For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నయనతారకు సరోగసి చేసిన ఆసుపత్రిని గుర్తించిన కమిటీ.. అసలు నిజాలు తెలియనున్నాయా?

  |

  సినీ ఇండస్ట్రీలో దక్షిణ భారతదేశ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది బ్యూటిఫుల్ నయనతార. కోలీవుడ్ పాపులర్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ఇంటీవల సాంప్రదాయ బద్ధంగా వివాహమాడిన నయనతార అక్టోబర్ 9న ఇద్దరు కవలలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. అయితే ఇద్దరు పండంటి మగ బిడ్డలకు పుట్టారన్న ఆనందం నయన్ విఘ్నేష్ దంపతులకు ఎక్కువ సేపు నిలువలేదు. నయన్ సరోగసి ద్వార పిల్లలను కనిందని వార్తలు వైరల్ కావడంతో తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి ఎం సుబ్రమణ్యం ఆ విషయంపై ఓ కమిటీ వేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తమిళనాడు హెల్త్ డిపార్ట్ మెంట్ నయనతార సరోగసి చేసుకున్న ఆస్పత్రిని కనిపెట్టింది.

  కవల పిల్లలు జన్మించారంటూ..

  కవల పిల్లలు జన్మించారంటూ..


  హీరోయిన్ నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ కొన్నేళ్ల రిలేషన్‌షిప్ తర్వాత మహబలిపురంలోని ప్రముఖ హోటల్‌లో జూన్ 9న పెళ్లి చేసుకొన్నారు. ఇటీవల అక్టోబర్ 9వ తేదీన నయన్ తార, విఘ్నేష్ తమకు కవల పిల్లలు జన్మించారంటూ సోషల్ మీడియాలో ప్రకటించిన విషయం తెలిసిందే.

  సరోగసీ ద్వారా..

  సరోగసీ ద్వారా..

  అయితే నయన్ విఘ్నేష్ దంపతులు ఇలా పోస్ట్ పెట్టారో లేదో పెళ్లైన నాలుగు నెలలకే పిల్లలు పుట్టారేంటి అని అందరిలోనూ మెదిలింది. దీంతో వీళ్లిద్దరు సరోగసీ ద్వారా పిల్లల్ని కన్నారని వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తలపై స్పందించిన తమిళనాడు ఆరోగ్య మంత్రి ఎం సుబ్రమణ్యం సరోగసి ద్వారా పిల్లల్ని కనడానికి రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిబంధనలను తల్లిగా నయనతార పాటించారా అనే విషయంపై విచారణ, దర్యాప్తు జరిపించాలని ఆదేశించారు. ఆ నివేదికను వారంలోపు సమర్పించాలని సూచించారు. ఈ క్రమంలోనే విచారణ చేపట్టిన కమిటీ బృందం నయన్ సరోగసి చేసుకున్న హాస్పిటల్ ను కనిపెట్టింది. ఆ ఆసుపత్రి అధికారుల నుంచి వివరాలను సేకరించనున్నారు. తర్వాత అవసరమైతే నయన్- విఘ్నేష్ ల నుంచి వివరణలు సైతం కోరతారు.

   చెన్నైలోని ఓ ఆస్పత్రిలో..

  చెన్నైలోని ఓ ఆస్పత్రిలో..

  నయన్-విఘ్నేష్ దంపతులు చెన్నైలోని ఓ ఆస్పత్రిలో సరోగసి చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఆస్పత్రినే కమిటీ అధికారులు గుర్తించారు. అయితే సరోగేట్ కు ఒప్పుకున్న మహిళ నయనతార కాలేజ్ ఫ్రెండ్ అని ఒక వార్త, ఆమె నయన్ కు బంధువని, దుబాయ్ లో తమ వ్యాపారాలు చూసుకుంటుందని మరో వార్త వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఇంతకుముందు తమిళనాడు ఆరోగ్య విభాగానికి నయనతార ఒక అఫిడవిట్ ను సమర్పించింది. అందులో నయన్-విఘ్నేష్ లకు ఆరేళ్ల క్రితం రిజిస్టర్ మ్యారేజ్ అయిందని పేర్కొంది. దానికి సంబంధించిన మ్యారేజ్ సర్టిఫికేట్ ను కూడా జత చేసింది. సరోగసి నిబంధనల ప్రకారం ఐదేళ్లయిన పిల్లలు లేకపోవడంతోనే సరోగసి ద్వారా పిల్లల్ని కన్నట్లు నయన్ నిరూపించినట్లయింది. అలాగే ఈ సరోగసికి గతేడాది డిసెంబర్ లో అగ్రిమెంట్ జరిగిందని అందులో తెలిపింది.

   నిజమో కాదో అనే అంశంపై..

  నిజమో కాదో అనే అంశంపై..

  అయితే ఈ వివరాలన్ని నిజమో కాదో అనే అంశంపై కమిటీ విచారణ చేపడుతోన్నట్లు తెలుస్తోంది. అందుకే ఆసుపత్రి అధికారుల వద్ద నుంచి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఈ క్రమంలో నయన్-విఘ్నేష్ లను కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. మరి చూడాలి ఆసుపత్రి అధికారులు ఇచ్చిన వివరాలకు, నయన్ దంపతులు చెప్పే సమాధానాలకు పొంతన కుదురుతుందో లేదో అని.

  English summary
  South Lady Super Star Nayanthara And Vignesh Shivan Surrogacy Hospital Identified By Tamil Nadu Health Ministry Over Government Probe
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X