటీ పడగా.. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ భారీ ధరకు స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ భాషల్లో ఇది స్ట్రీమింగ్ అవుతుంది.

  పబ్లిక్‌లోనే భర్తతో శ్రీయ శరణ్ రొమాన్స్: అలా రెచ్చగొట్టి మరీ ఘాటు ముద్దులు.. వీడియో వైరల్

  పాజిటివ్ రెస్పాన్స్.. నయనతార పేరే

  పాజిటివ్ రెస్పాన్స్.. నయనతార పేరే

  ‘నెట్రికన్' మూవీపై తమిళంలోని నయనతార అభిమానులతో పాటు తెలుగు, కన్నడం, మలయాళ భాషలకు సంబంధించిన సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవ్వాల్సిన సమయానికి కంటే ముందే బయటకు వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రాన్ని చాలా మంది చూసేశారు. వాళ్లంతా ఇందులో నయనతార నటవిశ్వరూపం చూపించిందని చెబుతున్నారు. అంధురాలిగా ఆమె జీవించేసిందని కితాబిస్తున్నారు. సినిమా మొత్తాన్ని లేడీ సూపర్ స్టార్ ఒంటిచేత్తో తీసుకు వెళ్లిందని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

  నెట్రికన్ మూవీ హైలైట్స్ ఇవేనంటూ

  నెట్రికన్ మూవీ హైలైట్స్ ఇవేనంటూ

  ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ‘నెట్రికన్' మూవీలో నయనతార నటన ప్రధాన ఆకర్షణ నిలిచింది. ఆమె తర్వాత ఈ సినిమాను దర్శకుడు మరో లెవెల్‌కు తీసుకుని వెళ్లాడని సినిమాను చూసిన వారంతా అంటున్నారు.

  మరీ ముఖ్యంగా ఇందులో థ్రిల్లింగ్ పార్ట్ సినిమా చివరి వరకూ తీసుకెళ్లడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెబుతున్నారు. అంతేకాదు, కొన్ని ఎమోషనల్ సీన్స్ మాత్రం వేరే లెవెల్‌లో ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. వీటితో పాటు గిరీష్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుందట. అలాగే, చివర్లో వచ్చే క్లైమాక్స్ ట్విస్ట్ హైలైట్ అని తెలిసింది.

  ఘాటు వీడియోతో షాకిచ్చిన విష్ణుప్రియ: ఓ రేంజ్‌లో రెచ్చిపోతూ అందాల ఆరబోత

  అవి మాత్రం మైనస్‌గా ఉన్నాయంటూ

  అవి మాత్రం మైనస్‌గా ఉన్నాయంటూ

  ‘నెట్రికన్' మూవీని చూసిన వారిలో చాలా మంది ఈ సినిమా బాగుందని చెబుతున్నారు. అయితే, ఇందులో వచ్చే కొన్ని లాజిక్ లేని సీన్లు మాత్రం పరమ బోరింగ్‌గా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. మరీ ముఖ్యంగా అంధురాలైన అమ్మాయి కొన్ని సన్నివేశాల్లో నమ్మశక్యం కాని విధంగా ప్రవర్తిస్తుంటుంది. అది సినిమాకు మైనస్ అని టాక్ వినిపిస్తోంది. అలాగే, సెకెండాఫ్‌లో కొంత ల్యాగ్ ఉందని వీక్షకులు చెబుతున్నారు. అంటే ఎడిటర్ తన కత్తెరకు ఇంకొంచెం పని చెప్పాల్సి ఉందని అంటున్నారు. ఇవన్నీ ఉన్నా సినిమాపై ప్రభావం చూపవని తెలుస్తోంది.

  Sanjana Galrani About Swarna Khadgam Serial | Interview Part 2
  మొత్తంగా ‘నెట్రికన్' ఎలా ఉందంటే?

  మొత్తంగా ‘నెట్రికన్' ఎలా ఉందంటే?

  లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో వచ్చిన ‘నెట్రికన్' మూవీ ఆద్యంతం ఆకట్టుకునే క్రైమ్ థ్రిల్లర్ అని సినిమాను చూసిన వాళ్లంతా చెబుతున్నారు. అయితే, కొన్ని సీన్స్‌లో మాత్రం దర్శకుడు లాజిక్‌ను మిస్ అయ్యాడని, అవి కూడా చూసుకుని ఉంటే సినిమా మరో లెవెల్‌లో ఉండేదన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇంత థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను థియేటర్లలో చూస్తేనే మజా వస్తుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. దీంతో నయనతార చిత్రానికి ఆరంభం నుంచే పాజిటివ్ టాక్ వచ్చినట్లు తెలుస్తోంది.

  English summary
  Lady Super Star Nayanthara Recently Did Netrikann Movie Under Milind Rau Direction. Today This Movie Streaming Strats on disney+hotstar. Check Here To Know Audience Review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X